SP Sharath Chandra : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో సైబర్ నేరా లపై అవగాహన పెంచేందుకు తె లంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో, “ప్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో 42 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలి పారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 2 నుండి జనవరి 12 వరకు ప్రతి వా రం ఒక్క ప్రత్యేక థీమ్‌తో అవగాహ న కార్యక్రమాల రూపంలో చేపట్టబ డుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా మంగళ వారం జిల్లా పోలీస్ కార్యాలయం లో కళాశాల విద్యార్థినులు, విద్యా ర్థులకు ఆన్లైన్ జూమ్ మీటింగ్ ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర డీజీ పీ శివదర్ రెడ్డి ఆధ్వర్యంలో రూ పొందించిన “ప్రాడ్ కా ఫుల్ స్టాప్” పోస్టర్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. అనంతరం విద్యార్థులతో సైబర్ నేరాలకు మోసపోకూడదనే ప్రతిజ్ఞ చేయించారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వి ద్యార్థులతో మాట్లాడుతూ దేశవ్యా ప్తంగా ప్రతీ రోజూ సుమారు రూ.2 వేల కోట్లు సైబర్ మోసాల ద్వారా న ష్టం జరుగుతోందని తెలిపారు. దీని ని నివారించగల మార్గం ప్రజల్లో అ వగాహన పెంపుదలేనని చెప్పారు. చదువుకున్న యువత సైబర్ నేరా లపై అవగాహన పెంచుకుంటే తమ కుటుంబ సభ్యులకు, పరిసరాల్లోని ప్రజలకు కూడా తెలియజేసే అవ కా శం ఉంటుందని పేర్కొన్నారు. అలా గే సైబర్ నేరగాళ్లు Loan Apps, O nline Links, Investment Fra uds, Fraud Calls, OTP scam s, Digital Arrest, WhatsApp/Twitter Links, Online Scratch Cards, APK Files వంటి పద్ధతు లతో మోసాలను చేస్తున్నారు కాబ ట్టి ఏ అనుమానాస్పద లింకులు, ఫై ళ్ళు క్లిక్ చేయవద్దని సూచించారు.
ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 కు కాల్ చేసి సమా చారం ఇవ్వాలని, NCRP పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టే షన్ తక్షణ చర్య తీసుకుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీ నారాయణ, నల్లగొండ డీఎస్పీ శివ రాం రెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవ రా వు, 1 టౌన్ సీఐ రాజ శేఖర్ రెడ్డి, సై బర్ క్రైమ్ ఎస్ఐ విష్ణు, 2 టౌన్ ఎస్ ఐ సైదులు, కళాశాల విద్యార్థిను లు, విద్యార్థులు పాల్గొన్నారు.


