Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలోని కొన్ని మీడియా సంస్థలపై రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటో గ్ర ఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీ వ్రంగా స్పందించారు. ఆయా మీడి యా సంస్థలు నిరాధార ఆరోపణల తో జీవితాలతో ఆదుకుంటారా అం టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ప్రసారం చేసిన నిరాధార కథనాల కు సదరు యాజమాన్యం వెంటనే క్షమాపణ చెప్పాలని, ప్రసారాలు నిలిపివేయాలని లేదంటే దేవుడికే వదిలేస్తానని భావోద్వగంతో వ్యా ఖ్యలు చేశారు. నా కొడుకు చనిపో యినప్పుడే నేను సగం చనిపోయా, ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టొ ద్దని అప్పీల్ చేశారు. తనపై, మహి ళా అధికారులపై పలు మీడియా సంస్థల్లో తప్పుడు కథనాలు ప్రసా రం అవడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడా రు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రశంసలు సర్వ సాధారణమని, వాటిని తా ము తట్టుకుంటాము కానీ ఐఏఎస్ అధికారుల ఫ్యామిలీ ఎలా తట్టు కుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు. మా మీద వేస్తే మేము, మా కుటుం బసభ్యులు, బంధువులు బాధప డతారని తెలవదా, కథనాలు ప్రసా రం చేసిన, రాసినవారు మేము చేసి నట్లు కళ్ళతో అంటూ ఆగ్రహం వ్య క్తం చేశారు. దేవుడు అంటే నాకు న మ్మకం, నేను తెలిసి ఏ తప్పు చే యను. నా కొడుకు చనిపోయిన ప్పుడే నేను సగం చనిపోయా, ఇం కా మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు. నన్ను అవమానించి ఏం సాధిస్తార ని అంటూ నేను తప్పు చేస్తే దేవు డు శిక్షిస్తాడని ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుచేయాలనే కుట్ర జరుగుతోం దని వ్యాఖ్యానించారు. తప్పుడు వార్తల మీద విచారణ జరిపించాల ని రాష్ట్ర డీజీపీని ఆయన కోరారు.
*మహిళా ఐఏఎస్ పై కథనాలు గర్హనీయం….* మహిళా అధికారు లపై చెప్పలేని భాషలో కొన్ని ఛాన ల్స్, సోషల్ మీడియాలో వార్తలు రాయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండిం చారు. మహిళా అధికారులను బది లీ చేసే అధికారం ముఖ్యమంత్రి కే ఉంటుందని,జిల్లా మంత్రులకు చె ప్పి ముఖ్యమంత్రి బదిలీ చేయరని గుర్తు చేశారు. ఎంతో కష్టపడితే ఐఏ ఎ స్, ఐపీఎస్ అవుతారని, అలాం టి వారిపై నిరాధారoగా అబాoడా లు వేయొద్దని హితవు పలికారు. మహిళా అధికారులను మానసి కం గా ఇబ్బంది పెట్టడం సరికాదన్నా రు.
