Sunday, September 27, 2026
More
    HomePoliticsBig Breaking : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లాపో లీసుల ప్రతిభ, ప్రతి నెలా 100కు...

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లాపో లీసుల ప్రతిభ, ప్రతి నెలా 100కు పై గా సెల్ ఫోన్స్ రికవరీ

    📰 Generate e-Paper Clip

    –జిల్లా పరిధిలో చోరికి గురైన 107 మొబైల్స్ బాధితులకు అందజేత

    –ప్రతి ఒక్కరూ చట్టపరిదిలో బాధ్య తగా నడుచుకోవాలి

    –ఏడాది కాలంలో 1430 మొబై ల్స్ ను బాధితులకు అందించాం

    –సూర్యాపేట జిల్లా ఎస్పీ నర సింహ

    Big Breaking : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యా పేట జిల్లాలో వివిధ రూపాల్లో సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న వాళ్లకు రిక వరీ చేసి క్రమం తప్పకుండా అప్ప గించడం జరుగుతోందని ఆ జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శుక్రవా రం రోజున జిల్లా పోలీస్ కార్యాల యంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏ ర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు 22 లక్షల రూపాయల విలువ గల 107 ఫోన్ల ను గుర్తించి రికవరీ చే సి 10వ సారి సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు (భాదితుల కు) అందజేయడం జరిగిందన్నా రు.

    ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యవసరమైనది, దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం, ఆర్థిక పరమైన అంశాలకు వినియోగిస్తున్నామని, మన విలు వైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అ కౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలై న వంటివి ఫోన్ లో నిక్షిప్తం చేసు కుంటున్నామన్నారు. మొబైల్ చో రికి గురైనా, పోగొట్టుకున్నా అందు లో ఉన్న సమాచారం పోతుందని గుర్తు చేశారు.

    నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నా రు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మా త్రమే కాకుండా తమ వ్యక్తిగత స మాచారంతో సహ డబ్బులను కూ డా కోల్పోవడం జరుగుతున్నారు. ఒక్కో మొబైల్ రికవరీ చేయడానికి సైబర్ వారియర్స్ పోలీస్, టెక్నికల్ టీం పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారన్నారు.

    ఇతర రాష్ట్రాలు బీహార్, ఒరిసా, జార్ఖండ్ ఇలా ఇతర రాష్ట్రాల వారి నుండి ఈ మొబైల్స్ ను రికవరీ చే శారని, పోలీసు ప్రజల ఆస్తుల రక్ష ణలో అనుక్షణం ప్రజల పక్షాన పని చేస్తుంది, తప్పుడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు, నేరాలకు పాల్పడే వారి కి ఫ్రెండ్లీ పోలీస్ ఉండదని, సామా న్యుల పట్ల మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు.ఎవరైన మొబైల్ పోగొట్టు కున్న లేదా దొంగిలించబడిన వెంట నే CEIR పోర్టల్ ( https://www. ceir.gov.in ) నందు నమోదు చే సుకోవాలి, మొబైల్ ను బ్లాక్ చేసి, మీ సేవా ద్వారా ధరఖాస్తు సంభం దిత పోలీసు స్టేషన్ లో సమాచా రం ఇవ్వాలని సూచించారు. పోలీ సు శాఖ కృత నిచ్చయంతో పని చేసి ఈరోజు పెద్దమొత్తంలో ఫోన్స్ రికవరీ చేసి ఇక్కడ భాదితులకు అందించడం జరిగినదన్నారు.

    *రోడ్డు భద్రత చర్యలు పాటిం చాలి.* రోడ్లపై ప్రయాణం చేసే స మయంలో అత్యంత అప్రమత్తంగా వాహనాలు నడపాలని, కుటుంబ పెద్దకు రోడ్డు ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోయే కుటుంబ పెద్ద దిక్కుకోల్పోతుందన్నారు. రోడ్డు భ ద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కో సం పోలీసు శాఖ అరైవ్ అలైవ్ అ నే భద్రత మహాఉద్యమ కార్యక్ర మాన్ని నిర్వహిస్తూ రోడ్డు భద్రత అ పై విసృతంగా అవగాహన కల్పిస్తు న్నామన్నారు.

    ప్రజలు అత్యాసకు పోయి సైబర్ మోసాల బారిన పడోద్దు తక్కువ వడ్డీకి లో న్స్ ఉన్నాయని, తక్కువ సమ యంలో ఎక్కువ డబ్బు సం పాదించవచ్చు, బహుమతులు వ చ్చాయoటే నమ్మి అపరిచితులకు డబ్బులు పంపవద్దు, వ్యక్తిగత వి వరాలు చెప్పవద్దు, మీ పిల్లలు డ్ర గ్స్, అమ్మాయిల రవాణా లాంటి కే సుల్లో చిక్కుకున్నారు డిజిటల్ అరె స్ట్ చేస్తాం అని CBI, CID లాంటి ద ర్యాప్తు సంస్తల పేర్లు చెప్పి డబ్బు లు కడితే కేసు నుండి తప్పిస్తాము అంటారు ఇది నమ్మవద్దు డిజిటల్ అరెస్ట్ అబద్దమన్నారు.

    *ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్* పోలీసు మీకోసం ఉన్నా రు, ప్రజా భద్రతలో అనుక్షణం కృ షి చేస్తున్నాము, మీ ప్రాంతాల్లో జ రుగుతున్న అశాంఘిక చర్యలు, అ క్రమ రవాణాపై పోలీసుకు సమా చారం ఇవ్వాలని ఎస్పీ అప్పీల్ చే శారు. సమాజంలో జరుగుతున్న అసాంఘిక చర్యలు, అక్రమాలు, అక్రమ రవాణా లాంటి వాటిపై ప్ర శ్నించే ప్రతిఒక్కరు యూనిఫాం లే ని పోలీసు, వీటిపై మాకు సమా చారం ఇవ్వండి మీ వివరాలు గో ప్యంగా ఉంచుతామన్నారు.

    ప్రజలు పోలీసులకు మిత్రులుగా ఉంటూ నేరాల నివారణలో భాగ స్వామ్యం కావాలన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సైబర్ వారి యర్స్, డ్రగ్స్ నిర్మూల వారియర్స్ లాగా ఉండాలి వీటిపై సమాచారం ఇస్తే మీరు పోలిసుతో భాగస్వా మ్యం అయినట్లే, సైబర్ మోసాల గురించి చుట్టుపక్కల వారికి అవ గాహన కలిగించాలన్నారు.

    *పోలీసులకు ధన్యవాదాలు..*

    పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొర కదనుకున్న బాధితులు జిల్లా పోలీ సులు టెక్నాలజీ ఉపయోగించి ఫో న్ రికవరీ చేసి అందించినందుకు సంభందిత బాధితులు జిల్లా ఎస్పీ కి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో వివిధ రూపా ల్లో వినియోగదారులు పోగొట్టు కు న్న మొబైల్ ఫోన్స్ ను CEIR అప్లికే షన్ ద్వారా రికవరీ చేసి బాధితు లకు అప్పగించడంలో కృషి చేస్తు న్న ఐ.టి కోర్ సిబ్బందిని, పోలీస్ స్టే షన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభి నందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇ న్స్పెక్టర్ రామా రావు, IT కోర్ ఆర్‌ ఎస్‌ఐ రాజశే ఖ ర్, ఐ‌టి కోర్ సిబ్బంది, మొబైల్ పో గొట్టుకున్న బాధితులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.