Sunday, September 27, 2026
More
    HomeOpinionCm Revanth Reddy future city : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య,అజ్ఞాతంలోని వారు లొంగిపోయి...

    Cm Revanth Reddy future city : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య,అజ్ఞాతంలోని వారు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి

    📰 Generate e-Paper Clip

     

    Cm Revanth Reddy future city : ప్రజా దీవెన, హైదరా బాద్: స్థానిక ప్రజాప్రతినిధుల ఆకాంక్షల కు అను గుణంగానే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రం లో జరిగే అభివృ ద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వా ముల ను చేస్తూ ముందుకు వెళ్లా ల ని ముఖ్యమంత్రి ఎ. రే వంత్ రెడ్డి చెప్పారు. నక్సలై ట్లను కూడా అభివృద్ధిలో భాగస్వా ములను చేయాలని ప్ర భుత్వం భావిస్తోందని, మావోయిస్టు నేత గణపతితో పాటు ఇంకా ఎవరైనా అజ్ఞాతంలో మిగిలి న వారుంటే లొంగిపోయి జ నజీవ న స్రవంతిలో కలవాలని పిలుపు నిచ్చారు.

    మీర్ఖాన్‌పేట భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ము ఖ్యమంత్రి భూమి పూ జ నిర్వహించారు. ఇదే సందర్భంగా గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీ స్‌స్టేషన్ భవనా నికి శంకుస్థాపన చేశారు. అలాగే, మల్కాజి గిరి కమిషనరేట్ భవనం, ఆక్టోపస్ పరిపాలనా బ్లాక్, కుత్బు ల్లాపూర్ డీసీపీ కార్యాలయ భవ నాలను ముఖ్యమంత్రి ప్రా రంభించారు.

     

    ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మా ట్లాడుతూ అత్యంత అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి ఇక్కడి సమస్యలు ప రిష్కారం కావాలంటే సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే లు, ఇతర ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని, అ ప్పుడే అద్భుతమైన సిటీగా రాణిం చగలదని చెప్పారు.

    తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలో కలపలేదని, వాటి నీ కలపాలని కొంతమంది పరిసర ప్రాంత గ్రామాలకు చెంది న ప్రతి నిధులు కొందరు నా దృష్టికి తెచ్చా రు. ఆయా గ్రా మాల్లో గ్రామ సభలు పెట్టి తదనుగుణంగా తీర్మానాలు చేసి కలెక్టర్ గారికి పంపించాలి. అ భివృద్ధి ఫలాలు అందరికీ అం దించాలి. వారి ఆకాంక్షలకు అను గుణంగా ఈ ప్రభుత్వం ప నిచేస్తుంది. ఈ ప్రాంతాన్ని అధునాత నగరంగా తీర్చిదిద్దాల న్నదే మా లక్ష్యమని అన్నారు.

    ఈ ప్రాంతం పెట్టుబడులకు అను కూలమైన ప్రదేశమని, ఎ క్కడైతే అభివృద్ధి చేసి ప్రపంచానికి చూ పించాలని అనుకు న్నామో అక్కడే నిర్వహించాలన్న ఉద్దేశంలో ఇక్క డ 3 రో జుల పాటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాం. ఇక్కడ పెట్టుబ డుల కోసం ఎక్కడెక్కడో ఒప్పందాలు చేసుకోవడమేంటని, ముందుగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ కార్యాలయం నిర్మిస్తు న్నాం. జూన్ 2 వ తేదీ లోపే నిర్మాణం పూర్తి చేసుకుని ఆ భవనం నుంచి కార్యక్రమాలు చేపడుతామని వివరిం చా రు.హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, ఓఆర్ ఆర్, అంతర్జా తీయ విమానాశ్ర యం లాంటి వాటిని ప్రతిపాదించి నప్పుడు సా ధ్యమవుతాయా అని కొందరు ఆనాడు అవహేళన చేసిం డ్రు. కానీ నిజమయ్యాయి. దేశంలో ఏ నగరానికి లేని విధం గా 160 కి.మీ. మేరకు అవుటర్ రింగ్ రోడ్డు సాధ్య మైంది.

    ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పో యే వారందరినీ ప్రభు త్వం తగిన విధంగా ఆదుకుంటుంది. ఎవరికో నష్టం చేయా లన్న ఆలోచన ప్రభు త్వానికి లేదు. మీ పిల్లలు చదువు కు న్న వారైతే స్కిల్స్ యూనివర్సి టీలో శిక్షణ ఇచ్చి ఉపాధి అ వకాశా లు కల్పిస్తాం. పేదల పట్ల మానవీయ కోణంలో వ్య వహరించాలి. అ భివృద్ధి కోసం భూములు ఇస్తున్నా రు. వా రిని గౌరవించాలి. వారి బాధలు వినాలని అధికారులకు చె ప్పారు.

    ప్రపంచంలో అద్భుతమైన నిర్మా ణాలు ఇక్కడ వస్తాయి. ఇ క్కడ పెట్టుబడులు పెట్టని వారు భవిష్య త్తులో ఏదో కోల్పో యామన్న బాధ పడాల్సి వస్తుంది. శంషాబాద్ బుల్లెట్ ట్రై న్స్‌కు హబ్‌గా మారనుంది. బుల్లెట్ ట్రైన్స్‌కు తోడు ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలును అనుసంధా నం చేయబోతున్నాం. బు ల్లెట్ ట్రై న్ హబ్‌తో పాటు మెట్రో, అతిపెద్ద బస్ టర్మినల్ కూ డా నిర్మించబోతున్నాం. ఇవన్నీ పూర్తిచేయాలంటే స్థానిక ప్ర జాప్రతినిధుల సహకారం అవసరం. అభివృద్ధి పనులు వే గం గా చేయాలన్న ఆలోచనలో చిన్న చిన్న తప్పిదాలు దొర్లి తే అవి ఉద్దేశ పూర్వకంగా చేసినవి కాదు. ప్రభుత్వంపై న మ్మకం పెట్టుకుని ముందుకు నడవాలని కోరారు.

    ముఖ్యమంత్రి మావోయిస్టుల గు రించి మాట్లాడుతూ అజ్ఞా తంలో ఉన్న అగ్రనేత గణపతి లొంగిపోయి జనజీవన స్రవం తిలో కలవాలని పిలుపునిచ్చారు. “గణపతి ఆ రోగ్యం బా గా లేదని సమాచారం ఉంది. లొంగిపోతే వారికి అవసర మై న వైద్యం అందిస్తాం. అవసరమై న భద్రత కల్పిస్తాం. సమ స్యల పరి ష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. మావోయి స్టులు ఇంకెవరైనా అ జ్ఞాతంలో ఉన్నా లొంగిపోవాలి. లొంగి పోయిన వారిని ఆర్థికంగా ఆ దుకుంటాం. అభివృద్ధిలో వా రందరినీ భాగస్వాములను చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధించినట్టు. ప్రభుత్వం పిలుపు మేరకు 2024 నుంచి ఇ ప్పటివరకు 814 మంది నక్సలైట్లు ఉద్యమాన్ని వీడి జనజీ వన స్రవంతిలో కలిశారు” అని చెప్పారు.

    ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీ ధర్ బాబు, జూపల్లి కృ ష్ణా రావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమా ర్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ప లువురు ప్రజా ప్రతినిధులు, డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ పో లీస్ కమిషనర్ జి. సుధీర్ బా బు ఇ తర పోలీసు అధికారులు ఈ కార్య క్రమంలో పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.