*ప్రమాదాల సమయంలో హెలి కాఫ్టర్ వినియోగిస్తాం….* సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వాహనాలతో రో డ్లపై రద్దీ పెరుగుతోందని మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా బాటిల్ నెక్ ప్లేస్ ఉన్న వద్ద జామ్ ఎ క్కువ అవుతోందన్నా రు. ఈసారి 12 లక్షల వాహనాలు వెళతాయని అంచనా వేసినట్లు, ఈ రోజు నుంచి ట్రాఫిక్ జామ్ ఉంటుం దని, రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు టోల్ ఛార్జీ లేకుండా గేట్ ఎత్తేయాలని చె ప్పామని వివరించారు. ప్రత్యామ్నా య రూట్స్‌లో ప్రయాణికులు వెళ్లా లని సూచించడం జరిగిందన్నారు. ప్రతీ 20 కిలోమీటర్లకు ఒక అంబులె న్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. ఎమర్జెన్సీ కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని ప్రమా దాల సమయంలో అవసరమైతే హెలికాప్టర్‌లో హాస్పిటల్‌కు తరలి స్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

*సినిమా రంగం గురించి వదిలే శా…* సినిమా టికెట్ల రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా ట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ గురిం చి పట్టించుకోవడం మానేసినట్లు తె లిపారు. సినిమా టికెట్ల ధరల పెం పుపై తన దగ్గరకు రావొద్దని చెప్పా నని, దీంతో ఎవరూ తనను కలవ డానికి రావడం లేదని చెప్పారు. పు ష్ప సినిమా సందర్భంగా ఓ మహిళ చనిపోవడం బాధాకరమన్నారు. అ ప్పటి నుంచే టికెట్ల రేట్ల పెంపు కో సం తన దగ్గరకు రావొద్దని చెప్పాన ని గుర్తు చేశారు. నిన్నటి సినిమాకు టికెట్ల ధరల పెంపు, రేపటి సినిమా కూ టికెట్ రేట్లు పెంచిన విషయం త నకు తెలీదని చెప్పారు. టికెట్ల రే ట్ల పెంపుపై తాను సంతకం చేయలే దని స్పష్టం చేశారు. ఆ విషయంలో ఏం జరుగుతుందో తెలీదని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
*ఐఏఎస్ అధికారుల సంఘం ఆక్షేపణ…* మహిళా ఐఏఎస్ అ ధికారిపై వస్తున్న నిరాధార కథనా లను తెలంగాణ ఐఏఎస్ అధికారు ల అసోసియేషన్ తీవ్రంగా ఖండిం స్తూ ఆక్షేపించింది. నిరాధార కథనా లు ప్రసారం చేసిన మీడియా సంస్థ లపై ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియే షన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళా ఐఏఎస్‌పై ప్రచారం చేస్తున్న తప్పు డు కథనాన్ని తక్షణమే అన్ని ప్లా ట్‌ఫామ్స్ నుంచి తొలగించాలని హె చ్చరించింది. లేనిపక్షంలో సదరు మీ డియా హౌజ్‌పై న్యాయపరంగా ముందుకు వెళ్తామని వార్నింగ్ ఇ చ్చింది. బేషరతుగా క్షమాపణలు చె ప్పాలని డిమాండ్ చేస్తూ అసత్య ప్ర చారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఐఏఎస్ అధికారుల అసో సియేషన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా ఇటీవల మంత్రికి, ఓ మహిళా ఐఏఎస్ అధికారికి మ ధ్య ప్రేమాయణం అంటూ ఓ మీ డియా సంస్థలో కథనం ప్రసారమవ డం తెలంగాణలో రాజకీయంగా తీ వ్ర దుమారం రేపింది. సదరు మహి ళా అధికారికి మంత్రి ప్రత్యేకంగా పో స్టింగ్‌లు ఇప్పిచ్చారంటూ జోరుగా ప్ర చారం జరిగింది. మీడియా సంస్థ ప్రసారం చేసిన కథనం సోషల్ మీ డియాలో వైరల్‌గా మారింది. ఈ క థనంపై తెలంగాణ ఐఏఎస్ అధి కారుల సంఘం స్పందిస్తూ సదరు మీడియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కథనం వల్ల ఐఏఎస్ అ ధికారి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించడం సరికాదని పేర్కొంది. ఇలాంటి నైతికత లేని జర్నలిజం సివిల్ సర్వీస్ అధికారులతో పాటూ సమాజానికి చెడ్డ పేరు తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవ హారానికి సంబంధించి ఐఏఎస్ అధి కారికి వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఐఏఎస్ అధికారుల సం ఘం డిమాండ్ చేసింది.
Minister Komatireddy Venkat Reddy hot comments on electronic media and social media story's pic.twitter.com/7VytwujVPx
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) January 10, 2026
