CM Revanth Reddy : ప్రజా దీవెన హైదరాబాద్: రాష్ట్రం లో జరగబోయే మున్సిపల్, స్థానిక సం స్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలు పు కోసం గల్లిగల్లినే కాదు ఇంటింటి కి గడపగడపకు వెళ్లి ఎన్నికల ప్రచా రం నిర్వహిస్తానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ( anumula revanth reddy) కీలక వ్యాఖ్య చేశారు. తెలంగా ణలో కార్యకర్తల క ష్టం వల్లనే అసెం బ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం లోకి వచ్చామని, ఇప్పుడు కార్యకర్తల ను గెలిపించాల్సిన బాధ్యత మా పైన ఉందని గుర్తు చేశారు. స ర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 66 శాతం సీట్లను గెలుచుకుం దని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేయా లని పిలుపునిచ్చారు.
గురువారం హైదరాబాద్ గాంధీ భవ న్ లో జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చే సిన వ్యాఖ్యలు ఆయన మాటల్లో నే…140 కోట్ల జనాభా కలిగిన దే శంలో 80 శాతం మహా త్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో సభ్యులు.చట్ట సభల్లో బలం ఉందని మోదీ ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడు తోంది. వెట్టి చాకి రిని నిర్మూలించి, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి,ఓటు హక్కు ఇచ్చింది మహాత్మా గాంధీ, అంబేద్కర్. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ( bjp ) గత ఎన్నికల సమ యంలో కుట్ర చేసింది.400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మా ర్చాలని బీజేపీ ప్రయత్నం చేసింది.
రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే దేశ వ్యాప్తంగా తిరిగి ప్రజలను అప్ర మత్తం చేశారు.అదానీ, అంబానీ కి దేశాన్ని అప్పగించే కుట్ర అమలు కా కుండా కాంగ్రెస్ అడ్డుకుంది.ఓటు ప్ర క్షాళన పేరు సర్ (sir ) అనే కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది.సర్ పేరుతో పేదలు, మైనార్టీల ఓ టు హక్కు ను తొలగించే ప్రయత్నం జరుగు తోంది.పేదలకు ఓటు పోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు తో పాటు సం క్షేమ కార్య క్రమాలు అందకుండా పోతాయి..
దేశంలో ఉండాలా లేదా అన్నది బీజేపీ చేతిలో ఉండేలా ప్రయత్నా లు జరుగుతున్నాయి.ఓటు ప్రక్షాళన వెనుక పెద్ద కుట్ర ఉంది. మహా త్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (food for work) తో పేదల ఆత్మగౌరవం పె రిగింది. ఉపాధి హామీ పథకం ప్రారంభానికి, అమలుకు తెలుగు రా ష్ట్రాలే వేదికగా మారాయి. అంబానీ, అదా నీకి తక్కువ వేతనాలకు కూలీలను పంపించడానికే ఉపాధి హామీ పథకంలో మార్పులు చే స్తున్నారు. దీని వెనుక ప్రధాని మోదీ, కార్పొ రేట్ కంపెనీల కుట్ర ఉం ది.గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ప్ర ధాని మోదీ ( modi ) తీసుకు వచ్చారు. నల్ల చట్టాలకు వ్యతిరే కంగా ఆనాడు రాహుల్ గాంధీ కొట్లాడారు.దేశ రైతులకు మోదీ క్ష మాపణ చెప్పి, నల్ల చట్టాలను వెనక్కి తీసు కోవడం లో రాహుల్ గాంధీ విజయ వంతమయ్యారు.మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్ జీ పే రులోనే గందరగోళం ఉం ది.. దేశంలో వికసిత్ భారత్ ఎక్కడుంది.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వర కు పోరాటం చేస్తాం.దేశానికి ఈ వి షయంలో మోదీ తో క్షమాప ణలు చెప్పిస్తాం. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథ కంలో మార్పు లను నిరసిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ నెల 20 నుంచి 30 వర కు ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పా టు చేసి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలి. అన్ని నియో జ కవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యత తీ సుకోవాలి. పార్లమెంటు నియోజ క వర్గాల వారీగా మంత్రులు బాధ్యత తీసుకోవాలి. ప్రతి మండ లా నికి ఒక ఇంచార్జీ ని నియమించాలి, నేను కూడా ఒక మండల బా ధ్యత తీసుకుంటా.
