–తెలంగాణలో రెడ్ల రాజ్యం కోసమే బీసీ సర్పంచుల స్థానాలను కోత
–బీసీ రిజర్వేషన్లు తగ్గింపుపై సీఎం, పీసీసీ చీప్ ఎందుకు స్పందిస్తలేరు
–బీసీలకు కడుపు మండే ఈరోజు గాంధీభవన్ ను ముట్టడించాం
— బీసీలకు బిక్షం వద్దే వద్దు చట్టబద్ధ మైన రిజర్వేషన్లే కావాలి
–ఈనెల 30న చలో హైదరాబాద్ ని ర్వహించి బీసీల తడాఖా చూపి స్తాం
–డిసెంబర్ 8, 9 చలో ఢిల్లీ నిర్వ హించి కేంద్రానికి బీసీల సెగ చూపి స్తాం
— బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివా స్ గౌడ్ వెల్లడి
Chairman Jajula Srinivas Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: గ్రామపం చాయతీ ఎన్నికలలో బీసీ రిజర్వేష న్లను నిట్ట నిలువున తగ్గించి బీసీ ల ను రాజకీయ సమాధి చేయాలని కాంగ్రెస్ బిజెపి పార్టీలు కుట్రలు చే స్తున్నాయని, వారి కుట్రల ఫలితమే 60 శాతం ఉన్న బీసీలకు 17 శాతం రిజర్వేషన్లు దక్కయని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నా రు. బుధవారo హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా స మావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఈనెల 30వ తేదీన హైదరాబాదులో జరిగే బీసీల రా జకీయ యుద్ధభేరి సభకు సంబం ధించిన వాల్ పోస్టర్ ను బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ లతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్లు దేవుడెరుగు గానీ, కనీసం గతంలో 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల కంటే ఇప్పుడు జరిగే సర్పంచ్ ఎన్ని కలలో నిట్ట నిలువునా తగ్గించడం చాలా అన్యాయం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ విధానం పేరుతో బీసీలను తడి గుడ్డతో గొం తు కోసిందని, 42% అమలు చేసి ఉంటే 5300 సర్పంచ్ స్థానాలు బీసీలకు దక్కేవని, 17% బీసీ రిజ ర్వేషన్లు అమలు చేయడం మూ లంగా కేవలం 2176 సర్పంచ్ స్థా నాలు మాత్రమే బీసీలకు కేటాయిం చారని, మూడు వేలకు పైగా బీసీ లు సర్పంచ్ స్థానాల కు గండి కొట్టా రని, బీసీలకు రావాల్సిన రిజర్వు స్థానాలను జనరల్ స్థానాలకు కేటా యించి తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల రాజ్యాన్ని గ్రామస్థాయి నుండి తీసు కురావాలని కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో 30 మండలాలలో ఒక్క గ్రామపంచాయతీ బీసీకి రిజర్వు కాలేదని, 80 మండలాలలో ఒకటి రెండు మాత్రమే రిజర్వ్ అయ్యాయ ని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 47 1 గ్రామపంచాయతీలకు ఒక్క గ్రా మ పంచాయతీ కూడా బీసీలకు రిజర్వ్ చేయలేదన్నారు, రాష్ట్ర వ్యా ప్తంగా ఏడు జిల్లాల్లో 10 శాతం లో పు బీసీ రిజర్వేషన్లు, పది జిల్లాల్లో 20 శాతం లోపు రిజర్వేషన్లు కేటా యించాలని రాష్ట్ర ప్రభుత్వం అ ధికారులు ఇష్టానుసారంగా ఎలాం టి శాస్త్రీయమైన ఆధారాలు లేకుం డా బీసీ రిజర్వేషన్లు కేటాయించి బీ సీలను పచ్చి మోసం చేశారని ఆ యన ఆరోపించారు.
ఈనెల 17న సచివాలయంలో జరి గిన క్యాబినెట్ సమావేశంలో బీసీల కు చట్టపరంగా కాకుండా పార్టీపరం గా 42 శాతం కేటాయిస్తామని, ఇం కొక మారు 60 శాతం ఇస్తామని ప్ర కటించిన కాంగ్రెస్, వారు ప్రకటించి నేటి వరకు 9 రోజులు గడిచిన రే పటినుండి (ఈరోజు నుండి) గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేష న్ లు వేస్తున్నప్పటికీ నేటికీ అతిగతి లేకపోవడం వీసులను మరోసారి మోసం చేస్తున్నాడా అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన తె లిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బిజెపి బీసీల పట్ల వ్యతిరేక వైఖరి మూలం గానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు చారిత్రాత్మకంగా తీరని అ న్యాయం జరుగుతుందని, దీనిని స రిదిద్దాల్సిన కాంగ్రెస్ బిజెపి పార్టీలు పార్టీ పరంగా ఇస్తామని మోసం చే స్తూ బీసీలకు రెండు పార్టీలు ద్రోహు లుగా మారారని ఆయన మండిప డ్డారు.
బీసీలకు ఇంత అన్యాయం జరుగు తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లు స్పందించకపోవడం చాలా విచా రకరమన్నారు బీసీలకు జరుగుతు న్న అన్యాయం జీర్ణించుకోలేకే ఈరో జు బీసీ శ్రేణులు గాంధీభవనం ము ట్టడించాయని, రేపు మాకు బిజెపి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తా మని ఆయన హెచ్చరించారు. ఎన్ని కల షెడ్యూల్ తో సంబంధం లేకుం డా బీసీ జేఏసీ ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ వరకు తీవ్రతరం చేస్తా మని అందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన చలో హైదరాబాద్ పే రుతో ఇంద్ర పార్క్ వద్ద బీసీల రాజ కీయ యుద్ధభేరి సభను నిర్వహిస్తా మని, డిసెంబర్ 8 9వ తేదీలో ఢి ల్లీ లో పార్లమెంట్ ను ముట్టడిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ రాష్ట్ర క న్వీనర్ గా పెరికే సురేష్ ను నియ మిస్తూ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీని వాస్ గౌడ్, వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృ ష్ణలు ఉత్తర్వులు జారీ చేశారు.
బీసీ విద్యార్థి సంఘం జాతీయ అ ధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మా, బీసీ జేఏసీ కో చైర్మన్ శేఖర్ సగర, జాజుల లింగం గౌడ్, వేముల రామకృష్ణ, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, తారకేశ్వరి, సమతా యాదవ్, గౌతమి, వరికుప్పల మధు, గూడూ రు భాస్కర్, వెంకటేష్ గౌడ్, లక్ష్మీనా రాయణ, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రం రజ క, కొప్పుల చందు, పద్మావతి, బం డి గారి రాజు, భరత్ తది తరులు పాల్గొన్నారు.
