Munugode School : ప్రజా దీవెన, మునుగోడు: నల్లగొం డ జిల్లా మునుగోడు మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఓ మంచి ఆ లోచన భవిష్యత్తుకు మార్గదర్శ కం గా నిలిచింది. ఎండల తీవ్రత పెరు గుతున్న ఈ కాలంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అ క్కడి తల్లి దండ్రులు కలిసి ఒక వి నూత్న కార్యక్రమాన్ని ప్రారంభించా రు.
పాఠశాలలో చదువుతున్న 210 మంది విద్యార్థులకు ఈ రోజు శుక్ర వారం నుండి ఏప్రిల్ 23 వరకు ప్రతి రోజూ నాణ్యమైన మజ్జిగను అం దించే కార్యక్రమాన్ని ఘనంగా ప్రా రంభించారు. ఈ కార్యక్రమాన్ని పా ఠశాల ప్రధానోపాధ్యాయులు, పి ఆర్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సుంకరి బిక్షం గౌడ్ ప్రారంభిం చారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేకత ఏమి టంటే దీనికి కావాల్సిన మొత్తం ఖ ర్చును తల్లిదండ్రులే భరించడం. దుబ్బ పురుషోత్తం ఆధ్వర్యంలో కొందరు పేరెంట్స్ ముందుకొచ్చి, “పిల్లల ఆరోగ్యం ముందు” అన్న ని బద్ధతతో ఈ బాధ్యతను తీసుకు న్నారు. దీంతో ఈ వినూత్న కార్యక్ర మం ఇతర పాఠశాలలకు ఆదర్శం గా నిలిచే ప్రయత్నమని సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నా యి.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బిక్షం గౌడ్ మాట్లాడు తూ ప్రభుత్వ సహాయం ఆలస్యం అయి నా, ఇక్కడి తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల అవసరాలను వెంటనే తీర్చడానికి ముందుండటం అభి నందనీయమని ప్రశంసించారు.ఈ పాఠశాల భవిష్యత్తుపై కూడా ఆ యన స్పష్టమైన ప్రణాళికలను వె ల్లడించారు. వచ్చే విద్యా సంవ త్స రంలో విద్యార్థుల సంఖ్యను సు మారు 300కి పెంచేలా చర్యలు తీ సుకోవాలని సూచించారు.
ప్రీ-ప్రైమరీ విభాగం ప్రారంభించ డం, అదనంగా ఇద్దరు ఉపాధ్యా యులను నియమించడం, ఇంకా పేరెంట్స్ సహకారంతో ఉదయం టి ఫిన్ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్య క్రమంలో పాఠశాల FAC ప్రధానో పాధ్యాయురాలు అపర్ణ, పేరెంట్స్ దుబ్బ పురుషోత్తం, భాస్కర్, సం దీప్, రమేష్, నరేష్ పాఠశాల సి బ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మునుగోడు పాఠశాలలో ప్రారంభమైన ఈ చిన్న ప్రయత్నం, పెద్ద మార్పులకు నాంది పలుకు తోందని, ఇది కేవలం మజ్జిగ పం పిణీ కాకుండా సమాజం, పాఠశాల కలిసి పిల్లల భవిష్యత్తును నిర్మిస్తు న్న ఒక గొప్ప ఉదాహరణగా నిలు స్తుందని చర్చ కొనసాగుతోoది.

