
Telangana Rice Millers ED Investigation : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో ప్రభుత్వ ధాన్యం బకా యిల వ్యవహారం తీవ్ర మలుపు తిరుగుతోంది. భారీ మొత్తంలో ప్రభుత్వానికి బకాయిపడిన రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కఠి న చర్యలతో రంగంలోకి దిగింది. బకాయిలు చెల్లించకుండా త ప్పించుకుంటున్నారనే ఆరోపణ లు ఎదుర్కొంటున్న 20 మంది రై స్ మిల్లర్ల జాబితాను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సివిల్ సప్లయ్ శాఖ అందజేసినట్లు తె లుస్తోంది.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధా న్యం బకాయిలను ఉద్దేశపూర్వ కంగా నిలిపివేశారా? ఆర్థిక లా వాదేవీల్లో అక్రమాలు చోటుచేసు కున్నాయా? అనే కోణాల్లో అధి కారులు దృష్టి సారించినట్లు స మాచారం. ధాన్యం లావాదేవీల్లో అక్రమ మార్గాల్లో నిధుల సమీకర ణ, హవాలా రూపంలో డబ్బు త రలింపు వంటి ఆరోపణలు కూ డా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయా మిల్లర్ల ఆ స్తులు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్‌కు సంబంధించిన రికార్డు లపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఈడీని కోరినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యా ప్తంగా చర్చనీయాంశంగా మారిం ది.
9 మంది మిల్లర్లపై పీడీ యాక్ట్‌కు రంగం సిద్ధం
ఇదిలా ఉంటే ప్రభుత్వ ధాన్యం బకాయిలు చెల్లించకుండా త ప్పించుకునేందుకు ప్రయత్నిస్తు న్నారనే ఆరోపణలు ఎదుర్కొం టున్న మరో 9 మంది రైస్ మిల్ల ర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించే దిశ గా అధికారులు అడుగులు వేస్తు న్నట్లు తెలుస్తోంది.బకాయిల చె ల్లింపుపై పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించక పోవడం, భారీ మొత్తంలో బకా యిలను పెండింగ్‌లో ఉంచడం, ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు అనుమానాలు ఉండటం వంటి అంశాలను అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం.
మొత్తంగా ఒకవైపు 20 మంది మిల్లర్ల వ్యవహారం ఈడీ దర్యా ప్తు దిశగా సాగుతుండగా మ రో వైపు 9 మందిపై పీడీ యాక్ట్ ప్ర యోగానికి రంగం సిద్ధమవుతుం డటం తెలంగాణలో రైస్ మిల్లర్ల వ్యవహారంపై ప్రభుత్వ వైఖరి ఎం త కఠినంగా మారిందో స్పష్టం చే స్తోంది. కాగా తాజాగా ముఖ్య మంత్రి సమక్షంలో జరిగిన పౌర సరఫరాల శాఖ అత్యున్నత స్థా యి సమీక్షా సమావేశం అనం త రం బకాయిపడ్డ మిల్లర్లపై చర్య లు చకచకా ముందుకు నడుస్తు న్నాయని చెప్పవచ్చు.
పరారీలో బడా మిల్లర్ల బంధు మిత్రులు
ప్రభుత్వానికి భారీగా బకాయిలు చెల్లించాల్సిన రైస్ మిల్లర్లపై తె లంగాణ ప్రభుత్వం చర్యలను మ రింత వేగవంతం చేస్తున్న నేప థ్యంలో కీలక పరిణామాలు చో టుచేసుకుంటున్నాయి. ప్రభు త్వానికి బకాయిపడ్డ డిఫాల్ట్ మి ల్లర్లపై కఠిన చర్యలకు రంగం సి ద్ధం కావడంతో పలువురు మిల్ల ర్లు, వారి బంధుమిత్రులు అజ్ఞా తంలోకి వెళ్లినట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ధాన్యం బకాయిలను చెల్లించకుండా త ప్పించుకుంటున్న మిల్లర్ల వివరా లను అధికారులు ఇప్పటికే సేక రించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా డిఫాల్ట్ మిల్లర్లకు సం బంధించిన పూర్తి వివరాలను ఎ న్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అప్పగించినట్లు సమాచారం. అంతేకాకుండా అవసరమైన చో ట పీడీ యాక్ట్ కింద కేసులు న మోదు చేసే అంశాన్ని కూడా ప్ర భుత్వం పరిశీలిస్తున్నట్లు తెలు స్తోంది.
ఈ పరిణామాలతో తమపై ఎ లాంటి చర్యలు తీసుకుంటారో న న్న ఆందోళనకు గురైన కొందరు మిల్లర్లు ముందుగానే జాగ్రత్త పడి నట్లు సమాచారం. తమ సెల్‌ఫో న్లను పక్కన పెట్టి, కుటుంబ స భ్యులతో కలిసి అందుబాటులో లేకుండా వెళ్లిపోయినట్లు అధికా ర వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మిల్లర్ల కదలికలపై ఇప్పటికే ని ఘా పెట్టిన అధికారులు.. పరా రీ లో ఉన్నట్లు భావిస్తున్న వారి ఆ చూకీ కోసం చర్యలను ముమ్మ రం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర భుత్వ బకాయిల వసూళ్ల వి ష యంలో ఇక ఎలాంటి వెసులు బాటు ఉండదన్న సంకేతాలను ప్రభుత్వం స్పష్టం చేస్తుండటం తో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసు కునే అవకాశం కనిపిస్తోంది. బకా యిల వసూళ్లపై ప్రభుత్వం దూ కుడు పెంచడంతో మిల్లర్లలో మా త్రం టెన్షన్ మొదలైనట్లు తెలు స్తోంది.





