Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాలో పైపుల ద్వారా సహజ వాయు వు (PNG) సరఫరా విస్తరణ పనులను వేగవంతం చే యా లని జిల్లా కలెక్టర్ బి. చంద్రశే ఖర్ ఆదేశించారు.దీనివల్ల వా ణిజ్య ఎల్పిజి (LPG)పై ఆధార పడడాన్ని తగ్గించేందుకు జిల్లా స్థాయి లో గ్యాస్ పంపిణీ విస్తరణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో పౌరసరఫరాలు,పరిశ్రమలు పంచాయత్ రాజ్, వి ద్యు త్ పోలీస్ శాఖల అధికారులతో ఈ విషయంపై సమీక్ష నిర్వ హించారు.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌ ర సరఫరా ల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మే రకు ఈ చర్య లు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. మధ్యప్రాచ్యంలో కొ నసా గుతున్న సంక్షోభం కారణంగా ఇంధన సరఫరాలలో అంత రాయం ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యంగా వాణిజ్య విభాగం లో ఎల్ పిజి లభ్యతపై ప్రభావం పడుతు న్నందున, PNG స రఫరాను విస్త రించడం అత్యంత అవసరమని ఆయన అ న్నారు.కేంద్ర ప్రభుత్వ సూ చనల మేరకు సిటీ గ్యాస్ డిస్ట్రి బ్యూషన్ (CGD) నెట్‌వర్క్‌లను వేగంగా విస్తరించేందుకు చ ర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
దీర్ఘకాలికంగా PNG వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉ ద్దేశంతో రా ష్ట్రాలకు వాణిజ్య ఎల్పిజి కేటాయింపును 20% నుండి 50% వ ర కు పెంచే అవకాశం కల్పించబడిందని చె ప్పారు.జిల్లాలో పనిచేస్తున్న మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూ షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా PNG నెట్వర్క్ విస్తర ణ పనులు నిర్వహించడం జరుగుతున్నదని, ఈ పనులను వేగవంతం చేయడా నికి 24 గంటల పాటు పని చేయ డా నికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అయితే, శబ్ద కాలుష్య ని బంధనలు ,భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిం చాలని ఆదేశించారు. ఈ ప్రత్యేక అనుమతి ఈ సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని వెల్లడించారు. పైప్‌లైన్ ద్వా రా ఇంటింటికి గ్యాస్ అందివ్వడం తాగునీటి సరఫరా లాగే ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ఇవ్వడం జరుగుతుందన్నారు.
అదనంగా CGD పనులపై ఉన్న కాలానుగుణ ఆంక్షలను స డలించి, పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసు కున్నామని తెలిపారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ను రాష్ట్ర నో డల్ అధికారిగా నియమిం చగా, పౌర సరఫరాల శాఖను P NG మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) మ ధ్య సమన్వయం కోసం నియమించినట్లు చెప్పారు.వాణిజ్య మరియు పారి శ్రామిక LPG వినియోగదారులు ముందుగా OMCల వద్ద నమోదు చేసుకోవడం, అలాగే సంబంధిత సి టీ గ్యాస్ సంస్థ వద్ద PNG కోసం దరఖాస్తు చేయడం తప్పని సరి అని కలెక్టర్ స్పష్టం చేశారు. PNGకి మారేందుకు అవస రమైన చర్యలు తీసుకుంటేనే 50% వరకు వాణిజ్య LPG కే టాయింపుకు అర్హత ఉం టుందని తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పోలీసుశాఖతో స హా అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాల ని కలెక్టర్ కోరారు. జిల్లాలో గ్యాస్ సరఫరా వ్యవస్థను బలో పేతం చేసి, భవిష్యత్తులో ఇంధన కొరత సమస్యలను నివా రించడం ఈ చర్యల ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపా రు.ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ వంశీకృష్ణ మాట్లా డు తూ, మెగా సిటీ గ్యాస్ ప్రాజెక్టు వలిగొండ నుండి నార్కట్ పల్లి వరకు విస్తరించి ఉందని తెలిపారు. ప్రతి మూడు కిలో మీటర్లకు ఒక ట్యాంక్ పాయింట్ ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. ప్రభుత్వ నిర్ణయం ప్ర కారం గ్యాస్ పైప్లైన్లను ఇంటిం టికి అందించే విధంగా వేగంగా పనులు జరుగుతున్నాయని పేర్కొ న్నారు.నార్కట్‌పల్లి నుండి నల్గొండ వరకు పైప్‌లైన్ ద్వారా 5 గ్రామాల ను కలుపుతూ టాప్ అప్ పా యిం ట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలి పారు. ఇంటి సరఫరాలో ఎ లాంటి అంతరాయం లేకుండా నిరంతరం గా గ్యాస్ అం దిం చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశా రు. ఈ సమీక్ష సమావేశానికి రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివా స్,ఎ ఎస్పీ రమేష్, పౌరసర పాలశాఖ అధికారి వెంకటేష్ , జి ల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్ ఆర్ అండ్ బి ఈ ఈ శ్రీధర్ రెడ్డి పంచా యతీరాజ్ అధికారి శేఖర్ రెడ్డి. మున్సిపల్ కమి షనర్ శరత్చంద్ర సం బంధించిన అధికారులు హజార య్యా రు.

