Minister Komati Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అ ర్వపల్లి రోడ్డు ప్రమాదంలో మరణిం చిన నల్గొండ ఉపాధ్యాయులు క ల్పన, గీతల మరణం బాధాకరమ ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. శనివారం మంత్రి నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పోస్ట్ మార్టం వద్ద కల్పన, గీతల పార్థివ దేహాలను సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి కల్పన గీత ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సా నుభూతిని తెలియజేశారు. అంతే కాక ధైర్యాన్ని చెప్పారు. భగవంతు డు కల్పన, గీతల ఆత్మకు శాంతి చే కూర్చాలని ప్రార్థించారు. సంతోషం గా సంక్రాంతి పండుగ జరుపుకొని నల్గొండ నుండి పాఠశాలకు వెళు తూ రోడ్డు ప్రమాదంలో కల్పన, గీత లు దుర్మరణం పాలు కావడం బాధా కరమని అన్నారు. వారి కుటుంబా నికి వారి మరణం తీరనిలోటు అని అన్నారు. ఇదే ప్రమాదంలో గాయప డి హైదరాబాదులో చికిత్స పొందు తున్న మరో ఇద్దరు ఉపాధ్యాయు లు త్వరగా కోలుకోవాలని, ఇందు కుగాను వారికి మంచి వైద్యం అం దించాలని డాక్టర్లతో కోరారు.
ప్రజలు రహదారి ప్రమాదాలకు గురి కాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకో వాలని, రాష్ట్ర ప్రభుత్వం రహదారి భద్రత లో భాగంగా ప్రజలకు అన్ని రకాల అవగాహన కార్యక్రమాలు ని ర్వహిస్తున్నదని మంత్రి అన్నారు. వాహనాలను జాగ్రత్తగా నడపడం, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం న డపకూడదని, టు వీలర్ నడిపేవా రు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హె ల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరూ రో డ్డు భద్రత నియ మాలను పాటిం చాలని, రోడ్డుపై ప్రయాణించేవారు క్షేమంగా వెళ్లిక్షేమంగా ఇంటికి వచ్చే లా అవసరమైన అన్ని చర్యలు తీ సుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉ న్నారు.