ఫిబ్రవరి మూడు నుంచి తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభ లు ఏర్పాటు చేస్తున్నాం.ములుగులో (mulugu ) ఏర్పాటు చేసే బహి రంగ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వాని స్తాం.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు రాష్ట్ర ఎంపీలు నిరసన తెలపాలి. కాంగ్రెస్ పార్టీ వల్లనే నేను ముఖ్యమం త్రి అయ్యాను. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎప్పుడూ అండగా నిలబ డింది. దేశం ఇబ్బందుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్ర ధాని కావాలి. రాహుల్ గాంధీ ప్రధాని కావడం కోసం తెలంగాణ అం డగా ఉంటుంది. మోదీని ఓడించి రాహుల్ ను ప్రధాని చేయడం కో సం అంతా కష్టపడి పని చే యాలని పిలుపునిచ్చారు.
సామ్రాజ్యవాదుల కంటే బిజెపి ప్రమాదకరం…. పిసిసి విస్తృత స్థా యి సమావేశంలో డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర జ రుగుతోoదని, కాంగ్రెస్ ప్రభుత్వం తె చ్చిన చట్టాలు ఈ దేశంలో సా మాజిక, ఆర్థిక ,రాజకీయ సంస్కరణ లు, గొప్ప మార్పులు తెచ్చా యని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు ఆయన మాటల్లో నే…
సామ్రాజ్యవాదం కంటే బిజెపి ప్రమాదకరం. కేంద్రంలోని బిజెపి ప్ర భుత్వం ఒక్క కొత్త చట్టం తీసుకు రాక పోగా కాంగ్రెస్ ప్రభుత్వం తె చ్చిన చ ట్టాలన్నిటిని రద్దు చేసే కార్యక్రమం చేపట్టింది. చివరకు దేశ స్వతం త్రా న్ని కూడా రద్దు చేస్తుంది. కొత్త ఉపాధి చట్టం రద్దు కోసం రాష్ట్రవ్యా ప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దాం. ప్రభుత్వంలోని పెద్దలు అంతా ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటారు.
భారతదేశ స్వాతంత్రం కోసం గాంధీజీ (gandhi) దేశంలో అనే క పోరాటాలు, ఆందోళన జరిగితే సా మ్రాజ్యవాదులైన బ్రిటిష్ పాల కులు ఏ ఒక్కరోజు గాంధీజీ పై లాఠీ కూ డా ఎత్తలేదు అలాంటిది స్వాతం త్రం వచ్చిన ఆరు నెలల వ్యవధి లోనే పట్టపగలు ఆర్ఎ స్ఎస్ భావ జా లం కలిగిన వ్యక్తులు గాంధీజీని కాల్చి చంపారు బ్రి టిష్ సామ్రాజ్యవా దుల కంటే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన బిజె పి ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం.
దేశానికి దిశానిర్దేశం చేసిన మహా త్మా గాంధీ జాతీయ ఉపాధి హా మీ పథకాన్ని రద్దు చేసేందుకు బీజేపీ ప్ర భుత్వం చేస్తున్న కుట్రలను రాష్ట్రం లోని ప్రజలందరికి వివరించాలి. కొత్త ఉపాధి హామీ చట్టా న్ని రద్దు చేయాలని రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేం ద్రానికి పంపు తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాంగ్రె స్ ప్రభుత్వం ఈ దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీ య మార్పులు తెచ్చేందుకు భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయ కరణ, వరకట్న వ్యతిరేక చట్టం, అం టరానితనం నిర్మూలన, 20 సూత్రాల ఆర్థిక పథకం, హిందూ కోడ్ బిల్, ఆహార హక్కు చట్టం వంటి అనేక చట్టా లను తీసుకువచ్చింది.
