–నేను స్వయంగా మోటార్ సైకిల్ మీద తిరుగుతూ క్షేత్ర స్థాయిలో పరి శీలన చేస్తా
–సంక్రాంతికి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండొద్దు, గత అనుభవాలను దృ ష్టితో యాక్షన్ ప్లాన్ చేయాలి
— పండుగ ముందు మూడు రోజు లు, తర్వాత మూడు రోజులు అన్ని విభాగాలు అలెర్ట్ గా ఉండాలి
— సంక్రాంతి పండుగకు టోల్ మిన హాయింపుకు కేంద్రమంత్రి నితిన్ గ డ్కరీకి లేఖ రాశాను
— సమీక్షా సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: సంక్రాం తి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ రహదారి పై ట్రాఫిక్ ర ద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యల పై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెం కట్ రెడ్డి డా.బి.ఆర్ అంబేడ్కర్ రా ష్ట్ర సెక్రటేరియట్ లో ఉన్నత స్థాయి
సమీక్ష సమావేశం సుదీర్ఘంగా నిర్వ హించారు. గతంలో ఎదురైనా ఇ బ్బందులు ఈ సందర్భంగా చర్చిం చారు. ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇ బ్బందులు ఏర్పడుతున్నాయో ఆ యా ప్రాంతాల్లో అధికారులు అప్ర మత్తంగా ఉండాలని, ట్రాఫిక్ ఇబ్బం దులు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
“హైదరాబాద్ – విజయవాడ హైవే పై జనవరి 8 నుండి వాహన రద్దీ ఎ క్కువ ఉంటుంది.సంక్రాంతికి వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా అన్ని రకా ల చర్యలు చేపట్టాలని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిం చారు. పోయినసారి ఎదురైనా అ నుభవాల దృష్ట్యా ముందస్తు చర్య లు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయ న మాటల్లోనే.. రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగు తుంది, దీనిపై అన్ని విభాగాల అధి కారులు అప్రమత్తంగా ఉండాలి. రే పు నేను తూప్రాన్ పేట్, అబ్దుల్లా పూర్ మెట్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తా. ప్రధానంగా ఎల్బీనగర్ నుం డి వనస్థలిపురం,పనామా గోడౌన్, హయత్ నగర్,రామోజీ ఫిల్మ్ సిటీ ఈ ప్రాంతాల్లో వేలాది వాహనాలు రద్దీ ఏర్పడుతుంది..ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లే దు..పండుగ రద్దీ ఉన్న రోజుల్లో లేన్ లు మూసే పనులు, భారీ యంత్రా లతో చేసే పనులు చేయొద్దు. అత్య వసరంగా చేయాల్సిన పనులు ట్రా ఫిక్ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో మాత్రమే చేయాలి.పండుగ మొద లుకానున్న తేదీకి ముందే రోడ్లపై ఉ న్న మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రా లు పూర్తిగా తొలగించాలి. అన్ని ర హదారి లేన్లు వాహనాల రాకపోక లకు పూర్తిగా అందుబాటులో ఉం చాలి. రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోట పగలు, రాత్రి స్పష్టంగా కనిపించే ట్రాఫిక్ బోర్డులు తప్పని సరిగా ఏర్పాటు చేయాలి.
హై-విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏ ర్పాటు చేసి పనులు జరిగే ప్రాంతం, ట్రాఫిక్ వెళ్లే దారి స్పష్టంగా చూపా లి. ఎక్కడా ట్రాఫిక్కు అయోమ యం కలిగించే ఏర్పాట్లు ఉండకూడ దు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు, టోల్ ప్లాజాలు, కీలక ప్రాంతాల్లో అ దనపు ట్రాఫిక్ పోలీసులను మోహ రించాలి. ట్రాఫిక్ మళ్లింపులు, ని యంత్రణ అంశాల్లో స్థానిక ట్రాఫిక్ పోలీసులతో నిరంతరం సమన్వ యం పాటించాలి. అన్ని సంబంధిత శాఖలు పోలీసుల సూచనలను త ప్పనిసరిగా అమలు చేయాలి.రోడ్డు పనుల్లో ఉన్న సిబ్బంది అందరూ ప్ర తిబింబించే జాకెట్లు (పసుపు / నా రింజ రంగు) తప్పనిసరిగా ధరించా లి.
