Sunday, September 27, 2026
More
    HomePoliticsMinister Vivek : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తిలో ఐటీఐ, ఏటిడీసీ సెంటర్‌కు మంత్రి వివేక్ శంకుస్థాపన

    Minister Vivek : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తిలో ఐటీఐ, ఏటిడీసీ సెంటర్‌కు మంత్రి వివేక్ శంకుస్థాపన

    📰 Generate e-Paper Clip

    Minister Vivek : ప్రజా దీవెన, తుంగతుర్తి: వెనుకబ డిన ప్రాంతాల్లో యువతకు నాణ్య మైన విద్యతో పాటు ఆధునిక నైపు ణ్య శిక్షణ అందించాలనే లక్ష్యంతో అడ్డగూడూరులో ఐటీఐ, అడ్వా న్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ ( ATDC)కు రాష్ట్ర మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ వెనుకబ డిన ప్రాంతంలో ఐటీఐ ఏర్పాటు కో సం భూమి పూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

    తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సా మేల్ 3,622 కోట్ల రూపాయల నిధు లు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృ ద్ధి దిశగా తీసుకెళ్తున్నారని మంత్రి ప్రశంసించారు. గత బీఆర్‌ఎస్ ప్ర భుత్వం ఒక్క రూపాయి కూడా ఖ ర్చు చేయకుండా వ్యవస్థనునాశనం చేసిందని, ఇచ్చిన హామీలను కే సీ ఆర్ మర్చిపోయారని విమర్శించా రు. ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ లను అమలు చేస్తోందని స్పష్టం చేశారు.

    ఇందిరమ్మ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ఇప్పుడు మళ్లీ కొనసాగిస్తున్నామని, మంత్రి గా పే దలకు ఇళ్ల పంపిణీ జరుగుతోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికా రులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కేసీఆర్ కుటుంబ స భ్యులు ఆస్తుల కోసం పరస్పరం కొ ట్లాడుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్య లు చేశారు.

    యంగ్ ఇండియా స్కూల్స్ పేదలకు వరంగా మారాయని, ఉద్యోగాలు ఇ చ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మం త్రి గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతాయని యువతకు భరోసా ఇచ్చారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెం టర్ల ద్వారా విద్యార్థులకు ఆధునిక శిక్షణ అందిస్తున్నామని, శిక్షణతో పాటు ఉద్యోగ భర్తీ కూడా చేయాల ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ట్లు తెలిపారు. ఉద్యమకారుడైన ఎ మ్మెల్యే మందుల సామేల్ కోసం తుంగతుర్తిలో అత్యుత్తమ టెక్నాల జీ సెంటర్ ఏర్పాటు కోసం కృషి చే స్తానని హామీ ఇచ్చారు.

    ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డీ సీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్ష య్ యాదవ్, జాయింట్ కలెక్టర్ భా స్కర్ రావు, ఏఎస్పీ లక్ష్మీనారాయ ణ, జిల్లా అధికారులు, ప్రజాప్రతిని ధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజ లు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.