Nalgonda Political War : ప్రజా దీవెన, నకిరేకల్: నల్లగొండ జిల్లా లో గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత ప్రశాంతంగా ముగి సినప్పటికీ చిట్యాల మండలం చిన కాపర్తి గ్రామంలో బ్యాలెట్ పత్రాలు డ్రైనేజీలో ప్రత్యక్షమవ్వడం రాజకీ య దుమారం లేపిన విషయం తెలి సిందే. పోలింగ్ ముగిసి ఫలితం వె లువడిన అనంతరం బ్యాలెట్ పత్రా లు బయటపడడం పట్ల ప్రతిపక్ష బి ఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చి రుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆ వెనువంటేనే అధికారులకు ఫిర్యా దు చేసిన విషయం కూడా విధిత మే. అయితే ఈ నేపథ్యంలోనే చి న్నకాపర్తి బ్యాలెట్ పత్రాల వివా దం పై అధికారులు చర్యలకు ఉపక్ర మించినప్పటికీ బిఆర్ఎస్ పార్టీ ఆ ధ్వర్యంలో మాజీ మంత్రి సూర్యా పే ట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాజీ ఎ మ్మెల్యేలు నల్లగొండలో మీడియా స మావేశం పెట్టి అధికార పార్టీపై దు మ్మెత్తి పోశారు.
దీంతో బిఆర్ఎస్ నేతల ఆరోపణల పై నకిరేకల్ శాసనసభ్యుడు వేము ల వీరేశం తనదైన శైలిలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై ఎ దురు దాడి చేశారు. నకరేకల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ
చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రా మ సర్పంచ్ ఎన్నికల గురించి బి ఆ ర్ఎస్ పార్టీ చేస్తున్నవి అసత్య ఆరో పణలoటూ ఖండించారు.
ఉద్దేశపూర్వకంగానే బిఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్యమైన ఆరోపణ లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పో లింగ్ బూత్ లో ఎంజెంట్ల సమక్షం లో లెక్కింపు చేస్తుంటారని, లెక్కిం చిన ఓట్లు, పోలింగ్ ఓట్లను సరి చూసుకోవడం అనవాయితీ అని వివరించారు. ఓటర్ తోని సంతకం తీసుకుంటారు, పోలింగ్ ఆఫీసర్ సంతకం ఉంటుంది ఇదంతా ఎన్ని కల సంఘం నియమావళి మేరకు నడిచే సహజంగా జరిగే కార్యక్రమ మని గుర్తు చేశారు.
మా అభ్యర్థి 400 మైజారీటి తో గె లుపోందాడని గుర్తు చేస్తూ మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ఎన్ని కలు నిర్వహించామని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని ఆదేశించా మని చెప్పారు. సీల్ చేసిన బాక్స్ లో పేపర్ లు మీస్ కావడం జరిగిం దని, అందుకు కారకులైన వారిపై చ ర్యలు తీసుకోవాలని ఇప్పటికే తెలి యజేశామని చెప్పారు.
నకిరేకల్ నియోజకవర్గంలో పాటు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్ని క లు జరిగానాయని అన్నారు. అయి నా పోలింగ్ ఆఫీసర్ లను ఎలా మే నేజ్ చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ లో ఎలాంటి అనుమానాలు లేవని పోటీ చేసిన అభ్యర్థులు సై తం తెలిపారని గుర్తు చేశారు. ఈ జి ల్లాలో గత పాలనలో DTC నడిపి అనేక మందిని ఇబ్బందులు గుర్తు చేశారు.
గడిచిన పది సంవత్సరాల్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఏమి చేశాడో చెప్పాలని, డిండి, బ్రహ్మణవెల్లంల, అయిటిపాముల ఎత్తిపోతల పథకా ల్లో ఏ ప్రాజెక్టు పూర్తి చేశారో చెప్పా లని ప్రశ్నించారు. నేడు ధర్మారెడ్డి, పి ల్లాయిపల్లి కాలువ, 100 పడకల ఆసుపత్రి పనులు చూడు, ఆనాడు కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చేశా మని నేడు కాంగ్రెస్ తోనే అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
