Panchayat Elections : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీల క వ్యాఖ్యలు. ఎన్నికల కమిషన్ పం చాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిం చి ముందుకు సాగుతున్న తరుణం లో ఎన్నికలపై స్టేవిధించలేమని కో ర్టు తేల్చిచెప్పింది.
సబ్ క్యాటగిరీ రిజర్వేషన్ లేనందు కు మీరు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా అంటూ పిటీష నర్ను కోర్టు ప్రశ్నల వర్షంకురిపిం చింది. పంచాయతీ ఎన్నికల రిజ ర్వేషన్ జీవో 46పై హైకోర్టులో శుక్ర వారం విచారణ జరిగిన నేపద్యం లో 42 శాతం రిజర్వేషన్ జీవో వి చారణ సమయంలో పాత పద్ధతి లోనే ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పినట్లు హైకోర్టు గుర్తు చేసింది.
గతంలో 2009లో ఇదే తరహా పరి స్థితి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఎ లక్షన్ను రద్దు చేశారని పిటిషనర్ త రఫు న్యాయవాది కోర్టుకు తెలపగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఈసీ అడ్వొ కేట్ చెప్పుకొచ్చారు. అయితే ఈ ద శలో తాము ఎలాంటి జోక్యం చేసు కోలేమని మరోసారి స్పష్టం చేసింది.
తామే ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశించి, తామే స్టే ఎలా ఇస్తాం అం టూ ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ క్రమంలో డెడికేటెడ్ కమిషన్ రి పోర్టును బహిర్గతం చేసి కాపీ ఇ వ్వాలని పిటిషనర్ న్యాయవాది కో రారు. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలే మని హైకోర్టు తేల్చిచెప్పింది. సబ్ కేటగిరి రిజర్వేషన్లపై కౌంటర్ దాఖ లు చేయాలని తెలంగాణ ప్రభు త్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చే సింది. ఆరు వారాల్లోపు కౌంటర్ దా ఖలు చేయాలని న్యాయస్థానం హు కుం జారీ చేసింది. తదుపరి విచార ణను 8 వారాలకు వాయిదా వేసిం ది.
