Monday, September 28, 2026
More
    HomePoliticsNalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పీల్,...

    Nalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పీల్, ట్రాఫిక్ నిబంధనలు పాటి స్తూ మీతోపాటు ఎదురువారి ప్రాణా లను కూడా కాపాడండి 

    📰 Generate e-Paper Clip

    Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: పండగ అ నంతరం తిరుగు ప్రయాణాలు చేసే వాహనదారులు ట్రాఫిక్ నిబంధన లు పాటిస్తూ పోలీస్ శాఖకు సహక రించి తమతో పాటు ఇతరుల ప్రా ణాలను కూడా కాపాడాలని నల్లగొం డ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వి జ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండగ ము గించుకొని తిరుగు ప్రయాణ రద్దీ దృ ష్ట్యా సమగ్ర ట్రాఫిక్ ఏర్పాట్లు చేశా మని తెలిపారు.

    ఆదివారం ఆయన ఓ ప్రకటన విడు దల చేస్తూ నల్లగొండ జిల్లా పరిధిలో సంక్రాంతి పండగ ముగించుకుని ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ దిశగా తిరుగు ప్రయాణాలు అధికం గా సాగుతున్న నేపథ్యంలో వాహ నాల సంఖ్య భారీగా పెరిగే అవకా శం ఉందని, ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అలాగే రో డ్డు ప్రమాదాల నివారణ కోసం పో లీస్ శాఖ సమగ్ర చర్యలు చేపట్టిన ట్లు తెలిపారు.

    జాతీయ రహదారులు, రాష్ట్ర రహ దారులు, ముఖ్య కూడళ్లలో 450 మంది పోలీస్ అధికారులు, సిబ్బం దితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టామ ని తెలిపారు.వాహన రద్దీని ఎప్ప టి కప్పుడు గమనించేందుకు డ్రోన్ల ద్వారా గాలిలో నుంచే నిరంతర ప ర్యవేక్షణ నిర్వహిస్తూ రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన చోట్ల వెంటనే ట్రాఫిక్ మళ్లింపులు అమ లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు అధికంగా ప్రయా ణించే నేషనల్ హైవేలు, టోల్ ప్లాజా లు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.

     

    ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న సమ యాల్లో వాహనాల గమనాన్ని సజా వుగా కొనసాగించేందుకు అవసర మైతే మార్గమళ్లింపులు అమలు చే స్తామని స్పష్టం చేశారు. ప్రయాణికు ల భద్రత దృష్ట్యా అవసరమున్న చో ట్ల మెడికల్ క్యాంపులు, అంబులె న్సులు సిద్ధంగా ఉంచామని, అత్య వసర పరిస్థితుల్లో వెంటనే వైద్య సే వలు అందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

    అదే విధంగా అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ప్ర మా దకర ఓవర్‌టేకింగ్ వంటి వాటిపై క ఠిన నిఘా కొనసాగుతుందని హె చ్చరించారు.వాహనదారులు త ప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధ రించాలని, వాహనాలకు సంబంధిం చిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవా లని సూచించారు. ప్రయాణ స మ యంలో అలసటగా అనిపిస్తే సురక్షి త ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకోవాల ని, నిరంతర డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని కోరారు. ట్రాఫిక్ సమ స్యలు లేదా అత్యవసర సహాయం అవసరమైనప్పుడు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ / 100 ను సంప్రదిం చాలని తెలిపారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.