Sunday, September 27, 2026
More
    HomePoliticsMP Etela Rajender : ఎంపీ ఈటల రాజేందర్ ఓటర్లకు అ ప్పీల్, మీరే ఎన్నికల్లో...

    MP Etela Rajender : ఎంపీ ఈటల రాజేందర్ ఓటర్లకు అ ప్పీల్, మీరే ఎన్నికల్లో డబ్బుల పం పిణీ ఆపగలిగేది

    📰 Generate e-Paper Clip

    –ఈ సంసృతిని అంతం చేయాల్సి న ప్రజలే

    –పోటీ చేసేవారు కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి ఆగం కాకండి

    MP Etela Rajender : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రజా స్వామ్య వ్యవస్థలో పార్లమెంట్, అ సంబ్లీతో పాటు గ్రామ సచివాల యాలు, మండల జిల్లా పరిషత్ లు సమర్థవంతంగా పనిచేస్తేనే సమగ్రా భివృద్ధి జరుగుతుందని, గ్రామాల్లో ఉండే సమస్యలపై సర్పంచ్ కి ఉన్న అవగాహన ఎంపీపీ, జడ్పిటిసి, ఎ మ్మెల్యే, ఎంపీలకు ఉండదని మ ల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓటర్లకు అప్పీల్ చేశారు. అందుకే గ్రామ సచివాలయాలు ఎంత గొ ప్పగా పనిచేస్తే ప్రజల సమస్యలు అంత గొప్పగా పరిష్కారం అవు తాయని పేర్కొన్నారు. గ్రామ పం చాయతీ ఎన్నికల సందర్భంగా ఓ టర్లకు అప్పీల్ చేస్తూ ఓ ప్రకటన వి డుదల చేశారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో సారాంశం ప్రకా రం ఆయన వ్యాఖ్యలు ఇలా ఉన్నా యి.

    రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుం డా నిర్వీర్యం చేశారు.కేంద్రం ఇచ్చే పర్ కాపిటా, ఫైనాన్స్ కమిషన్, ఉ పాధిహామీ నిధులతో మాత్రమే గ్రా మాల్లో అభివృద్ధి జరుగుతుంది.

    గత సర్పంచ్ లు చేసిన పనులకు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించక పోవడం వల్ల అనేకమంది సర్పంచ్ లు అప్పుల పాలయ్యి ఆత్మహత్య లు చేసుకున్నారు.

    భార్యలా పుస్తెలు అమ్మి, ఉన్న ఆ స్తులు అమ్మి పనులు చేసినం అయి నా బిల్లులు చెల్లించలేదని ఏడుస్తు న్నారు. కమీషన్లు ఇచ్చుకోలేక, ఆఫీ సులు చుట్టూ తిరగలేక ఇబ్బందు లు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అ య్యింది. ఈ రెండేళ్లలో బిల్లులు చె ల్లించలేని, పనులు చేయలేని మం త్రులు ఇప్పుడు వచ్చి సర్పంచ్ ల ను గెలిపించండి ఈ మూడేళ్లు ప నులు చేస్తామని చెప్తున్నారు, వీళ్ల మాటలు ఎవరు నమ్మాలి వారి మీ ద నమ్మకం లేదు.

    గ్రామపంచాయితీలను అత్యంత నిర్వీర్యం చేసింది BRS. బిల్లులు పెండింగ్ పెట్టింది వాళ్లే ఇప్పుడు వచ్చి మళ్లీ ఓట్లు అడుగుతున్నారు. వారు అక్కడ ఇక్కడ అధికారంలో లేరు.. వారిది కత్తి కాదు నెత్తి కా దు. వారు గెలిచి చేసేది కూడా ఏమీ లేదు. గ్రామాల్లో అభివృద్ధి జరుగు తుంది అంటే అది కేవలం కేంద్రప్ర భుత్వం నిధులతోనే జరుగుతుంది. గ్రామాల్లో పెరిగే చెట్లు, పారే మురు గు కాలువలు, వేసే సిమెంట్ రోడ్లు, కడుతున్న గ్రామపంచాయితీ, అం గన్వాడీ భవనాలు, కట్టిన రైతువేది కలు, స్మశానవాటికలు, తడిచెత్త – పొడిచెత్త షెడ్లు, చౌరస్తాలో పెట్టిన హైమాక్స్ లైట్లు అన్నీ కేంద్రప్రభుత్వ నిధులతో పెట్టినవే.

    అందుకే ప్రజలు గమనించమని కో రుతున్న. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే ఒరిగేది ఏమీలేదు. మీ మధ్య లో ఉండి, మీ సమస్యలు అర్థం చే సుకొని పరిష్కరించే వారిని ఎన్ను కోండి. ఎమ్మార్వో ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ పనులు, వ్య క్తిగత సమస్యలు తీర్చేవారు కా వా లి తప్ప ఎక్కడో ఉండి చుట్టం చూ పుగా వచ్చేవారిని ఎన్నుకోకండి.

    ఈ పూటకి ఎక్కడి నుండో వచ్చి ల క్షలు ఖర్చు పెట్టి, దావతులు ఇచ్చి, పైసలు ఇచ్చి గెలుస్తా అంటే గ్రా మా లు అభివృద్ధి కావు. ప్రజల మధ్య ఉన్నవారిని ఎన్నుకోండి తప్ప పైస లున్న వాళ్లను కాదని ప్రజలను కో రుతున్న. పాత సర్పంచులు మేమే అప్పుల పాలయ్యాం పోటీ చేయవ ద్దని చెప్తున్నారు. మహిళా రిజర్వే షన్లు ఉన్న దగ్గర పోటీ చేయమంటే మహిళలు ఏ డుస్తున్నారు.

    ముందుకు రావడంలేదు. ఎందు కంటే మా పుస్తెలు, భూమి, ఇళ్ళు అమ్ముకో దలు చు కోలేదు మా కు టుంబాన్ని రోడ్డున పడేయలేం అం టున్నారు. వార్డు మెంబెర్ దగ్గర నుండి ఎంపీ వరకు డబ్బులు పెట్టి గెలుచుకున్నా వారి ముఖంలో కళ లేకుండా పోయింది. ఎన్నికల్లో డ బ్బుల పంపిణీ విపరీతంగా పెరిగిం ది.

    పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు దీనిని తుంచాల్సిన అవసరం ఉం ది. దీన్ని విరిచే భాద్యత ప్రజామీ దనే ఉంది. ఈ పూటకు దావత్ ఇ స్తున్నారని, పైసలు ఇస్తున్నారని ఓ టు వేస్తే ఐదేళ్లు ఇబ్బంది పడాలి.

    ప్రజలారా విజ్ఞులు మీరే, ప్రజాస్వా మ్యాన్ని బాగు చేయాల్సింది మీరే, మన బ్రతుకులు బాగు చేసుకోవా ల్సింది మనమే.

    ప్రజాస్వామ్యంలోప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రజలే చరిత్ర నిర్మాతలు. అభ్యర్థులు కూడా ఆగం ఆగం అ య్యి హామీలు ఇవ్వకండి. ఏది అడి గితే అది చేస్తాం అని చెప్పకండి.

    అనవసర హామీలు ఇచ్చి ఆగం కా కండి. ప్రజలకు మీ మధ్యలో ఉం టా మీ సమస్యలు పరిష్కరిస్తాం, ఉన్నంతలో అభివృద్ధి చేస్తాం అని చెప్పండని ఈటెల రాజేందర్ సూచించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.