Tuesday, September 29, 2026
More
    HomeIndiaGutta Sukhender Reddy : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కీలక అప్పీల్, తెలంగాణలో పె...

    Gutta Sukhender Reddy : మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కీలక అప్పీల్, తెలంగాణలో పె ట్టుబడులకు జర్మనీ పారిశ్రామిక వేత్తలు తరలిరావాలి

    📰 Generate e-Paper Clip

    Gutta Sukhender Reddy : ప్రజా దీవెన, జర్మన్: తెలంగాణ లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మ న్ గుత్తా సుఖేం దర్ రెడ్డి జర్మనీ పారిశ్రామికవేత్తలు, పె ట్టుబడిదారులకు పిలు పునిచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలు, మౌ లిక సదుపాయాలు, ఐటీ, ఫా ర్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్, టె క్నాలజీ రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావర ణం ఉందని ఆయన పేర్కొన్నారు.జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలం గాణలో పెట్టు బడి అవకాశా లు, తెలుగు ప్రవాసులతో అనుసంధా నంపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసా ద్ కుమార్, శాసన మండలి డి ప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

    సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రతినిధులకు భారత కాన్సులే ట్ అధికారులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించా రు. అనంతరం తెలంగాణలో అం దుబాటులో ఉన్న పెట్టుబడి అవ కాశాలు, పారిశ్రామిక రంగ అభి వృద్ధి, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ఇన్నోవేషన్ రంగాల పై చర్చించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడు తూ హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నో వే షన్ వంటి రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిం చిందన్నారు. జర్మనీతో పాటు యూర ప్‌లోని పారిశ్రామికవేత్త లు తెలం గాణలోని పెట్టుబడి అవకాశాల ను పరిశీలించాలని కోరారు.

     

    విదేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజ లు తమ మాతృభూమితో అను బంధాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాము లు కావాలని ఆయన సూచించారు. పెట్టు బడులు మాత్రమే కాకుండా సాం కేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు, అంతర్జాతీయ అనుభవాలను తెలంగాణకు తీసుకురావడంలో ప్రవాస తెలం గాణ వాసులు వార ధిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రపంచం లోని వివిధ దేశాల్లో తె లుగు వారు తమ ప్రతిభతో ఉన్నత స్థా నాలకు చేరుకోవడం గర్వ కారణమని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

    జన్మభూమి అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని ఆ యన పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ శాస న మం డలి సెక్రెటరీ డా. నరసిం హాచా ర్యులు, అసెంబ్లీ సెక్రెట రీ ఆర్. తి రుపతి, లేజిస్లేచర్ ప్రతినిధి బృం దం సభ్యులు, భార త కాన్సు లే ట్ అధికారులు, తెలుగు ప్రవా సులు తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.