Sunday, September 27, 2026
More
    HomeOpinionInnovative Program in government school : మునుగోడు పాఠశాలలో వినూత్నకార్యక్రమం, వేసవిదృష్ట్యా విద్యార్ధులకు ప్రతిరోజూ...

    Innovative Program in government school : మునుగోడు పాఠశాలలో వినూత్నకార్యక్రమం, వేసవిదృష్ట్యా విద్యార్ధులకు ప్రతిరోజూ మజ్జిగ పంపిణీ

    📰 Generate e-Paper Clip

     

    Innovative Program in government school : ప్రజా దీవెన, మునుగోడు: నల్లగొం డ జిల్లా మునుగోడు మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఓ మంచి ఆలోచన భవిష్యత్తుకు మార్గదర్శ కం గా నిలిచింది. ఎండల తీవ్రత పెరుగుతున్న ఈ కాలంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అ క్కడి తల్లి దండ్రులు కలిసి ఒక వి నూత్న కార్యక్రమాన్ని ప్రా రంభించారు.

    పాఠశాలలో చదువుతున్న 210 మంది విద్యార్థులకు ఈ రో జు శుక్ర వారం నుండి ఏప్రిల్ 23 వరకు ప్రతి రోజూ నాణ్య మైన మజ్జిగను అం దించే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారం భించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యా యు లు, పి ఆర్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సుంకరి బిక్షం గౌడ్ ప్రారంభించారు.

    ఈ కార్యక్రమానికి ప్రత్యేకత ఏమి టంటే దీనికి కావాల్సిన మొత్తం ఖర్చును తల్లిదండ్రులే భరించడం. దుబ్బ పురుషో త్తం ఆధ్వర్యంలో కొందరు పేరెంట్స్ ముందుకొచ్చి, “పిల్లల ఆ రోగ్యం ముందు” అన్న ని బద్ధతతో ఈ బాధ్యతను తీసు కు న్నారు. దీంతో ఈ వినూత్న కార్యక్రమం ఇతర పాఠశాల ల కు ఆదర్శంగా నిలిచే ప్రయత్నమని సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

    ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బిక్షం గౌడ్ మా ట్లాడుతూ ప్రభుత్వ సహాయం ఆలస్యం అయి నా, ఇక్కడి తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల అవసరాలను వెంటనే తీర్చడానికి ముందుండటం అభినందనీయమని ప్రశంసిం చారు.ఈ పాఠశాల భవిష్యత్తుపై కూడా ఆ యన స్పష్టమైన ప్రణాళికలను వె ల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను సు మారు 300కి పెంచేలా చర్యలు తీ సుకోవాలని సూచించారు.

    ప్రీ-ప్రైమరీ విభాగం ప్రారంభించ డం, అదనంగా ఇద్దరు ఉ పాధ్యాయులను నియమించడం, ఇంకా పేరెంట్స్ సహకా రంతో ఉదయం టిఫిన్ సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్య క్రమంలో పాఠశాల FAC ప్రధా నోపాధ్యాయురాలు అపర్ణ, పేరెంట్స్ దుబ్బ పురుషోత్తం, భా స్కర్, సందీప్, రమేష్, నరేష్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నా రు. ఇదిలా ఉండగా మునుగోడు పాఠశాలలో ప్రారంభమైన ఈ చిన్న ప్రయత్నం, పెద్ద మార్పులకు నాంది పలుకు తోంద ని, ఇది కేవలం మజ్జిగ పం పిణీ కాకుండా సమాజం, పాఠ శాల కలిసి పిల్లల భవిష్యత్తును నిర్మిస్తున్న ఒక గొప్ప ఉదా హరణగా నిలుస్తుందని చర్చ కొనసాగుతోoది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.