Telangana Government budget 2026 : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ భవిష్యత్తును తీర్చిదిద్దే భారీ అ డుగుపడిందని చెప్ప వచ్చు మొత్తంగా రూ.3,24,234 కోట్ల అద్భుత పరిమాణంతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీ ఎం మల్లు భట్టి విక్ర మార్క శుక్రవారం సభ ముందు ఉంచా రు. 2026-27 ఆర్థిక సంవ త్సరానికి రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్ కేవలం సంఖ్య ల సమాహారం కాదు ఇది ప్రజల కల లు, అవసరాలు, ఆశల ప్రతిబింబమని పేర్కొన్నారు.
శాసనసభలో స్పీకర్ అనుమతితో ప్రారంభమైన ఈ ప్రసం గంలో ప్రభుత్వం ఎటు దిశగా ముందుకు సాగబోతోందో స్ప ష్టమైన దిశానిర్దేశం చే శారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. బ డ్జెట్ అనేది గారడీ కాదు, నిజాలపై నిలిచే ప్రణాళిక అని విక్ర మార్క స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉం చుకుని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడమే లక్ష్యంగా దీన్ని రూపొందించామని తెలిపారు.
ప్రత్యేకంగా సంక్షేమం, మహిళా అ భివృద్ధి ఈ బడ్జెట్‌కు హృ దయం లాంటివి. మహిళా సాధికారత కో సం కీలక కేటా యింపులు చేస్తూ, వారిని ఆర్థికంగా, సామాజికంగా మరింత బలపరచాలనే సంకల్పా న్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది. సం క్షేమం, నిజాయితీ, అభివృద్ధి ఈ మూడు సూత్రాలపై నిలబ డి ఉన్న ఈ బడ్జెట్, తెలంగాణ భవిష్యత్తుకు కొత్త దిశను చూపించే ప్రయత్నంగా నిలుస్తోందని చెప్పారు.
శాఖల వారీగా కేటాయింపులు ఇలా …
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్- 2026- 2 7 ఆర్ధిక సంవత్సరానికి గాను శాఖ ల వారీగా కేటాయింపులు ఇలా ఈ కింది విధం గా జరిగాయి.
–రూ. 3,24,234 కోట్లతో తెలంగా ణ రాష్ట్ర బడ్జెట్
–మూలధన వ్యయం – రూ. 47,2 67 కోట్లు
— రెవెన్యూ వ్యయం – రూ. 2,34, 406 కోట్లు
— వ్యవసాయ శాఖ – రూ. 23,179 కోట్లు
— విద్యుత్ శాఖ – రూ. 21,285 కోట్లు
— పౌరసరఫరాల శాఖ – రూ. 7,366 కోట్లు
— పశుసంవర్ధక శాఖ – రూ. 1,529 కోట్లు
— విద్యా శాఖకి 26, 674 కోట్లు
— వైద్య ఆరోగ్య శాఖకు 13679 కోట్లు
— కార్మిక శాఖకు 998 కోట్లు
— మహిళా శిశు సంక్షేమ శాఖ కి 3143 కోట్లు
–షెడ్యూల్ కులాలకు 11784 కోట్లు
–షెడ్యూల్ తెగలకు 7937 కోట్లు
— వెనక బడిన తరగతులకు 12511 కోట్లు
–మైనార్టీ సంక్షేమానికి 3769 కోట్లు
–రాజీవ్ యువ వికాసం కు 6వేల కోట్లు
–గృహ నిర్మాణానికి 7430 కోట్లు
— ఐటీ శాఖకు 875 కోట్లు
— పరిశ్రమల శాఖకి 3490 కోట్లు
— చేనేత శాఖకు 258 కోట్లు
–పంచాయతీ రాజ్ శాఖ కు 33,688 కోట్లు
–ఇరిగేషన్ కు 22,615 కోట్లు
–రవాణా రోడ్డు భవనాల శాఖకి 12,789 కోట్లు
— న్యాయ శాఖకు 2367 కోట్లు
— పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్లు
— హోం శాఖకు 11,907 కోట్లు
— గోదావరి పుష్కరాలకు 500 కోట్లు
— పర్యాటక శాఖకు 1224 కోట్లు
— 6 గ్యారంటీలకు 50,713 కోట్లు
— రైతు భరోసాకు 18,000 కోట్లు
–చేయుతకు 14,861 కోట్లు
— ఇందిరమ్మ ఇండ్లకు 5,500 కోట్లు
— మహాలక్ష్మికి 4,305 కోట్లు
–సన్న వడ్ల బోనస్ కు 3,500 కోట్లు
–గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) 2,080 కోట్లు
–రాజీవ్ ఆరోగ్య శ్రీ 1,143 కోట్లు
–మహాలక్ష్మి పథకం కింద LPG సబ్సిడీ 723 కోట్లు
— ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు 600 కోట్లు
— పవర్ సబ్సిడీకి 14,000 కోట్లు
— బియ్యం సబ్సిడీ 3,000 కోట్లు
— కల్యాణలక్ష్మి / షాది ముబారక్ 3,683 కోట్లు
— విద్యార్థుల డైట్ ఛార్జీలు 2,170 కోట్లు
— స్కాలర్‌షిప్‌లకు 4,343 కోట్లు
–తప్పనిసరి కార్యాలయ ఖర్చులు 2,323 కోట్లు
–పంచాయతీరాజ్ రోడ్లకు 2, 062 కోట్లు
–రోడ్లు భవనాల శాఖకు 6416 కోట్లు
–హ్యాంమ్ రోడ్లకు 3053 కోట్లు
–రీజనల్ రింగ్ రోడ్డుకు 1525 కోట్లు
— రాజీవ్ యువ వికాసానికి 5800 కోట్లు
–యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు 5000 కోట్లు
— ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4000 కోట్లు
–పంట బీమా పథకానికి 1886 కోట్లు
–మూసి రివర్ ఫ్రంట్ కు 1500 కోట్లు
— CURE ఏరియా అభివృద్ధికి 265 4 కోట్లు
–ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు
— ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు 1056 కోట్లు
— ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 1500 కోట్లు

