Tuesday, September 29, 2026
More
    HomePoliticsSP Narasimha : మూసినదిపై బీమారం లోలెవల్ బ్రి డ్జి వద్ద నీటిప్రవాహ పరిస్థితులపై ఎస్పి...

    SP Narasimha : మూసినదిపై బీమారం లోలెవల్ బ్రి డ్జి వద్ద నీటిప్రవాహ పరిస్థితులపై ఎస్పి నరసింహ ఆరా 

    📰 Generate e-Paper Clip

    –ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలి

    –నీటితో నిండిన చెరువులు, కుంట లు, నదుల్లోకి ప్రజలు దిగవద్దు

    –విస్తారంగా కురుస్తున్న వర్షాల దృ ష్ట్యా జిల్లా పోలీస్ అప్రమత్తం

    –అత్యవసర సమయాల్లో డయల్ 100 లో పోలీస్ సేవలు పొందాలి

    SP Narasimha : ప్రజా దీవెన, సూర్యాపేట: ప్రజల ర క్షణలో పోలీసు అనుక్షణం అప్ర మ త్తంగా పని చేస్తున్నారు అని జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ అన్నారు. వర్షాల దృష్ట్యా మూసి నది ఉధృ తంగా ప్రవహిస్తున్నందున గురు వారం సూర్యాపేట రూరల్ పరిధి వేదేరివారి గూడెం వద్ద మూసి నది పై భీమారం లో-లెవెల్ బ్రిడ్జి వద్ద నీ టి ప్రవాహ పరిస్థితిని ఎస్పీ నర్సిం హా ఐపీఎస్ పరిశీలించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధిక వర్షాల వల్ల చెరువులు నదులు కుంటలు నిండి ప్రమాదకర రీతిలో ఉన్నాయని వాటిలోకి ఎవరు దిగవద్దని ఎస్పీ సందర్భంగా కోరారు.

    తుఫాను ప్రభావంతో రెండు రోజు లుగా విస్తారంగా కురిసిన వర్షాలు దృష్ట్యా అతను చెరువులు కుంట లు నీటితో నిండి ఉండి ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయి దీనిపై జి ల్లా పోలీస్ శాఖ అప్రమత్తమై ప్రమా దకరంగా ఉన్న స్థలాల వద్ద భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది పో లీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం నీటి ప్రవాహం లోకి ఎవరు వెళ్లకుండా రో డ్లపై బారికెడ్ లు, వాహనాలు అడ్డు గా పెట్టడం జరిగింది. అలాగే రోడ్లపై విరిగిపడిన చెట్ల ను తొలగించడం, నీటి ప్రవాహంలో చిక్కుకున్న వాహ నాలను తీయడం, ప్రమాదంలో ఉ న్న ప్రజలను కాపాడడం జరిగిన ది, అలాగే తెగిపోయిన రోడ్లను సం బంధిత అధికారితో కలిసి మరమ్మ తులు చేయించడం జరిగిoదని తె లిపారు.

    జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజారక్షణ లో నిరంతరం కృషి చేస్తుంది అన్నా రు. అత్యవసర పరిస్థితుల్లో సెలవ లు రద్దు చేసి సిబ్బందిని అందుబా టులో ఉంచామని ఎస్పి అన్నారు. ఎస్పి వెంట సూర్యాపేట రూరల్ CI రాజ శేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పె క్టర్ రా మారావు, రూరల్ SI బాలు నాయ క్, సిబ్బంది ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.