District Collector Chandrashekhar : ప్రజా దీవెన, కన గల్: ప్రాథమిక వై ద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా సాధారణ ప్రస వాలను పెం చాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా కనగల్ మండలం ప ర్వతగిరి ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య ఉప కేంద్రం లోని రిజిస్టర్లను, మందుల స్టాక్, స్టోర్, మరుగుదొడ్లు పరిశీలించిన అనంతరం మాట్లాడారు.
అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేం ద్రాలు, ఉపకేంద్రాలలో అ న్ని రికార్డులను సరిగా నిర్వహించాలని, మందుల స్టాక్ రి జిస్టర్ ను అప్డేట్ చేయాలని, గర్భిణీ స్త్రీలకు ప్రతినెల నిర్వ హించే పరీక్షలను సక్రమంగా నిర్వహించి ప్రసవ సమయా నికి ప్రసవం జరిగేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వ ప్రాథ మిక వైద్య కేంద్రా లలో సాధారణ ప్రసవాలను పెంచాలని, పేద ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆస్పత్రిలోని మరుగుదొడ్లు త నిఖీ చేశారు. మందుల స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించిన సంద ర్భంగా ఆయా మం దుల వివరాలను, వాటి అందుబా టు ను, అడిగి తెలుసుకున్నారు. కాగా ఆరోగ్య ఉప కేంద్రం భ వ నంపై పెచ్చులు ఊగుతూన్నాయని, మరమ్మతులు చేయిం చాలని జిల్లా వై ద్య ఆరోగ్య శాఖఅధికారి డాక్టర్ పుట్ల శ్రీని వాస్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రతిపాదనలు పం పించాలని చెప్పారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డి ప్యూటీ డి ఎంహెచ్వోలు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ కృ ష్ణవేణి, జిల్లాక్షయ ని యంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్ర వర్తి, మెడికల్ అధికారి రామ కృష్ణ, ఎం ఎల్ హెచ్ పి ఊర్మి ల, ప్రి యదర్శిని, ఆశ, ఏఎన్ఎంలు, తదితరులు ఉన్నారు.

