Sunday, September 27, 2026
More
    HomeTelanganaNDA Government NH : తెలంగాణ రహదారుల అభివృద్ధికి కేంద్రం భారీ వరం.. రూ.7597 కోట్ల...

    NDA Government NH : తెలంగాణ రహదారుల అభివృద్ధికి కేంద్రం భారీ వరం.. రూ.7597 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం

    📰 Generate e-Paper Clip

     

    NDA Government NH :  ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: తెలం గాణలో రహదారి మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రా ష్ట్రంలోని ప్రధాన జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర క్యా బినెట్ ఆమోదం తెలుపుతూ రూ.7597 కోట్ల భారీ నిధుల ను మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో తెలంగాణలో రవా ణా వ్యవస్థ మరింత ఆధునికంగా మారే అవకాశాలు కనిపి స్తున్నాయి.

    ప్రత్యేకంగా జాతీయ రహదారి 63లో బోధన్ నుంచి చెన్నూ ర్ వరకు, జాతీయ రహదారి 563లో జగిత్యాల నుంచి ఖ మ్మం వరకు ఉన్న కీలక మార్గాలను నాలుగు లైన్లుగా అభి వృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఈ మార్గాల్లో పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చింది.

    ఈ రహదారి విస్తరణ పనులు పూర్తయితే తెలంగాణలోని ఉత్తర, మధ్య, దక్షిణ ప్రాంతాల మధ్య రాకపోకలు వేగవం తం కానున్నాయి. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు స రుకు రవాణా ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గణనీయమైన ప్రయోజనం చేకూరనుంది.

    అంతేకాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాలు జాతీయ రహ దారి నెట్‌వర్క్‌తో మరింత సమర్థవంతంగా అనుసంధానమ వుతాయి. దీనివల్ల కొత్త పరిశ్రమలు, వ్యాపార సంస్థలు పె ట్టుబడులు పెట్టేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతా యని అధికారులు భావిస్తున్నారు.

    తెలంగాణకు సంబంధించిన ఈ ప్రాజెక్టులతో పాటు దేశవ్యాప్తంగా పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విమాన ఇంధన ధరల స్థిరీకరణ కోసం రూ.10 వేల కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించింది.

    అలాగే తూర్పు తీర ప్రాంత అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న రామేశ్వరం, కోణార్క్, పారాదీప్ కోస్టల్ హైవే ప్రాజెక్టుకు రూ. 8301 కోట్ల వ్యయంతో ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు పర్యాటక రంగం మరియు తీర ప్రాంత రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది.

    బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల ఆధునీ కరణ కోసం రూ.8351 కోట్ల నిధులను మంజూరు చేసిన కేం ద్రం, ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల కోసం కూడా ప్ర త్యేక నిధులు కేటాయించింది. పాత బస్సుల స్థానంలో ప ర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రూ.5041 కోట్లను విడుదల చేయాలని నిర్ణయించింది.

    తెలంగాణకు మంజూరైన ఈ భారీ నిధులు రాష్ట్ర అభివృద్ధి కి కొత్త ఊపునివ్వనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల విస్తరణ పూర్త యిన తర్వాత పారిశ్రామిక వృద్ధి, సరుకు రవాణా, ప్రాంతీ య అభివృద్ధి మరింత వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.