Wednesday, September 30, 2026
More
    HomePoliticsMLC Kethavath Shankar Naik : గ్రామీణ ప్రాంతుల్లో ప్రతిభను వెలికి తీసేoదుకు పోటీలు ఎంతో...

    MLC Kethavath Shankar Naik : గ్రామీణ ప్రాంతుల్లో ప్రతిభను వెలికి తీసేoదుకు పోటీలు ఎంతో దోహదo 

    📰 Generate e-Paper Clip

    –ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

    MLC Kethavath Shankar Naik : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ అన్నారు. గురువారం నల్లగొండ ప ట్టణంలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో కలిసి NPL-6( నల్లగొండ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మె ల్సీ ప్రారంభించారు.

    ఈ సందర్భంగా శంకర్ నాయక్ మా ట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకా రుల ప్రతిభను వెలికితీయడానికి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతా యన్నారు. ఇందులో నైపుణ్యం సా ధించిన క్రీడాకారులు ఐపీఎల్ లాం టి టోర్నమెంట్ లో పాల్గొనడానికి అవకాశం లభిస్తుందన్నారు.

    మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్ల గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగా లలో అభివృద్ధి చేయడంతో పాటు ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నా రన్నారు.అభివృద్ధిలో నల్లగొండ మి నీ హైదరాబాద్ ల ముందుకు పో తుందని తెలిపారు. ప్రతిక్ ఫౌం డేషన్ ద్వారా ఇలాంటి టోర్నమెం టును నిర్వహించడం పట్ల ఆర్గనైజ ర్స్ ను అభినందించారు.

    నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించే NPL క్రికెట్ టో ర్నమెంట్ కు విశేష స్పందన లభి స్తుందన్నారు.NPL-6 టోర్నమెంట్ తో 20 రోజులపాటు క్రీడాభిమాను లకు పండగ అన్నారు. ఈ పోటీల లో గెలుపొందిన ప్రధమ విజేతకు రూ.2,22,222, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 1,11,111 నగదు బహుమతిని మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి చేతులు మీదుగా అందచేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ప్రదీప్ నాయక్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ బోనగి రి ప్రభాకర్, ముత్తినేని నాగేశ్వర రావు, పాలకూరి శ్రీధర్,సుదరగోని రమేష్, సయ్యద్ అనష్, సము ద్రాల శంకర్, పోగుల సాయి, నాళ్ళ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.