Wednesday, September 30, 2026
More
    HomePoliticsSardar 150 Unit March : ప్రజల్లో జాతీయసమైక్యత, దేశ భక్తి ని పెంపుకు సర్దార్...

    Sardar 150 Unit March : ప్రజల్లో జాతీయసమైక్యత, దేశ భక్తి ని పెంపుకు సర్దార్ 150 యూనిట్ మార్చ్ నిర్వహణ 

    📰 Generate e-Paper Clip

    –రాజ్యసభ సభసభ్యులు కేసరి దే వ్ సిన్హ జ్వాల

    Sardar 150 Unit March : ప్రజా దీవెన, నల్లగొండ: సర్దార్ వల్ల భాయ్ పటేల్ 150 వ జ యంతి ని పురస్కరించుకొని ప్రజలలో జాతీ య సమైక్యతను దేశభ క్తిని పెం పొందించేందుకుగాను, కేంద్ర యువ జన వ్యవహారాలు, క్రీడల మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్, ఎన్ఎస్ఎస్ సహ కారంతో “సర్దార్ @150 యూనిట్ మార్చ్” ను ని ర్వ హించనున్నట్లు ఎంపీ రాజ్యసభ స భసభ్యులు కేసరి దేవ్ సిన్హ జ్వాల తెలిపారు. సర్దార్@ 150 యూనిటీ మార్చ్ కార్య క్రమం అమలులో భా గంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చా ర్జిగా నియమితులైన ఆయన బు ధ వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నల్గొండ, సూర్యాపేట జిల్లాల అధి కారులతో కలిసి మీడియా ప్రతిని ధులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడారు.

    సర్దార్ @ 150 యూనిటీ మార్చ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ సమైక్యత,దేశభక్తిని పెంపొందించ డం, ప్రత్యేకించి జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ ప టేల్ పాత్ర , జాతి నిర్మాణంలో యు వతను ప్రోత్సహించడం ద్వారా 20 47 నాటికివికసిత్ భారత్ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    ఇందులో భాగంగా ఈనెల 31 నుం డి నవంబర్ 25 వరకు జిల్లాలలో వి డతలవారీగా కార్యక్రమాలను నిర్వ హించడం జరుగుతుందని, సర్దార్ @ 150 యూనిటీ మార్చ్ లో 3 రో జుల పాదయాత్రను జిల్లాస్థాయిలో నిర్వహించాలని, ప్రతి పాదయాత్ర 8 నుండి 10 కిలోమీటర్లు ఉండేలా చూడాలని, ఈ పాదయాత్రలో క నీ సం 500 మంది యువత, విద్యార్థు లు పాల్గొనేలా చూడాలని ఆయన అధికారులతో కోరారు.

    సర్దార్@ 150 యూనిటీ మార్చ్ ని ర్వహించడంలో భాగంగా జిల్లా స్థా యిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అ ధికారులతో కోర్ కమిటీలను ఏర్పా టు చేయడం జరిగిందని , ఇందులో విశ్రాంత ఐఏఎస్ అధికారులు,జిల్లా యువజన సర్వీస్ల అధికారి, ఇతర అధికారులు, ప్రతినిధులతో కో-ఆ ర్డి నేషన్ కమిటీలను ఏర్పాటు చేశా మని చెప్పారు. ఈ విషయమై ప్ర తి వారం జాతీయ స్థాయి కోర్ కమిటీ సమీక్షలు నిర్వహిస్తున్నదని వెల్ల డించారు.

    సర్దార్@150 యూనిటీ మార్చ్ కా ర్యక్రమాలలో భాగంగా జిల్లా స్థా యిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ వితానికి సంబంధించి ప్రజలకు యు వతకు తెలియజేయడం, వైద్య శిబి రాల నిర్వహణ ,యోగ క్యాంపులు, ఎగ్జిబిషన్లు, వర్క్ షాప్ ల నిర్వహ ణ ,కళాశాల,పాఠశాల విద్యార్థులకు డిబేట్,ఇతర కాంపిటీషన్ల నిర్వహ ణ, వీధి నాటకాలు, ప్రచారాలు, స్వ చ్ఛత కార్యక్రమాలను చేపట్టాలని ఆయన తెలిపారు.

    ఇందుకుగాను ఆయా జిల్లాల వారీ గా రూట్ మ్యాప్ ను రూపొందించా లన్నారు. నల్గొండ, సూర్యాపేట జి ల్లాలో నవంబర్ 12, 13 తేదీలలో పాదయాత్ర నిర్వహించడం జరుగు తుందని, ఇందుకు సంబంధించి త గిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ యన జిల్లా యంత్రాంగాన్ని కోరారు.

    ఇదే అంశంపై నల్గొండ ఆర్డీవో వై.అ శోక్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

    ఎంపీ, రాజ్యసభ సభ్యులు కేసరి దేవ్ సిన్హ జ్వాల కేంద్ర ప్రభుత్వ ఆ దేశాల మేరకు నల్గొండ జిల్లాలో స ర్దార్ @ 150 యూనిట్ మార్చ్ కా ర్యక్రమాన్ని విజయవంతం చేసేం దుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కా ర్యక్రమాలను నిర్వహించడం జరు గుతుందని తెలిపారు.అడిషనల్ ఎస్పీ రమేష్, డిపిఆర్ఓ వెంకటే శ్వర్లు ,జిల్లా క్రీడల అభివృద్ధి అధికా రి ఎం డి అక్బర్ అలీ, జెడ్పి సీఈఓ శ్రీనివాసరావు, మెప్మా పిడి శ్రీనివా స్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్ష పతి, మైభారత్ ప్రతినిధి కృష్ణ , సా మాజిక కార్యకర్త సురేష్ గుప్తా, త దితరులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా సర్దా ర్ @150 యూనిటీ మార్చి పై రూ పొందించిన గోడప త్రికను ఆవిష్కరించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.