రాత్రి సమయంలో జంక్షన్లు, వర్క్ జోన్ల వద్ద తగినంత వెలుతురు ఏ ర్పాటు చేయాలి.బారికేడ్లు, ట్రాఫిక్ ఐలాండ్లపై రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్ప నిసరిగా ఉపయోగించాలి. రూట్ పేట్రోల్ వాహనాలు, క్రేన్లు, అంబులె న్సులు 24 గంటలు అందుబాటు లో ఉంచాలి. అన్ని రహదారి ఘట నలను ప్రత్యేక ఇన్సిడెంట్ మేనేజ్ మెంట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరం తరం పర్యవేక్షించాలి. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా సజావు గా వెళ్లేలా అదనపు బృందాలను మోహరించాలి. ముఖ్యమంత్రి ఈ ట్రాఫిక్ అంశంపై సీరియస్ గా ఉ న్నారు. సంక్రాంతి పండుగ వేళ ట్రా ఫిక్ ఇబ్బంది లేకుండా టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రానికి రి క్వెస్ట్ చేస్తాం.
పండుగ పూట లక్ష లాది మంది ప్ర యాణం చేస్తారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది మా ప్రభుత్వ ఆలోచన కేంద్ర మంత్రి నితి న్ గడ్కరీకి ఈ రోజు లేఖ రాశాను. అవసరమైతే ఒకటి, రెండు రోజుల్లో నేను స్వయంగా వెళ్ళి కలుస్తా త ప్పనిసరి ఐతే టోల్ ప్లాజాల వద్ద నా మినల్ పేమెంట్ చేయడానికి ఆర్ అండ్ బి సిద్ధంగా ఉన్నది. జనవరి లో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరకు వెళ్లే ల క్షలాది భక్తులకు అసౌకర్యం లేకుం డా చూడాలని కోరతా.టోల్ ప్లాజాల వద్ద ఫ్రీగా ఉంటే వాహనాలు ఆగ వు. ఎలాంటి అసౌకర్యం ఉండదు. పండుగ ముందు మూడు రోజులు, తర్వాత మూడు రోజులు అన్ని వి భాగాలు అలెర్ట్ గా ఉండాలి. ఈ రో జుల్లో హెవీ వెహికల్స్ రహదారిపై ప్ర యాణం చేయకుండా చూడాలి. ప్ర త్యేక కంట్రోల్ రూం సెంటర్ ఏర్పా టు చేయాలి.108అంబులెన్స్ లు, మెడికల్ టీంలు, రెవెన్యూ, పోలీ సు, ఆర్ అండ్ బి,NHAI అలెర్ట్ గా ఉండాలి.నేను స్వయంగా మోటార్ సైకిల్ మీద తిరుగుతూ క్షేత్ర స్థాయి లో పరిశీలన చేస్తా.
చౌటుప్పల్, నార్కట్ పల్లి, కట్టంగూ రు,పెద్దకాపర్తి,గుండ్రంపల్లి,టేకుమట్ల వద్ద ఉన్న ఇబ్బందులు అధిగ మించాలి. ఆయా జిల్లా కలెక్టర్ల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకో వాలి. రోడ్ ఎంక్రోచ్ మెంట్స్ వెంటనే తొలగించాలి. ఏమైనా ప్యాచ్ వ ర్క్స్ ఉంటే NHAI వాళ్లు వెంటనే పూర్తి చేయాలి. నేను రోడ్ మీద డ్యూటీలోనే ఉంటాను.అధికారులు అంతా డ్యూటీలోనే ఉంటూ ఈ సం క్రాంతికి ట్రాఫిక్ ఫ్రీ రోడ్లు లక్ష్యంగా పనిచేద్దామని మంత్రి పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు,నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి,సూర్యాపేట జిల్లా కలె క్టర్ తేజస్ నందలాల్ పవార్,NHAI రీజినల్ అధికారి శివ శంకర్, MoR TH రీజినల్ అధికారి కృష్ణ ప్రసాద్, ఇంటెలిజెన్స్ ఎస్పీ జగదీశ్వర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ ర ఘు, పలువురు పోలీస్ ఉన్నతాధి కారులు,ఆర్ అండ్ బి ఈ ఎన్సి లు జయభారతి, మోహన్ నాయక్, ఎ స్.ఈ ధర్మారెడ్డి, తదితరులు పాల్గొ న్నారు.

