Sunday, September 27, 2026
More
    Homeఖమ్మం జిల్లాKhammam Greenfield Highway Accident : బిగ్ బ్రేకింగ్, ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవే పై ఘోర...

    Khammam Greenfield Highway Accident : బిగ్ బ్రేకింగ్, ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవే పై ఘోర విషాదం, కానిస్టేబుల్ దు ర్మరణం

    📰 Generate e-Paper Clip

    Khammam Greenfield Highway Accident : ప్రజా దీవెన, ఖమ్మం: ఆ కుటుం బమంతా అన్నవరం సత్యదేవుని దర్శించుకుని, ఆ స్వామివారి ఆశీ స్సులతో నవ్వుతూ తు ళ్లుతూ తిరుగు ప్రయాణమైంది. మరికొద్ది గంటల్లో తమ సొంతగూడు హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది, కానీ విధి ఆ కుటుంబంపై పగబట్టింది. ఒకే ఒక్క క్షణం ప్రయాణిస్తున్న కా రు అదుపుతప్పింది. అంతలోనే ఆ ఇంట్లోని ఆనందాలు ఆవిరైపోయాయి. గ్రీన్‌ఫీల్డ్ హైవేపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్ర మాదం ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాన్ని బలితీసుకోగా, ఆ యన భార్యాపిల్లలను తీవ్రగాయాలపాలు చేసింది.

    ఈ దుర్ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. శనివారం ఖ మ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీ పంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఈదారుణం జరిగింది. హైదరాబాద్‌ కు చెందిన స్వర్ణకంటి జస్వంత్ (36) అలియాస్ అశోక్, 20 21 బ్యాచ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రస్తుతం ఆయన బొల్లారం పో లీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి అన్నవరం వెళ్లిన జస్వంత్, దర్శనం ము గించుకుని కారులో హైద రాబాద్‌కు తిరుగుప్రయాణమ య్యారు. కారును జస్వంత్ స్వ యంగా నడుపుతున్నారు. కారు రామానుజవరం సమీపానికి రా గానే ఒక్కసారిగా అ దుపుతప్పింది.

    రహదారి ఎడమవైపున రక్షణగా ఉన్న రేకు బారికేడును బ లంగా ఢీ కొట్టింది. ఆ వేగానికి కారు గాల్లోకి లేచి, హైవేపైనే పలుపల్టీలు కొడు తూ ఘోరంగా పడిపోయింది. కారు నడు పుతున్న కానిస్టేబుల్ జ స్వంత్‌కు తీవ్ర గాయాలు కావడం తో ఆయన ప్రమాద స్థలంలోనే కన్నుమూశారు. సమాజాని కి రక్షణగా నిలిచే ఒక యువ పోలీస్ అధికారి ఇలా రోడ్డు ప్ర మాదంలో ప్రా ణాలు కోల్పోవడం స్థానికులను తీవ్రంగా కల చివేసింది.

    ఈ ప్రమాదం జస్వంత్ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీ సిం ది. ప్ర మాద తీవ్రతకు ఆయన భార్య జ్యోతి, కిరణ్, మౌనిక కాలు విరి గింది. ఆరేళ్ల కుమార్తె మాన్య కాలుకు కూడా బల మైన గాయాల య్యాయి. అయితే నాలుగేళ్ల కుమారుడు కళ్యాణ్ రామ్ మాత్రం ఎ లాంటి గాయాలు లేకుండా సురక్షి తంగా బయటపడడం ఆ దేవుడి మహిమేనని చెప్పాలి.

    కళ్ల ముందే తండ్రి ప్రాణాలు కోల్పోవడం, తల్లిగాయాలతో విల విలలాడడం చూసి ఆ చిన్నారులు నిర్ఘాంతపోయారు. ఇదిలా ఉండగా సమాచారం అందుకున్న వెంటనే తల్లాడ పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని స హాయక చర్యలు చేపట్టారు. జ స్వంత్ మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆ సుపత్రి మార్చురీకి తరలించారు.

    గాయపడిన భార్య, పిల్లలను తక్ష ణ చికిత్స కోసం ఆసు పత్రికి తర లించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్ర మాదానికి గల ఖచ్చితమైన కార ణాలపై దర్యాప్తు జరుపుతున్నా రు. మితిమీరిన వేగమా లేక డ్రై వర్ నిద్రమత్తా అనే కోణంలో వి చారణ సాగుతోంది. ఈ ప్రమాదం తో జస్వంత్ సొంత ఊరిలోనూ, బొల్లారం పోలీస్ శాఖలోనూ తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.