Monday, September 28, 2026
More
    HomePoliticsGram Panchayat Elections : పారదర్శకంగా మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు

    Gram Panchayat Elections : పారదర్శకంగా మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు

    📰 Generate e-Paper Clip

    — నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి

    Gram Panchayat Elections : ప్రజా దీవెన, కొండమల్లేపల్లి:మూడో విడత. గ్రామపంచాయతీ ఎన్నికల ను చిత్తశుద్ధితో పారదర్శకంగా నిర్వ హించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎ న్నికల అధికారి ఇలా త్రిపాఠి పోలిం గ్ సిబ్బందికి సూచించారు. మంగ ళవారం ఆమె దేవరకొండ డివిజన్ , కొండమల్లేపల్లి లో ఏర్పాటుచేసిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల డిఆర్సి సెంటర్ ను సంద ర్శించి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఆర్ఓకు పలు సూచ నలు చేశారు.

    ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం ప్ర దర్శించవద్దని , పోలింగ్ కేంద్రాలను ముందే చూసుకోవాలని, పోలింగేం ద్రంలో సరైన విధంగా లైటింగ్ ఉండే లా చూడాలని, ఓటింగ్ కంపార్ట్మెం ట్ కిటికీల దగ్గర ఏర్పాటు చేయవ ద్దని చెప్పారు. ముగ్గురికి మించి ఓ టర్లు పోలింగ్ బూతులో ఉండరాద న్నారు.

    కౌంటింగ్ కు సంబంధించి సూచ న లు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మ ధ్యా హ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాలని, ఇందుకుగాను కౌంటింగ్ ఏర్పాట్లు ముందే చూసు కోవాలన్నారు. ఎక్కువ మంది ఓట ర్లు ఉన్నచోట ఎక్కువ మంది ఏజెం ట్లను నియమించుకునేలా అభ్య ర్థు లకు ముందే తెలియజేయాలని, 2. 15 గంటల తర్వాత కౌంటింగ్ కేం ద్రంలోకి ఎవరిని అనుమతించడం జరగదని స్పష్టం చేశారు.

    ఒకవేళ ఎవరైనా అభ్యర్థి రేకౌంటింగ్ చేయదలిస్తే కౌంటింగ్ పూర్తయిన 1 5 నిమిషాలలోపే రాతపూర్వకంగా ఆర్ఓకు దరఖాస్తు ఇవ్వాలని, ఆర్ ఓ నిర్ణయంపైనే రీకౌంటింగ్ ఆధారప డి ఉంటుందని తెలిపారు. జిల్లాలో ని 80 శాతం పోలింగ్ కేంద్రాలలో వె బ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయడం జరి గిందని, తక్కిన వాటిలో వీడియో గ్ర ఫీ చేయిస్తున్నామని అన్నారు. స్టా ట్యూటరీ,నాన్ స్టాట్యూటరీ మెటీ రి యల్ ను ఎంపీడీవోలు ఎస్ టిఓలో జమ చేసే వరకు బాధ్యత తీసుకో వాలనిvచెప్పారు.సమస్యాత్మక పో లింగ్ కేంద్రాలకు ఎక్కువ సిబ్బందిని నియమించడం జరిగిందని, ఎన్నిక లు నియమనిబంధనల ప్రకారం పూర్తి చేయాలని తెలిపారు.

    కాగా మూడో విడత గ్రామపంచా యతీ ఎన్నికలు 269 పోలింగ్ కేం ద్రాలలో 2206 వార్డులలో జరగ ను న్నాయి. ఇందులో 7 వార్డులకు ఎ లాంటి నామినేషన్లు రాలేదని ,42 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కా గా, 596 వార్డులు ఏకగ్రీవమ యా యని కలెక్టర్ వెల్లడించారు. ఏకగ్రీ వాల అనంతరం 227 గ్రామ పం చాయతీలకు, 1603 వార్డులకు

    పోలింగ్ జరగనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.226 పోలింగ్ లొకేషన్లు ఏ ర్పాటు చేయడం జరిగిందని ,81 మంది స్టేజి వన్ ఆర్వోలు, మరో 81 మంది స్టేజి వన్ ఏ ఆర్ ఓ లు, 9 మంది ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు, స్టే జ్ టు ఆర్వోలుగా 300 మందిని ని యమించడం జరిగిందని స్పష్టం చే శారు. 52 మంది జోనల్ ఆఫీసర్లు, 83 మంది రూట్ ఆఫీసర్లు, 2647 మంది పిఓలు, 2959 మంది ఇతర పిఓలను నియమించామని, 236 గ్రామపంచాయతీలలో వెబ్ క్యా స్టిం గ్ ఏర్పాటు చేశామని, 89 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించా మ ని ఆమె వెల్లడించారు.

    2647 బ్యాలెట్ బాక్స్ లు ఏర్పాటు చేశామని, 227 కౌంటింగ్ కేంద్రాల ను ఏర్పాటు చేశామని వివరించా రు. మూడో విడత గ్రామపం చా యతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతం గా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అభ్యర్థులతో పా టు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సవ్యంగా నిర్వహించేందుకు 40 మంది జిల్లా అధికారులను సైతం నియమించిన ట్లు వెల్ల డించారు. రెవెన్యూ అదన పు కలె క్ట ర్ జె.శ్రీనివాస్, దేవరకొం డ ఆర్డిఓ రమణారెడ్డి ,జిల్లా మై నా ర్టీ సంక్షేమ అధికారి, కొండపల్లి ప్ర త్యేక అధికారి విజయేందర్ రెడ్డి, డి పిఓ వెంకయ్య, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.