అందులో భాగంగా దేశంలోని కోట్లాది ప్రజల కు ఉపాధిని భద్రతను కల్పించేందు కు మహాత్మా గాంధీ జాతీయ ఉపా ధి హామీ పథకాన్ని తీసుకువచ్చింద ని తెలిపారు.ఈ దేశంలో గణనీయమైన మార్పు లు తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకువస్తే బి జెపి ప్రభుత్వం అలాంటి ఒక్క చట్టమైన తీసుకువచ్చిందా కేవలం కాంగ్రెస్ ప్ర భుత్వం తెచ్చిన చట్టాలను రద్దు చే యడమే బిజెపి చే స్తున్న పని తప్ప మరొకటి లేదు. ఉపాధి హామీ చట్టం రాకముందు 40 రూపాయలు గా ఉన్న రోజు కూలి ఒకేసారి వంద రూపాయలకు పెరిగింది, చిన్న రక్త పు చుక్క కారకుండా ఎలాంటి ఉద్యమాలు లే కుండా దేశంలో గొప్ప మార్పును తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జా తీయ ఉపాధి చట్టం చట్టం ఈ దేశంలో ఒక నిశ్శబ్ద విప్లవం సృష్టిం చింది.
వ్యవసాయ సీజన్లో 60 రోజులపా టు కొత్త ఉపాధి చట్టంలో ఉపాధి ప నులకు అవకాశం లేకుండా పోయిం ది దీంతో పేదలు పట్టణా ల కు వలస పోయే ప్రమాదం ఉంది అన్నారు.ఈ రోజుల్లో యజమాను లు ఎంత కూ లీ ఇస్తే అంత తీసుకునే పరిస్థితి.కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జా తీయ ఉపాధి హామీ చట్టంతో సం వత్సరం మొత్తం ఉపాధి పని లభిం చేది అన్నారు. గత చట్టంలో గ్రామం లో అవస రాన్ని బట్టి కూలి పనులు చేసుకునే అవకాశం ఉండేది కానీ కొత్త చట్టం లో కేంద్రం గుర్తించిన గ్రా మాల్లో మాత్రమే పనీ చేసుకునే అ వకాశం ఉంది అని డిప్యూటీ సీఎం వివరించారు.పాత చట్టంలో కాంట్రాక్టర్లకు స్థానం లేదు కానీ ఇప్పుడు కాంట్రాక్టులతో కలిసి పని చేసుకునే లా చట్టంలో మార్పు తీసుకొచ్చారు.
దీని ద్వారా కార్మికులను కాంట్రాక్టర్లకు ధారాధతం చేసే కుట్రను బిజె పి ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ చట్టం అంటే కేంద్రమే నిధులు ఇవ్వాలి, రా ష్ట్రాల ద్వారా వచ్చిన పనులతో ని ధులు కేటాయించాలి కానీ 60 శా తం కేంద్రం 40% రాష్ట్రాలు అంటూ కొత్త నిబంధన తెచ్చారు అని వివ రించారు. రాష్ట్రాలు 40% వాటాను విడుదల చేయకపోతే కేంద్రం తన నిధు లను విడుదల చేయదు అంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో 40శాతం విడుదల చేయరు ఆ తర్వాత కేం ద్రము విడుదల చేయదు మొత్తం గా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉపాధి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరు గుతుంది.
ఉత్తరాది రాష్ట్రాలు 100 రూపాయలు పన్ను కడితే కేంద్రం 300 రూపా యలు కేటాయిస్తుంది అదే మన రా ష్ట్రం వంద రూపాయలు కడితే తి రిగి కేంద్రం 45 రూపాయలు మాత్ర మే కేటాయిస్తుంది కాం గ్రెస్ బలంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో భారీ వ్యత్యా సం ఉంటుందని వివరించారు. కాం గ్రెస్ తెచ్చిన చట్టా లన్నిటిని వరుస గా రద్దు చేసే పనులు బిజెపి ప్రభు త్వం ఉంది ఈ క్రమంలోనే దేశానికి తెచ్చిన స్వాతంత్రాన్ని కూడా రద్దు చేసే కుట్ర జరుగుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మ హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హా మీ చట్టం, బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఉపాధి చట్టం దానివల్ల జరిగే నష్టాలు గ్రామ గ్రామాన వివ రించాలి, కొత్త ఉపాధి హామీ చట్టం రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎ త్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వ హించాలి కొత్త ఉపాధి హామీ పథ కం రద్దు ఉ ద్యమంలో రాష్ట్ర ప్రభు త్వంలోని పెద్దలందరూ పాల్గొంటారని డి ప్యూటీ సీఎం వివరించారు.


