Monday, September 28, 2026
More
    HomePoliticsSP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, సమస్యాత్మక గ్రామా ల్లో జిల్లాఎస్పీ శరత్...

    SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, సమస్యాత్మక గ్రామా ల్లో జిల్లాఎస్పీ శరత్ చంద్రపవార్, ఎ న్నికలకు సహకరించాలని పిలుపు 

    📰 Generate e-Paper Clip

    SP Sharath Chandra Pawar :  ప్రజా దీవెన, హాలియా: గ్రామపం చాయతీ ఎన్నికల ప్రశాంత వాతావ రణంలో తమ ఓటు హక్కు నియో గించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఎ న్నికల నియమావళికి లోబడి నడు చుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాలైన పెద్దవూర, హాలియా, పు లిమామిడి గ్రామాలలోని ప్రజలకు ఎన్నికల నిబంధనల పైన అవగాహ న కార్యక్రమం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గ్రామాలలో పంచాయతీలో ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి విభే దాలకు పోకుండా కలిసిమెలిసి ఉం డాలన్నారు. ఎన్నికలు వచ్చిపోతుం టాయి గ్రామంలో ఉండాల్సినవి ప్ర జలు,కావున ప్రజలు అందరూ కలి సి ఉండాలన్నారు.

    ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుటకు దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రశాంతగా ఓటు విని యోగించుకొని వెళ్లాలన్నారు. గత ఎన్నికల్లో గొడవలు సృష్టించే వారి ని ఇప్పటికే బైండవ చేయడం జరి గిందని వారి పై ప్రత్యేక నిఘా ఏర్ప టు చేశామన్నారు. మళ్ళీ గొడవల కు కారకులు అయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

    జిల్లాలో నగదు, మద్యం,ఉచిత పం పిణీలు లాంటి వాటిపై ప్రత్యేక ని ఘా పెట్టామని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందు న ఎవరూ ఓటర్లను ప్రలోభపెట్టే మ ధ్యం, నగదు ఉచితాలు పంపిణి చే యకూడదన్నారు. ఎవరైనా అలాం టి చర్యలకు పట్టుబడితే సంబం ధిత వ్యక్తులపై కేసులు నమోదు చే స్తామని హెచ్చరించారు.

    ప్రతి ఒక్కరు ఎన్నికల నియమావ ళికి లోబడి నడుచుకోవాలి, ప్రలో భాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓ టు హక్కును సద్వినియోగం చేసు కోవాలని కోరారు.

    ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డియస్పి రాజశేఖర్ రాజు, హాలి యా సీఐ సతీష్ రెడ్డి, హాలియా ఎస్. ఐ సాయి ప్రశాంత్,పెద్దవూర ఎస్.ఐ ప్రసాద్, గ్రామ ప్రజలు తది తరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.