Sunday, September 27, 2026
More
    HomeIndiakarnataka cm dk shivakumar : బాధ్యతలు చేపట్టగానే వరుస హామీలు ప్రకటించిన...

    karnataka cm dk shivakumar : బాధ్యతలు చేపట్టగానే వరుస హామీలు ప్రకటించిన డీకే శివకుమార్

    📰 Generate e-Paper Clip

    karnataka cm dk shivakumar : ప్రజా దీవెన, బెం గుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమా ణ స్వీకారం చేసి న వెంటనే డీకే శివకుమార్ ప్రజల అంచ నాలకు అనుగుణం గా పలు కీలక నిర్ణయాలను ప్రకటించా రు. ముఖ్యంగా వి ద్యార్థులు, యువత, ఉద్యోగార్థులు మరి యు బెంగళూరు నగర అభివృద్ధిపై దృష్టి సారిస్తూ తన ప్రభుత్వ ప్రాధాన్య త లను స్పష్టంగా వెల్లడించారు.

    బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, మౌలిక వసతు ల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. వి ద్యార్థుల ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు రాష్ట్రవ్యా ప్తంగా ఉచిత బస్ పాసులు అందించే నిర్ణయం తీసుకున్న ట్లు ప్రకటించారు. ఈ పథకం వల్ల లక్షలాది మంది విద్యార్థు లకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం భావి స్తోంది.

    ఉద్యోగాల విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టనున్నట్లు డీకే శివకుమార్ వెల్లడించారు. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాదాపు 50 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ అంశాన్ని కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

    యువతకు ప్రైవేట్ రంగంలో మరిన్ని అవకాశాలు కల్పిం చేందుకు ప్రత్యేక ఉపాధి కార్యక్రమాలను తీసుకురాను న్నట్లు ఆయన తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణతో కూడిన ప్రైవేట్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేసి ఉద్యో గ అవకాశాలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.

    రాష్ట్రవ్యాప్తంగా యువతలో నాయకత్వ లక్షణాలను పెం పొందించేందుకు 10 వేల భారత్ జోడో యువక సంఘా ల ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సం ఘానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల ను ప్రోత్సహించనున్నారు.

    బెంగళూరు నగర అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తా మని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నగరంలో ట్రాఫిక్ సమ స్యలు, రోడ్ల దుస్థితిని దృష్టిలో ఉంచుకుని మరమ్మతులు, అభివృద్ధి పనుల కోసం రూ.2000 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అను గుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.

    అక్రమ నిర్మాణాల సమస్యను పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2500 చదరపు అడు గుల లోపు ఉన్న నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్ల డించారు. దీని ద్వారా వేలాది మంది ఆస్తి యజమానులకు ఊరట లభించే అవకాశం ఉంది.

    గతంలో ఉప ముఖ్యమంత్రిగా, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో బ్రాండ్ బెంగళూరు విజ న్‌ను అమలు చేస్తానని డీకే శివకుమార్ తెలిపారు. ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరే కార్యక్రమాలపై దృష్టి సారి స్తూ అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.