బిగ్ బ్రేకింగ్, మావోయిస్టు సంచలన ప్రకటన, జనవరి 1న సాయుధ కా ల్పుల విరమణకు నిర్ణయం
Bigbreking Maoistparty letter: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశంలో మావోయిస్టుల అంతంపై ప్రతినబూని కగార్ ఆపరే షన్ కు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వ ఆశయం నెరవేరే సమయం ఆసన్నమవుతోంది. మావోయిస్టులు లొంగిపోవాలన్న కేంద్రం పిలుపు కు చివరకు మావో యిస్టు పార్టీ తలొగ్గక తప్పలేదు. మొత్తానికి దే శంలో తారాస్థాయిలో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ (Maoist Party) కీలక నిర్ణ యం తీసుకుంది. ఈ మేరకు ఆ యుధ విరమణపై సంచలన ప్రక టన విడుదల చేసింది. 2026 జన వరి 1వ తేదీన సాయుధ కాల్పుల ను విరమిస్తున్నట్లు స్పష్టంచేసింది.
ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో శుక్రవారం ఉదయం ఒక ప్ర కటన జారీ అయ్యింది. ఒక్కొక్కరు గా లొంగిపోయే బదులు, అంద రూ కలిసి లొంగిపోతామని కూడా సదరు లేఖలో పేర్కొన్నారు. పర స్పర సమన్వయం, కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీ క్వెన్సీ నం బర్ను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. తమకు ఎ క్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎదుట ఆయుధ విరమణ చేస్తా మని స్పష్టం చేశారు.ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పే ర్కొన్నా రు. ఇదిలా ఉండగా మావో యిస్టుల చర్యలను అడ్డుకునేందు కు కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం విదితమే.
ఈక్ర మంలోనే మావోయిస్టులను కేంద్ర బలగాలు ఎక్కడికక్కడ అడ్డు కుంటున్నాయి. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావో యిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు ప లువురు కీలక నేతలు మృతిచెందా రు. ఈ క్రమంలోనే ఆయుధ విరమ ణపై మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుం డడం అందరి దృష్టిని ఆకర్షించ డం తో పాటు చర్చనీయాంశమైంది.

