Monday, September 28, 2026
More
    HomePoliticsEx Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ అప్పీల్, గత యాసంగి, ఈ...

    Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ అప్పీల్, గత యాసంగి, ఈ వానకాలం బోనస్ వెంటనే విడుదల చేయాలి 

    📰 Generate e-Paper Clip

    Ex Minister Harish Rao : ప్రజా దీవెన, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోయిన యాసం గి, ఈ వానకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్ర భుత్వం కొనుగోలు చేసిన వాటికి కూడా బిల్లులు పెండింగ్ లో ఉ న్నా యని, దాదాపు 1200 కోట్ల రూపా యల వరకు ఎంఎస్పీ పెండింగ్ లో ఉందని, దాదాపు రూ. 200 కోట్ల బోనస్ పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. మాటల్లో 24 గంటల్లో బో నస్ ఇస్తామని చెప్పారు కానీ ఇప్ప టి వరకు ఒక్క రూపాయి కూడా ఇ వ్వలేదని దుయ్యబట్టారు. ఆది వా రం ఆయన సిద్దిపేట జిల్లా చిన్నకో డూరు మండలం మల్లారం గ్రామం లోని వడ్ల కొనుగోలు కేంద్రం పరి శీలించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..

    ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చా లా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్ప టి వరకు కొన్నది కేవలం ఐదు ఆరుల క్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే.

    కొంటామని చెప్పింది 85 లక్షల మె ట్రిక్ టన్నుల వడ్లు, కానీ ఐదు ఆరు లక్షలకే పరిమితమైంది.

    వెంటనే వడ్లను కొనుగోలు వేగ వం తం చేయండి.రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చలిలో రైతులు పడిగాపులు కాస్తు న్నారు. కావున వీలైనంత త్వరగా కొనుగోలు చేయండి.దయచేసి మి ల్లులు టై అప్ చేయండి.మక్క రైతు ల పరిస్థితి దయనీయంగా ఉంది.

    ఈ రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులకు మక్క కొనుగోల్లను ఆల స్యం చేసారు.ముఖ్యమంత్రి మక్క ల కొనుగోలును నిర్లక్ష్యం చేస్తున్నా రు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6 ల క్షల ఎకరాల్లో మక్కలు పండించా రు.వెంటనే మక్క రైతులకు డబ్బు లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

    పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగం అయ్యింది.కేంద్ర బీజేపీ రైతులను అరిగోస పెడుతున్నది.ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటాం అంటే కొన్ని జిల్లాలో 11, 12 క్విం టాళ్ల పత్తి పండింది. వాళ్లు మిగిలిన పత్తిని ఏం చేయాలి.ఒకవైపు జిన్నిం గ్ మిల్ వాళ్ళు, మరోవైపు కేంద్ర ప్ర భుత్వ సిసిఐ పత్తి కొనుగోలు సరిగ్గా చేయడం లేదు.పత్తి రైతులు అప్పు లపాలు అయిపోయి రాష్ట్రంలో ఆ త్మహత్యలు చేసుకుంటున్న పరిస్థి తి.

    పత్తి రైతులకు బీజేపీ ప్రభుత్వం, మ క్క రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇ బ్బంది పెడుతున్నది.రేవంత్ రెడ్డి రై తులను అన్ని రకాలుగా మోసం చే శాడు. రెండు పంటలకు రైతు బం ధు ఎగ్గొట్టిండు, బోనస్ లేదు, పంట ల బీమా లేదు, సగం మందికే రుణ మాఫీ చేశారు. పోయిన యాసంగి లో వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు, ఈ ఏడాది తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు నష్ట పరిహా రం అందలేదు. పంటల బీమా చేసి ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా డబ్బులు వచ్చేవి. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్న రైతు లకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చే యాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.