Sunday, September 27, 2026
More
    Homeక్రైంDistrict SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో అంతరా ష్ట్ర “థార్...

    District SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో అంతరా ష్ట్ర “థార్ గ్యాంగ్ “ ముఠాసభ్యుడి అరెస్టు

    📰 Generate e-Paper Clip

    –ఆదమరిస్తే అరనిమిషంలో అంతా గాయబ్

    –బస్సుల్లో బంగారు ఆభరణాల దొంగను అరెస్టు చేసిన నల్గొండ జిల్లా పోలీసులు

    — నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

    District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లాలో సంచలనం సృష్టించిన బ స్సులో భారీ మొత్తంలో బంగారు ఆ భరణాల చోరీ కేసును ఛేదించారు నల్లగొండ జిల్లా పోలీసులు. జిల్లా లోని చిట్యాల పోలీస్ స్టేషన్ పరి ధిలో గతేడాది డిసెంబర్ 5వ తేదీన NL 01 B2 2756 నెంబరు గల బ స్సులో భారీ మొత్తంలో బంగారు ఆ భరణాల చోరీ జిల్లాలో సంచలనం సృస్టించిన విషయం తెలిసిందే.

    సదరు కేసును సవాలుగా తీసుకు న్న జిల్లా ఎస్పీ హైవే ల వెంట ధాబా ల వద్ద ఆగి ఉన్న బస్సులను లక్ష్యం గా చేసుకొని ప్రయాణికుల బంగారు ఆభరణాలు దొంగతనం చేస్తున్న ముఠాలను అదుపులోనికి తీసుకొ వాలని రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందా లు సి‌సి‌ఎస్, ఇన్స్పెక్టర్ ఎం. జితేం దర్ రెడ్డి పర్యవేక్షణలో కేసును ఛే దించటానికి వివిధ ప్రాంతాలలో ప ర్యటించి ఎటువంటి ఆధారాలు ల భించని కేసును అత్యదునిక సాం కేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా ఇట్టి నేరానికి పాల్పడిoది

    మధ్యప్రదేశ్ రాష్ట్రం థార్ జిల్లాకు చెందిన అలవాటుపడిన నేరాస్తులు గా గుర్తించినారు.

    ఈ క్రమంలో జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఇట్టి రెండు ప్రత్యేక బృందాల ను మధ్యప్రదేశ్ రాష్ట్రనికి పంపిం చారు. ఇట్టి ప్రత్యేక బృందాలు 15 రోజుల పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలలో పర్యాటిం చి అత్యదునిక సాంకేతిక పరిజ్ఞానం తో నేరస్తులపై ప్రతెక నిఘా ఉంచి మధ్యప్రదేశ్ రాష్ట్రం మనవార్ పో లీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్భాన్ క్రాస్ రోడ్డు వద్ద ఒక నిందితుదడిని అదుపులోకి తీసుకొని విచారణ చే యగా అతడు తన సహచరులు అ ష్రఫ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, జాబర్ ఖాన్, ఉమర్ ఖాన్లతో కలిసి పైన పే ర్కొనబడిన నేరాన్ని చేసినట్టుగా అంగీకరించాడు.

    గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రం లో హైవేలపై ప్రయాణించే బస్సుల ను లక్ష్యంగా చేసుకుని దొంగతనాల కు పాల్పడుతున్నట్లు అంగీకరించా డు. విచారణలో భాగంగా గతంలో కూడా ఇట్టి ముఠా 2022 మరియు 2023 సంవత్సరం లో కూడా విజ యవాడ హైవే పై ఇవే ప్రదేశాలలో హోటల్ ల వద్ద ఆగి ఉన్న బస్సు నుండి భారీ మొత్తంలో డబ్బులను మరియు బంగారు ఆభరణాలను దొంగలించినట్టు వివరించాడు.

    నిడితుదిని మునవ్వర్ న్యాయస్థా నం నందు హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్ పై జిల్లాకు తీసుకరావడం జరిగిందని ఎస్పీ శనివారం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుడి వద్దనుం డి రూ.85 లక్షల విలువైన 60 తు లాల బంగారు ఆభరణాలు స్వా ధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇట్టి ముఠా సభ్యులను గతంలో చే సిన పాతనేరాలను వెలికితీసి సమ గ్ర విచారణ కై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

    నిందితుల్లో షా అల్లా రఖా ( 30) తో పాటు ముఠా సభ్యులను సి‌సి‌ ఎస్, ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి పర్యవేక్షంలో పట్టుకోవడంలో ప్రతి భ కనపరిచిన చిట్యాల సర్కిల్ ఇ న్స్పెక్టర్ నాగరాజు,సి.సి.ఎస్ ఎస్ఐ శివకుమార్, సి.సి.ఎస్ హెడ్ కాని స్టేబుల్ విష్ణువర్ధనగిరి, పుష్పగిరి, నాగరాజు, కానిస్టేబుల్స్ వెంకటేష్, సాయికుమార్ , జూనేద్ , శివరాజు, మహేశ్, కమల్ కిశోర్, చిన్న బాబు ఇతర సి‌సి‌ఎస్ సిబ్బందిని ఎస్పీ ప్ర త్యేకంగా అభినందించి రివార్డును ప్రకటించారు.

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.