Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లాలోని అన్ని రహదారుల కు ఇరువైపులా ఉండే చెట్ల కొమ్మలు, ము ళ్లపొదల వల్ల ప్రమాదాలు సంభవించకుండా వాటిని తొ ల గించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవా రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహిం చి న జిల్లా స్థాయి రహ దారి భద్రత కమిటీలో ఆయన మాట్లా డారు.
రహదారుల పక్కన ఉండే చెట్ల కొమ్మలు రహదారు ల పైకి రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని దృష్టి లో ఉంచుకొని చెట్ల కొమ్మలను తొలగించాలని, ఎట్టి ప రిస్థి తుల్లో చెట్లు కోట్ట వద్దని చెప్పారు. అలాగే ఎక్కడ రహ దా రులు కోతకు గురి కాకూడదని, ప్రత్యేకించి గ్రామాలకు అ నుసంధానంగా ఉండే రహదారులు ఎక్కడకోతకు గురి కావ డానికి వీలులేదని అన్నారు.
నల్గొండ జిల్లా కేం ద్రం నుండి దేవరకొండ వెళ్లే రహ దారిపై కనగల్ నుండి దేవరకొండ వరకు అనేక గుంతలు ఉన్నాయ ని, వాటిని చదును చేయాలని ఆదేశించారు. ఇసుక వాహ నాలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు వెనుక, ముందు తప్ప నిసరిగా రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని ,అలాగే పేర్లు సూచిం చే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిశ్రమ లు ఉండే చోట రాంగ్ రూట్లో కార్మికులు రహదారిని దాటి ప్రమాదాలకు గురికాకుండా సంబంధిత పరిశ్రమల యాజ మాన్యంతో మాట్లాడి గ్రామస్తులకు అవగాహన కల్పించాల ని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మాట్లా డుతూ నల్గొండ జిల్లా కేంద్రంతో పా టు, జిల్లాలోని 65వ జాతీయ రహదారి, ఇతర రహదారులపై రో డ్డు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉ న్న బ్లాక్ స్పాట్లు ,వాటిని నివారించేందుకు తీసుకునే చర్య లు, తదితర అంశాలను పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వా రా వివ రించారు.
పరిశ్రమల వద్ద, ము ఖ్యంగా చిట్యాల వద్ద రాంగ్ రూట్లో కార్మికులు రోడ్డు దాటడం వల్ల ప్రమాదాలు జ రుగుతున్నా యని, వాటిని నివారించేందుకు తప్పనిసరి గా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్థానిక సంస్థ ల ఇన్చార్జ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, డిఆ ర్ఓ దశర థ్, అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్ అండ్ బిఈ ఈ శ్రీ ధర్ రెడ్డి, సంబంధిత అధికారులు సమావేశానికి హాజరయ్యారు.


