Sunday, September 27, 2026
More
    HomePoliticsSI Betting Scandal : బిగ్ బ్రేకింగ్, బెట్టింగ్ లో బట్టబయ లైన ఎస్ఐ భాగోతం,...

    SI Betting Scandal : బిగ్ బ్రేకింగ్, బెట్టింగ్ లో బట్టబయ లైన ఎస్ఐ భాగోతం, డబ్బుల కోసం సర్వీస్ పిస్టల్ తాకట్టు

    📰 Generate e-Paper Clip

    SI Betting Scandal : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభుత్వ బాధ్యతాయుతమైన సబ్ ఇన్స్పెక్ట ర్ ఉద్యోగంలో ఉండి బాధ్యతారహి తoగా వ్యవహరించిన తీరు విస్తు గొల్పుతోంది. సమాజంలో రుగ్మతల ను రూపుమాపాల్సిన బాధ్యతల్లో ఉండి వ్యసనపరుడైన ఎస్ఐ సా మాజిక రుగ్మతల్లో ఒకటైన బెట్టింగ్ వ్యవహారంలో కూరుకుపోయిన బా గోతం బట్టబయలైంది. సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ ఎస్సైగా ప ని చేస్తున్న భానుప్రకాహాట్ టాఫిక్ గా మారాడు. కేసులను ఛేదించా ల్సిన ఎస్సై తాను దర్యాప్తు చేసిన కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొ త్తును కాజేయడమే కాకుండా ప్ర భుత్వం కేటాయించిన 9ఎంఎం రి వాల్వర్ ను సైతం తాకట్టుపెట్టినట్టు తెలుస్తోంది. ఎస్సైకి కేటాయించిన కీలకమైన సర్వీస్ పిస్టల్ కనిపించ కుండా పోవడాన్ని ఉన్నతాధికారు లు సీరియస్ గా తీసుకున్నారు.

    ప్రస్తుతం భానుప్రకాశ్ ను అదు పు లోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ పోలీ సులు విచారణ చేపట్టారు. ఈ రివా ల్వర్ ను రాయలసీమలోని ముఠా లకు లేదా ఇతర నేరగాళ్లకు విక్ర యించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తు న్నారు. 2020 బ్యాచ్ కు చెం దిన భానుప్రకాష్ అంబర్పేట్ పీఎస్ లో క్రైమ్ ఎస్సైగా పనిచేస్తూ ఇటీవ ల ఒక 4 తులాల బంగారం చోరీ కే సు దర్యాప్తు చేపట్టాడు. ఈ కేసులో బంగారాన్ని రికవరీ చేసినప్పటికీ.. బాధితులకు ఆ సొత్తును అప్పగిం చలేదు. బదులుగా వారికి త్వరలో బంగారం ఇస్తానని నమ్మబలికి లోక్ అదాలత్ లో కేసును క్లోజ్ చేయిం చాడు.

    కేసు క్లోజ్ అయిన తర్వాత కూడా బంగారం ఇవ్వకుండా దానిని తాక ట్టు పెట్టుకున్నాడు. ఈ విషయం ఉ న్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే అతనిపై కేసు నమోదు చే సి సస్పెండ్ చేశారు.అతడు బెట్టింగ్ వ్యసనంలో పడిపోయి దాదాపు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు తెలుస్తోం ది. ఈ అప్పులు తీర్చడా నికి డబ్బు అవసరమవ్వడంతోనే భానుప్రకాష్ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డాడని రి కవరీ చేసిన సొత్తును కాజేశాడని స మాచారం. సస్పెండ్ అయిన తర్వా త భానుప్రకాష్ ఇటీవల అంబ ర్పే ట్ పీఎసక్కు వచ్చి తనకు ఆంధ్రప్ర దేశ్ లో గ్రూప్2 ఉద్యోగం వచ్చిందని ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నానని తోటి సిబ్బందికి చెప్పాడు.

    అనంతరం స్టేషన్ ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్లి తన డ్రాలో పెట్టిన 9ఎంఎం పిస్ట ల్ కనిపించడం లేదని సీసీటీవీ కెమె రాలు చూడాలని కోరాడు. ఉన్నతా ధికారుల సమక్షంలో డ్రాను పరిశీ లించగా బుల్లెట్లు మాత్రమే దొరికా యి, కానీ పిస్టల్ కనిపించలేదు. ఈ సంఘటనతో పిస్టల్ మిస్సింగ్ మిస్ట రీ వెలుగులోకి వచ్చింది. ఈ విష యం విస్తృత స్థాయిలో వైరల్ కావ డం, చీ ఇదేమి వ్యవహారం అంటూ చిత్కారాలు వెల్లువెత్తున్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.