Monday, September 28, 2026
More
    HomeOpinionNalgonda SP Sharath Chandra Pawar : రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ సురక్షిత గమ్యాన్ని...

    Nalgonda SP Sharath Chandra Pawar : రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ సురక్షిత గమ్యాన్ని చేరుకోవాలి 

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, కొండ మల్లేపల్లి: నల్ల గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలని వార ణతో ప్రజల్లో రోడ్డు భద్రతపై అ వగాహన పెంపొందించేం దు కు తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “అ రైవ్ అలైవ్” కార్యక్ర మం భాగంగా కొండమల్లేపల్లి పోలీస్ స్టే షన్ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహిం చా రు. ఈ అవగాహన కార్యక్రమం లో భాగంగా కొండమల్లెపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఉచిత నేత్ర ప రీక్షలు నిర్వహించారు.

    వాహనం నడిపే సమయంలో కంటి చూపు స్పష్టంగా ఉండ టం అత్యంత ముఖ్యమని దృష్టిలో ఉంచుకొని ఈ వైద్య శి బిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన ప్రత్యేక వైద్య శి బిరంలో నిపుణులైన నేత్ర వైద్యు లు డ్రైవర్ల కంటి చూపును పరీక్షిం చారు. దూరం మరియు సమీప చూపు (Vision Test), కలర్ విజ న్ పరీక్ష, కంటి ఒ త్తిడి (Eye Press ure) పరీక్షలు నిర్వహించారు. రాత్రి స మయంలో వాహనం నడిపే డ్రైవర్లకు ప్రత్యేకంగా నైట్ విజ న్ సమస్యలపై సూచనలు ఇచ్చారు.

     

    ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడు తూ “డ్రై వర్‌కు కంటి చూపు సరిగా లేకపోతే అది ప్రమాదా లకు ప్రధాన కారణం అవుతుందని, ప్రతి డ్రైవర్ నిర్దిష్ట కాల వ్యవధిలో ఒకసారి అయినా కంటి పరీక్ష చేయించుకోవా ల న్నారు. ఇది తన భద్రతతో పా టు ఇతరుల ప్రాణాలను కా పాడే చర్య అని పేర్కొన్నారు.ఈ ఉచిత నేత్ర పరీక్షల శిబిరా నికి భారీ సంఖ్య లో ఆటో, లారీ, ట్రాక్టర్ మరియు ఇతర వా హనదారులు హాజరై పరీక్ష లు చేయించుకున్నారు.రోడ్డు భ ద్ర తలో భాగంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆరోగ్య శిబి రాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

    అలాగే రోడ్డు ప్రమాదాలు నివారణ గురించి మాట్లాడుతూ ముఖ్యంగా రోడ్డు భద్రత నియమాలను పైన అవగాహన లో పం వల్ల రోడ్డు ప్ర మాదాలు ఎక్కువగా జరుగుతు న్నాయని అన్నారు.నిర్లక్ష్య డ్రైవిం గ్, అతివేగం, మద్యం సేవించి వా హనం నడపడం, హెల్మెట్ మరి యు సీట్‌బెల్ట్ వినియోగం లే కపోవ డం వంటి కారణాల వల్ల జరుగుతున్నాయని తెలి పారు. ప్రతి ఒక్క రూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పా టిస్తేనే ప్రమాదాలను తగ్గించ వచ్చని ఆయన పేర్కొన్నారు.

    డ్రైవర్లు ప్రయాణానికి ముందు వాహనాల సాంకేతిక పరి స్థి తిని తనిఖీ చేయాలని, అలసటతో లేదా నిద్రమత్తులో వా హనం నడపవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిoచాలి, నాలుగు చక్రాల వాహన దారులు సీట్‌బెల్ట్ ధరించాలి అని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్ ఉప యోగిస్తూ వాహనం నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. అ లాగే రోడ్డు ప్రమాదంలో ప్రమాదా నికి గు రైన వ్యక్తులను ప్రాథమిక చికిత్స నిమిత్తం తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్లు ద్వారా సీపీఆర్ పైన అవగాహనా కల్పిం చడం జరిగిందన్నారు.

    రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,రోడ్డు వెంట ఉన్న ప్రతి గ్రా మంలో రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పా టు చేసి వారి సూచనలు సలహాల మేరకు రోడ్డు ప్రమాదాలు నివా ర ణకు కృషి చేస్తున్నామని,“సురక్షిత ప్రయాణం – సంతోషకర గమ్యం” అనే లక్ష్యంతో అందరూ కలిసి పని చేయాలని జిల్లా ఎస్పీ పిలుపుని చ్చారు.అనంతరం రోడ్డు భద్రత ని యమాలు పాటిస్తూ వాహనాలు న డుపుతూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

    ఈ కార్యక్రమంలో దేవరకొండ డిఎ స్పీ శ్రీనివాసరావు, కొండ మల్లేపల్లి సీఐ నవీన్ కుమార్,ఎస్సై రమేష్, డిటిఅర్బి రిటైర్ సీఐ అంజయ్య, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బం ది,వైద్య బృందం, స్థానిక ప్రజా ప్రతి నిధులు, ప్రజలు మరియు పాల్గొ న్నారు.

    చింతపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ

     

    చింతపల్లి: దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని చింతపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం ఆకస్మికంగా తని ఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌ లో సిబ్బంది పని తీరు, స్టేషన్ పరిధిలోని పరిస్థితులు, ప్ర జలకు అందిస్తున్న సేవల గురించి సంబంధిత అధికారుల ను అడిగి తెలుసుకున్నారు.

     

    పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ మేనేజ్‌ మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేష న్ రైటర్ విభాగం, లాక్ అప్, ఎ స్. హెచ్.ఓ గది తదితర విభాగాలను జిల్లా ఎస్పీ గారు పరిశీలించి,స్టేషన్ ప రిధిలో నమోదు అవుతున్న మ రియు నమోదైన కేసుల వి వరాలు, స్టేషన్ రికార్డులను సమగ్రంగా తనిఖీ చేసి, కేసుల దర్యాప్తు విషయం లో అధికారులు ఎటువంటి అలసత్వం వహించరాదని సూచించారు. దర్యాప్తులో ఉన్న కేసులను సమ గ్రంగా విచారణ చేసి, చట్ట ప్రకారం నిందితులకు శిక్ష ప డే విధంగా కృ షి చేయాలని ఆదేశించారు.

    గ్రామ పోలీసు అధికారులు ప్రతిరోజూ తమ పరిధిలోని గ్రా మాలను సందర్శిస్తూ ప్రజలతో మమేకమై నేర నియంత్రణ కు కృషి చేయాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ప్రజా ఫిర్యా దులపై ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్ష ణ స్పందన చూపాలని, ప్రజలకు ఎల్ల ప్పుడూ అందుబాటు లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచిం చారు.

    పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భ ద్ర తల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, బ్లూకోల్ట్ మరియు పెట్రో కార్ విధుల్లో ఉన్న సిబ్బంది డ యల్ 100 కాల్స్‌కు వెంటనే స్పం దిస్తూ సంఘటనా స్థలానికి త్వరి తగతిన చేరుకుని సమస్యల పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    పెట్రోలింగ్ సమయంలో స్టేషన్ పరి ధిలో ఉన్న రౌడీ షీటర్లను ప్రతిరో జూ తనిఖీ చేయాలని, స్టేషన్ పరి ధిలో సీసీటీవీ కె మెరాల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి సారించి, మరిన్ని సీసీ కె మెరాల ఏర్పాటు కోసం చ ర్యలు తీసుకోవాలని సూచించా రు. సైబర్ క్రైమ్ మరియు డయల్ 100 సేవల వినియోగం పై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వ హించాలని తెలిపారు.

    అలాగే, అసాంఘిక కార్యకలాపాలు అయిన గంజాయి, అక్ర మ ఇసుక రవాణా, పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా, జూ దం వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చే శారు. రోడ్డు ప్రమాదా లు తగ్గించేందుకు ప్రత్యేక నిఘా ఏ ర్పాటు చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓ వర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లం ఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిం చాలని ఆదేశించారు.ఈ కార్య క్ర మంలో దేవరకొండ డిఎస్పీ శ్రీని వా సరావు, నాంపల్లి సీఐ రాజు, చిం తపల్లి ఎస్ఐ రామూర్తి, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.