Sunday, September 27, 2026
More
    HomePoliticsMinister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే...

    Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పే దలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు

    📰 Generate e-Paper Clip

    –కాంగ్రెస్ అభ్యర్థులనే సర్పంచులు గా గెలిపించాలి

    –అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎ స్ చేసింది ఏమీ లేదు

    –తిప్పర్తి, జొన్నలగడ్డగూడెం గ్రామా లలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు గా ప్రచారం

    Minister Komatireddy Venkata Reddy :

    ప్రజా దీవెన, తిప్పర్తి: తెలంగాణ రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత పేదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ అభివృద్దె ధ్యేయం గా ముందుకు పోతుందని రాష్ట్ర రో డ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ న్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్ర వారం ఆయన తిప్పర్తి మండల కేం ద్రంతో పాటు జొన్నలగడ్డ గూడెం గ్రా మంలో నిర్వహించిన ఎన్నికల ప్ర చార కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ తి ప్పర్తి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బద్దం రజిత-సుధీర్, జొన్నలగడ్డ గూడెం సర్పంచ్ అభ్యర్థి నామిరెడ్డి అనురాధ- వెంకట్రాంరెడ్డిలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కాం గ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అ త్యధిక మెజార్టీతో గెలిపించాలని కో రారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి జరు గుతుందని తెలిపారు. ఇతర పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఎలాంటి ప్రయో జనం ఉండదని పేర్కొన్నారు.

    గ్రామపంచాయతీ ఎన్నికలు ము గి సిన తర్వాత అన్ని గ్రామాలకు నిధు లు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.గత 10 ఏండ్లు అధికారంలో ఉన్న బిఆ ర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.పేద ప్ర జలకు ఇండ్లు, రేషన్ కార్డులు ఇ వ్వలేదని విమర్శించారు. బతుక మ్మ చీరల పేరిట 60 రూపాయల నాసిరకం చీరలను మహిళలకు ఇ చ్చిందని ధ్వజమెత్తారు.

    కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అర్హులైన వారం దరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కా ర్డులు మంజూరు చేసిందని అన్నా రు.అదేవిధంగా మహిళలందరికీ నాణ్యమైన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసినట్లు తెలిపారు. గ్రా మపంచాయతీ ఎన్నికలలో కాం గ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి గ్రా మాల అభివృద్ధికి ప్రజలు తోడ్పడా లని కోరారు.

    ఈ కార్యక్రమంలో నల్లగొండ మా ర్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమే ష్,డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల రవీందర్ రెడ్డి, తిప్పర్తి మాజీ సర్పంచ్ లు మోష, రొట్టెల రమేష్, మాజీ ఎంపీటీసీలు కిన్నెర అంజి, ఎల్లయ్య, ఇండ్లూరు సర్పం చ్ అభ్యర్థి పాప కంటి సైదులు, స ర్వారం సర్పంచ్ అభ్యర్థి మర్రి నర సయ్య, శిలార్మియా గూడెం సర్పం చ్ అభ్యర్థి కొత్తపల్లి శ్రీనివాస్, జంగి రెడ్డిగూడెం సర్పంచ్ అభ్యర్థి దాసరి జానయ్య, తాందార్ పల్లి సర్పంచ్ అభ్యర్థి కారే శ్రీరాములు, పలువు రు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.