Ex Minister Jagadish Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నిక ల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్య వహరించలేదని మాజీ మంత్రి, సూ ర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరో పించారు. చిట్యాల మండలం చిన కాపర్తి డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్ల ఘటన ప్రజాస్వామానికే అవమా నంగా ఆయన అభివర్ణించారు. కాం గ్రెస్ పాత సంస్కృతిని కొనసాగిస్తూ హత్యలు, బెదిరింపులు ప్రారంభ మయ్యాయని విమర్శించారు. తె లంగాణ ఏర్పడ్డ తర్వాత ఇలాంటి ఘటనలు జరగలేదని, ప్రస్తుతం పో లీస్ శాఖపై మంత్రుల నుంచి ఒత్తి డులు పెరిగాయని తెలిపారు.
శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ని బిఆర్ ఎస్ జిల్లా పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా ట్లాడుతూ ప్రతి రోజు ఇద్దరు మం త్రులు పోలీస్ అధికారులకు ఫోన్లు చేసి బీఆర్‌ఎస్ కార్యకర్తలను ఇ బ్బందులకు గురి చేస్తున్నారని ఆరో పించారు. కొంతమంది పోలీసులు ఎస్పీ ఆదేశాలను కూడా లెక్క చే యకుండా వ్యవహరిస్తున్నారన్నా రు.
చిన్న కాపర్తిలో సర్పంచ్ అభ్యర్థికి వ చ్చిన ఓట్లు మురికి కాల్వలో పడిన దృశ్యం ప్రజలందరూ చూశారని, ఇ ది ప్రజాస్వామ్యానికి అవమానమ ని పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ, జిల్లా క లెక్టర్‌లు తక్షణమే చర్యలు తీసు కొ ని గ్రామాల్లో స్వేచ్ఛాయుతంగా ఎ న్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గుండాలు, రౌడీల దాడుల మధ్య కూడా తమ కార్య కర్తలు వీరోచితంగా పోరాడుతున్నా రని చెప్పారు.
ఇది 100 శాతం ప్రభుత్వ వైఫల్య మని వ్యాఖ్యానించారు.గత రెండు ఏండ్లలో నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఒక్క కొత్త పని కూడా చే యలేదని విమర్శించారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి రైతులు, పెన్షన్ దారులను మోసం చేశారని ఆరోపిం చారు. చిన్న కాపర్తిలో మళ్లీ ఎన్నిక లు నిర్వహించాలని తాము డిమాం డ్ చేస్తున్నామని జగదీష్ రెడ్డి తెలి పారు
ఎన్నికల వేల జిల్లాలో దారుణాలు జరుగుతున్నాయని, చాలా అన్యా యంగా అధికార దుర్వినియోగం చే స్తున్నారని ధ్వజమెత్తారు. అధికా రులు కూడా కాంగ్రెస్ నాయకుల గుంపులో చేరి అక్రమాలు చేస్తున్నా రు. ఎన్నికల కోడ్ వున్నప్పుడు ఉ ద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవ హరిoచాలి కానీ అక్రమాలకు పా ల్పడుతున్నారని, అధికారులు, పో లీసులు, కాంగ్రెస్ నాయకులు కలిసి పోయి చేతులు కలిపారని విమర్శిం చారు.
బిఆర్ఎస్ నాయకులను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని, కాం గ్రెస్ అంటేనే దౌర్జన్యం, దందాలని, కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలు ఇ బ్బందు లు పడుతున్నారని ఆరోపించారు. ప్రతిరోజూ మంత్రులు ఎస్పీలకు ఫో న్ లు చేసి ప్రత్యర్థి పార్టీల నాయ కులను వేధింపులకు గురిచేస్తున్నా రన్నారు. అక్రమ కేస్ లు అరెస్ట్ లు చేస్తున్నారని, పంచాయతీ ఎన్ని క ల్లో కాంగ్రెస్ వాళ్లు గెలిచేలా కుతం త్రాలు చేస్తున్నారని అధికారులు మా అభ్యర్థులు గెలిచిన చోట కూ డా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడిలకు భయపడి ఫలితాలు తారుమారు చేస్తున్నారన్నారు.
రేపు రెండో విడత పోలింగ్ ఉందని, అధికారులు చటబద్ధంగా వ్యవహ రించాలని కోరారు. మొదటి విడత లో 45 శాతం మంది BRS సర్పంచ్ లు విజయం సాధించారని, రాబో యే రోజులు బి ఆర్ఎస్ వేనని ఎ న్నిక ఏదైనా ఇకమీదట గెలిచేది గు లాబీ జెండానే అని ప్రజల గుండెల్లో కేసీఆర్ గూడు కట్టుకున్నారని, రే వంత్ రెడ్డి పనితనం అర్థం అయిం దని, ఇక కాంగ్రెస్ వల్ల ఏమి కాదని ప్రజలకు అర్థం అయిందని ఎద్దేవా చేశారు. ఎన్నో దౌర్జన్యలను ఎదు ర్కొని నాయకులు కార్యకర్తలు పో రాటం చేస్తున్నారని, విజయడంకా మోగిస్తున్నారని కొనియాడారు.
Ex Minster jagadeesh reddy hot comments on voter slips in drainage pic.twitter.com/DZiRLhzDiK
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) December 13, 2025

