Sunday, September 27, 2026
More
    HomePoliticsI&PR Special Commissioner Priyanka : ఐఅండ్ పిఆర్ కమిషనర్ కు టీయూడబ్ల్యూజే అప్పీల్, కేబుల్...

    I&PR Special Commissioner Priyanka : ఐఅండ్ పిఆర్ కమిషనర్ కు టీయూడబ్ల్యూజే అప్పీల్, కేబుల్ చానెల్స్ కు అక్రెడిటేషన్ పై మంత్రి ఆదేశాలు అమలు చేయండి 

    📰 Generate e-Paper Clip

    I&PR Special Commissioner Priyanka : ప్రజా దీవెన, హైదరాబాద్: కేబుల్ చానెల్స్ కు గతంలోలాగే ఐ అండ్ పీఆ ర్ లో అక్రెడిటేషన్ కార్డులు ఇ స్తామని సమాచార పౌరసం బంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సి.హెచ్ ప్రియాంక హామీ ఇ చ్చారు. సవరించిన జీ.ఓలో సైతం కేబుల్ చానెల్స్ కు జరి గిన అన్యాయాన్ని టీయూడబ్ల్యూజే, కేబుల్ చానెల్స్ జే ఏసీ నేతలు కమిషనర్ దృష్టికి తీ సుకువెళ్లగా ఆమె సానుకూలం గా స్పందించారు. జీ.ఓ 23 9 లో కే బుల్ చానెల్స్ కు ఇచ్చి న అక్రెడిటే షన్స్ వివరాలను ఈ సందర్భంగా యూనియన్ నేతలు కమిషనర్ కు వివరించారు. కేబుల్ ఛానెల్స్ కు జరు గుతున్న అన్యాయాన్ని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి అస్కాని మారుతీసాగర్ క్షుణ్ణంగా వివరించారు.

    గతంలో ఇదే విషయాన్ని సమాచార శాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా పాత జీఓ ప్రకారం కేబు ల్ జర్నలిస్టులకు కార్డు లు ఇస్తామని హామీ ఇచ్చిన విష యాన్ని కమిషనర్ కు తెలిపారు. దీంతో స్పందించిన కమిష నర్ ఇదే విషయాన్ని మరో మారు మంత్రితో చర్చించి న్యా యం చేస్తామని స్పష్టం చేశారు.15 సంవత్సరాల జర్న లిస్టు గా అనుభవం కలిగిన ఎలక్ట్రా నిక్ మీడియా జర్నలిస్టులకు కూ డా ఫ్రీలాన్స్ జర్నలిస్టులుగా అవకాశం కల్పించాలని, ప్ర స్తుతం కేవలం ప్రింట్ మీడియా వారికి మాత్రమే ఈ అవ కా శాన్ని కల్పిస్తున్నారని కమిషనర్ దృష్టికి తెచ్చారు.

    ఈ విషయంలో కూడా సానుకూ లంగా స్పందించిన కమి షనర్ తప్పకుండా వారికి కూడా అవకాశం కల్పిస్తామన్నా రు. అక్రెడిటేషన్స్ జా రీలో కేబుల్ చానెల్స్ కు న్యాయం చేసే లా త్వరలో సవరణలు చేస్తా మని కమిషనర్ ప్రియాంక స్ప ష్టం చేశారు. కమిషనర్ ను కలిసిన వారిలో టీయూడ బ్ల్యూ జే రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, తెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణకుమార్, టీయూడబ్ల్యూజే కోశా ధికారి పి.యోగనంద్, కేబు ల్ చానెల్స్ జేఏసీ నేతలు కడ కంచి వెంకటేష్, హెచ్.వి చలపతి రాజు, దేవేందర్, భరత్, అరవింద్ తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.