CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పే స్ ఫె సి లిటీ సెంటర్‌ను నెలకొల్పడం తెలం గాణ అభివృద్ధిలో ఒక మైలు రాయి గా నిలుస్తుందని ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్రా న్స్‌కు చెందిన సాఫ్రన్ (SAF RAN) సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసె స్ ఇండియా (SAESI) హైద రాబా ద్ జీఎంఆర్ ఎయిరోపార్క్ (ఎ స్ఈ జెడ్) లో నెలకొల్పిన ఫెసిలిటీ సెంట ర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ము ఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఈ సెంటర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. హైదరాబాద్ దేశంలోనే ప్రధాన ఎ యిరోస్పేస్, డిఫెన్స్ హబ్ గా మా రిందని చెప్పారు. ఈ అంశాలను ప రిగణలోకి తీసుకుని బెంగుళూరు, హైదరాబాద్‌ను డిఫెన్స్,ఎయిరో స్పే స్ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధా నమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎయిరో స్పేస్ రంగంలో ముఖ్యంగా వాటి ని ర్వహణ, మరమ్మత్తులు, ఓ వర్‌హా ల్ వంటి సదుపాయాలతో పాటు ప రికరాల తయారీ, పరిశోధన, అభి వృద్ధి రంగాల్లో సాఫ్రన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భార త్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్ ను కేం ద్రంగా ఎంచుకోవడం ఎంతో సంతో షంగా ఉందన్నారు. తెలంగాణపై ఎంతో నమ్మకంతో Safran గ్రూపు తన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసు కు న్నందుకు ఆ సంస్థకు మా అభి నం దనలు. ఈ సెంటర్ ఏర్పాటు ఎ యి రోస్పెస్, రక్షణ రంగంలో తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా ని లుస్తుంది.
ఎయిర్ క్రాఫ్ట్ ఇంజి న్ సర్వీసులను అందించడంలో దేశంలోనే ఇది మొ ట్టమొదటి సెంటర్.ఈ ఫెసిలిటీ సెం టర్‌తో పాటు సాఫ్రన్‌కు చెందిన ఎం 88 మిలటరీ ఇంజిన్ల నిర్వహణ, మ రమత్తులు, ఓవర్ హాల్ (ఎంర్ఓ) కు శంకుస్థాపన చేసుకోవడం సంతో షకరమైన పరిణామం. ఈ MRO భారత వైమానిక దళం, నావికాద ళానికి ఎంతో ఉపయోగపడుతుం ది. సాఫ్రన్ దాదాపు 1300 కోట్ల రూ పాయల ప్రారంభ పెట్టుబడితో ఏ ర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా వె య్యి మందికిపైగా నైపుణ్యం కలిగి న సాంకేతిక నిపుణులు, ఇంజనీర్ల కు ఉపాధి లభిస్తుంది. పెట్టుబ డు లను ఆహ్వానించడం, పారిశ్రామికా భివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రగ తిశీల విధానాలను అవలంభిస్తోం ది. తెలంగాణ అమలు చేస్తోన్న ఎస్ ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్త మమైన వాటిల్లో ఒకటిగా నిలిచిం ది.
ఇక్కడి ప్రపంచస్థాయి మౌలిక సదు పాయాలు, ఎయిరోస్పేస్ పార్కు లు, ఎస్ఈజెడ్‌లు ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీల నుంచి భారీ పె ట్టుబడులనుఆకర్షించాయి. ఎయి రోస్పేస్ రంగంలో గతేడాది ఎగుమ తులు రెట్టింపయ్యాయి. గడిచిన 9 నెలల కాలంలో ఎగుమతులు 30 వేల కోట్లకు పైగా చేరుకుని, మొద టిసారి ఫార్మా ఎగుమతులను అధి గమించడం గమనార్హం. ఎయిరోస్పే స్ రంగంలో తెలంగాణ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుం చి అవార్డును పొందింది. రాష్ట్రంలో నెలకొల్పిన యంగ్ ఇండియా స్కి ల్స్ యూనివర్సిటీ ద్వారా విమానా ల నిర్వహణ అంశాలపై ప్రత్యేక శిక్ష ణ ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది.
నైపుణ్యతను మెరుగుపరచడానికి టాటా టెక్నాలజీస్ సంస్థ భాగస్వా మ్యంతో రాష్ట్రంలోని 100 ఐటీఐల ను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు గా తీర్చిదిద్దాం.ప్రపంచ దేశాల్లోనే అ గ్రశ్రేణి నగరాలతో పోటీ పడాలన్న సంకల్పంతో హైదరాబాద్ విమానా శ్రయం సమీపంలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. తెలంగాణ సమగ్ర అ భివృద్ధి కోసం స్పష్టమైన ప్రణా ళి కను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వ హిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అందరినీ ఆహ్వానిస్తు న్నాం.
భారత లక్ష్యాలను చేరుకోవడంలో భాగస్వామిగా ఉండాలని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్య మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమా నయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరి శ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సాఫ్రన్ గ్రూప్ చైర్మన్ శ్రీ రాస్ మెకలెన్స్, సీఈఓ, డైరెక్టర్ ఒ లివర్ అండ్రీస్ , ఎయిర్‌క్రాఫ్ట్ ఇం జి న్స్ సీఈవో శ్రీ స్టీఫేన్ క్యూయెల్, జీ ఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ జీఎం రావుతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.



