Thursday, October 8, 2026
More
    HomeOpinionNalgonda collecter surprise visit hospital : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్...

    Nalgonda collecter surprise visit hospital : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మికతనిఖీ

    📰 Generate e-Paper Clip

    Nalgonda collecter surprise visit hospital : ప్రజా దీ వెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఆయన జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి రో గులకు అందుతున్న వైద్య సేవల గురించి కలెక్టర్ ఆరా తీశా రు. మొదట సూపరింటీండెంట్ కార్యాలయంలో హాజరు రి జిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, అనంతరం వెల్‌నెస్ సెంటర్‌ ను సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యం సక్రమంగా అందుతోందా? అవసరమైన మందులు అందిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.

    కొన్ని మందులు అందుబాటులో లేవని రోగులు చెప్పడంతో వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వాటి సరఫరా పరిస్థితిని తెలుసుకుని, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ఆసుపత్రిలో త్వరలో ప్రారంభించనున్న డి-అడిక్షన్ సెంటర్‌ను కూడా పరిశీలించిన కలెక్టర్, మాదకద్రవ్యాల వ్య సనానికి గురైన వారికి ప్రత్యే క కౌన్సిలింగ్ సౌకర్యాలు కల్పిం చాలని సూచించారు. రోగుల అవ స రాలకు అనుగుణంగా విభాగాలను వేర్వేరుగా ఏర్పాటు చేసి పనులను త్వరితగ తిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

    అనంతరం ఎంసీహెచ్ (మాతా శిశు ఆరోగ్య) వార్డును సంద ర్శించిన కలెక్టర్, గర్భిణీ స్త్రీలతో మాట్లాడి వైద్య సేవల గురిం చి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది తమను బా గా చూసుకుంటున్నారని వారు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆశాకార్యకర్తలను వారి గర్భిణీస్త్రీలను తీసుకువచ్చారు స్వస్థలాల గురించి అ డిగి తెలు సుకున్నారు. మునుగోడు ప్రాంతం నుంచి వచ్చా మని వారు చెప్పగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు క లగ కుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.ఫార్మసీ విభా గాన్ని కూడా పరిశీలించిన కలెక్టర్, మందుల నిల్వలు, పంపిణీ విధా నంపై వివరాలు తెలుసుకున్నారు.

    అనంతరం ఆసుపత్రి సూపరింటెం డెంట్‌తో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ప్రజల కు మెరుగైన వైద్య సేవ లు అందించడం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఆ సుపత్రి సూపరింటిండెంట్ నేత నర సింహా రావు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్లు,తదితరులు కలెక్టర్ వెంట ఉ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.