Tuesday, September 29, 2026
More
    HomePoliticsCM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య,అజ్ఞా తంలోని వారు లొంగిపోయి జనజీ...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య,అజ్ఞా తంలోని వారు లొంగిపోయి జనజీ వన స్రవంతిలో కలవాలి 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: స్థానిక ప్రజాప్రతినిధుల ఆకాంక్షలకు అను గుణంగానే ప్రజా ప్రభుత్వం పనిచే స్తుందని, రాష్ట్రంలో జరిగే అభివృ ద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వా ములను చేస్తూ ముందుకు వెళ్లా ల ని ముఖ్యమంత్రి ఎ. రే వంత్ రెడ్డి చెప్పారు. నక్సలైట్లను కూడా అభి వృద్ధిలో భాగస్వాములను చేయా లని ప్రభుత్వం భావిస్తోందని, మా వోయిస్టు నేత గణపతితో పాటు ఇంకా ఎవరైనా అజ్ఞాతంలో మిగిలి న వారుంటే లొంగిపోయి జ నజీవ న స్రవంతిలో కలవాలని పిలుపు నిచ్చారు. మీర్ఖాన్‌పేట భారత్ ఫ్యూ చర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ ని ర్వ హించారు. ఇదే సందర్భంగా గచ్చి బౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ భవనా నికి శంకుస్థాపన చేశారు. అలాగే, మల్కాజిగిరి కమిషనరేట్ భవనం, ఆక్టోపస్ పరిపాలనా బ్లాక్, కుత్బు ల్లాపూర్ డీసీపీ కార్యాలయ భవ నాలను ముఖ్యమంత్రి ప్రారంభిం చారు.

    ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మా ట్లాడుతూ అత్యంత అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి ఇక్కడి సమస్యలు ప రిష్కారం కావాలంటే సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే లు, ఇతర ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని, అ ప్పుడే అద్భుతమైన సిటీగా రాణిం చగలదని చెప్పారు.

    తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలో కలపలేదని, వాటినీ కలపాలని కొంతమంది పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన ప్రతి ని ధులు కొందరు నా దృష్టికి తెచ్చా రు. ఆయా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి తదనుగుణంగా తీర్మానాలు చేసి కలెక్టర్ గారికి పంపించాలి. అ భివృద్ధి ఫలాలు అందరికీ అందిం చాలి. వారి ఆకాంక్షలకు అను గుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుం ది. ఈ ప్రాంతాన్ని అధునాత నగ రంగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్య మని అన్నారు.

    ఈ ప్రాంతం పెట్టుబడులకు అను కూలమైన ప్రదేశమని, ఎక్కడైతే అభివృద్ధి చేసి ప్రపంచానికి చూ పించాలని అనుకున్నామో అక్కడే నిర్వహించాలన్న ఉద్దేశంలో ఇక్క డ 3 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాం. ఇక్కడ పెట్టుబడుల కోసం ఎక్కడెక్కడో ఒప్పందాలు చే సుకోవడమేంటని, ముందుగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ కార్యాలయం నిర్మిస్తున్నాం. జూన్ 2 వ తేదీ లోపే నిర్మాణం పూర్తి చేసుకుని ఆ భవ నం నుంచి కార్యక్రమాలు చేపడు తామని వివరించారు.

    హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, ఓఆర్ ఆర్, అంతర్జాతీయ విమానాశ్ర యం లాంటి వాటిని ప్రతిపాదించి నప్పుడు సాధ్యమవుతాయా అని కొందరు ఆనాడు అవహేళన చేసిం డ్రు. కానీ నిజమయ్యాయి. దేశం లో ఏ నగరానికి లేని విధంగా 160 కి.మీ. మేరకు అవుటర్ రింగ్ రోడ్డు సాధ్యమైంది.

    ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పో యే వారందరినీ ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది. ఎవరికో నష్టం చేయాలన్న ఆలోచన ప్రభు త్వానికి లేదు. మీ పిల్లలు చదువు కున్న వారైతే స్కిల్స్ యూనివర్సి టీలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశా లు కల్పిస్తాం. పేదల పట్ల మానవీ య కోణంలో వ్యవహరించాలి. అ భివృద్ధి కోసం భూములు ఇస్తున్నా రు. వారిని గౌరవించాలి. వారి బా ధలు వినాలని అధికారులకు చె ప్పారు.

    ప్రపంచంలో అద్భుతమైన నిర్మా ణాలు ఇక్కడ వస్తాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టని వారు భవిష్య త్తులో ఏదో కోల్పోయామన్న బాధ పడాల్సి వస్తుంది. శంషాబాద్ బుల్లె ట్ ట్రైన్స్‌కు హబ్‌గా మారనుంది. బుల్లెట్ ట్రైన్స్‌కు తోడు ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలును అనుసంధా నం చేయబోతున్నాం. బుల్లెట్ ట్రై న్ హబ్‌తో పాటు మెట్రో, అతిపెద్ద బస్ టర్మినల్ కూడా నిర్మించబోతు న్నాం. ఇవన్నీ పూర్తిచేయాలంటే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. అభివృద్ధి పనులు వేగం గా చేయాలన్న ఆలోచనలో చిన్న చిన్న తప్పిదాలు దొర్లితే అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కాదు. ప్రభు త్వంపై నమ్మకం పెట్టుకుని ముందు కు నడవాలని కోరారు.

    ముఖ్యమంత్రి మావోయిస్టుల గు రించి మాట్లాడుతూ అజ్ఞాతంలో ఉన్న అగ్రనేత గణపతి లొంగి పో యి జనజీవన స్రవంతిలో కలవా ల ని పిలుపునిచ్చారు. “గణపతి ఆ రోగ్యం బాగా లేదని సమాచారం ఉంది. లొంగిపోతే వారికి అవసర మైన వైద్యం అందిస్తాం. అవసరమై న భద్రత కల్పిస్తాం. సమస్యల పరి ష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుం ది. మావోయిస్టులు ఇంకెవరైనా అ జ్ఞాతంలో ఉన్నా లొంగిపోవాలి. లొంగిపోయిన వారిని ఆర్థికంగా ఆ దుకుంటాం. అభివృద్ధిలో వారంద రినీ భాగస్వాములను చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధించినట్టు. ప్రభుత్వం పిలుపు మేరకు 2024 నుంచి ఇప్పటివరకు 814 మంది నక్సలైట్లు ఉద్యమాన్ని వీడి జనజీ వన స్రవంతిలో కలిశారు” అని చె ప్పారు.

    ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీ ధర్ బాబు, జూపల్లి కృష్ణా రావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమా ర్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ప లువురు ప్రజా ప్రతినిధులు, డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ పో లీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు ఇ తర పోలీసు అధికారులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.