Wednesday, October 7, 2026
More
    HomeOpinionPanchayat Secretary ACB Trap : బిగ్ బ్రేకింగ్, రూ.15 వేల లంచం తో ఏసీబీ...

    Panchayat Secretary ACB Trap : బిగ్ బ్రేకింగ్, రూ.15 వేల లంచం తో ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి, కాంట్రాక్ట్ కారోబార్

    📰 Generate e-Paper Clip

    Panchayat Secretary ACB Trap : ప్రజా దీవెన, సిద్దిపేట: ప్రభుత్వ కార్యాలయంలో లంచం తీసు కుంటూ పంచాయతీ కార్యదర్శి, కాంట్రాక్ట్ కరోబార్ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కా రు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మం డలం జక్కాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జక్కాపూర్ గ్రామ పం చాయతీ కార్యదర్శి బి. అరుణ, కాంట్రాక్ట్ కరోబార్ దాసరి సంతోష్‌లు ఓ వ్యక్తికి చెం దిన రెండు ఇళ్ల మ్యుటేషన్ దర ఖాస్తు ఫైలును ముందుకు పంపించి, ప్రక్రియను పూర్తి చేసేందు కు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీ బీ అధికారులు తెలిపారు.

    మొద టగా రూ.20 వేల లంచం డిమాం డ్ చేసిన పంచాయతీ కార్యదర్శి అనంతరం రూ.15 వేలకు ఒప్పం దం కుదుర్చుకు న్నట్లు సమాచారం. ఈ మేరకు 06. 10.2026న ఉదయం సు మారు 11 గంటల సమయంలో జక్కా పూర్ పంచాయతీ కా ర్యాల యం లో కాంట్రాక్ట్ కరోబార్ దాసరి సం తోష్ ద్వారా రూ. 15 వేల లంచం స్వీకరిస్తుం డగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు.

    లంచం సొమ్ము రూ.15 వేలను కాంట్రాక్ట్ కరోబార్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక వి ధు లను అక్రమంగా, నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించి అక్రమ లబ్ధి పొందేందుకు ప్రయత్నించిన ట్లు ఏసీబీ అధికారులు పే ర్కొన్నారు.ఇద్దరు నిందితులను అ రెస్టు చేసి హైదరాబాద్‌లోని SPE & ACB కేసుల విచారణ కోర్టు (II అదనపు ప్రత్యేక న్యా యమూర్తి) ఎదుట హాజరుపరుస్తున్నట్లు అధికారులు వెల్లడిం చారు. ఈ కే సుపై దర్యాప్తు కొనసాగుతోంది.

      లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి

    ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లం చం డిమాండ్ చేస్తే ప్రజలు వెం టనే తెలంగాణ ఏసీబీ టోల్‌ఫ్రీ నం బర్ 1064కు సమా చారం అందించాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారు, బా ధి తుడి వివరాలను గోప్యంగా ఉం చుతామని తెలిపారు. అలాగే వాట్సాప్: 9440446106, ఫేస్‌బుక్: Telangana AC B, X/ట్విట్టర్: @Telangana ACB ద్వారా కూడా ఏసీబీని సంప్ర దిం చవచ్చని వెల్లడించారు. ప్రజలు సులభంగా ఫిర్యా దు చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రము ఖ బహిరంగ ప్రదేశాల్లో ఏసీబీ క్యూఆర్‌ కోడ్‌లను ఏర్పాటు చేసినట్లు అధికా రులు తెలిపారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.