Tuesday, September 29, 2026
More
    HomeOpinionSupreme Court sensational POCSO Verdict : బిగ్ బ్రేకింగ్, దేశంలో పోక్సోఅస్త్రంపై సుప్రీంకోర్టు సంచలన...

    Supreme Court sensational POCSO Verdict : బిగ్ బ్రేకింగ్, దేశంలో పోక్సోఅస్త్రంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, సతీమణులoదరికీ స్ట్రాంగ్ వార్నింగ్

    📰 Generate e-Paper Clip

    Supreme Court sensational POCSO Verdict : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: వైవాహిక, వ్యాపార వివాదాల్లో ప్రత్యర్థు లను అణచివే యడానికి క్రిమినల్ చట్టా లను ‘వేధింపుల ఆయుధం’గా మార్చుకోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థా నం (Supre me Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పగ తీ ర్చుకోవడా నికో లేదా బ్లాక్‌మెయిల్ చేసి లొంగదీసుకోవ డానికో చట్టాల ను దుర్వినియోగం చేసే ప్రమాదకర ధోరణి పెరిగిపోతోందని ఆందోళ న వ్యక్తం చేస్తూ జస్టిస్‌ బీవీ నాగ రత్న, జస్టిస్‌ ఉజ్వ ల్ భూయాన్‌ల తో కూడిన ధర్మాసనం 50 పేజీల మైలురా యి లాంటి సంచలన తీర్పును వెలువ రించింది.

    కుటుంబ, వ్యాపార తగాదాల నేపథ్యంలో వచ్చే నిరాధార మైన ఆరోపణలపై కింది కోర్టులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తొలి ద శ లోనే తిరస్కరించండని, నిజమైన లైం గిక వేధింపుల కేసులను ప్రాధా న్యతతో విచారించాల్సిందే కానీ, ప్రాథమిక ఆధారాలు లేని, పాత పగలతో కల్పించిన ఆరోపణలను ప్రారంభ దశలోనే కొట్టేయాలని కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడిం చింది. భార్యాభర్తల పోరాటాల్లో అవతలి పక్షాన్ని లొంగదీసుకునేం దుకు రేప్ (అత్యాచారం) నిబంధ నలను ఆశ్రయిస్తున్నారు, వీటిపై జాగ్రత్తగా ఉండాలని సూ చించింది.

    ‘పోక్సో’చట్టం కొత్త బ్లాక్‌మెయిలింగ్ సాధనమా ?

    ఈ మధ్యకాలంలో వైవాహిక కల హాల్లో మైనర్ కుమార్తెలను అడ్డం పెట్టుకుని, తండ్రులపై తప్పుడు పోక్సో (POCSO) కే సులు బనా యించే ధోరణిపై సుప్రీంకోర్టు ప్రత్యేకంగా స్పం దించిoది. కుటుంబ స భ్యులు, పొరుగు వారు లేదా వ్యా పా ర భాగస్వాముల మధ్య శత్రుత్వం ఉన్నప్పుడునిందితులు తమ డిమాండ్లకు లొంగిపోయేలా చేయడానికి, సివిల్ వివా దాలను పరిష్క రించు కోవడానికి పిల్లల తల్లిదండ్రులు పో క్సో చట్టాన్ని ఒక బ్లాక్‌ మె యిలింగ్ సాధనంగా వాడుకుంటు న్నారు.” అని కోర్టు ఈ తీవ్ర వ్యా ఖ్యలు చేసింది. ఇలాంటి క ల్పిత ఫిర్యాదులను న్యాయవాదులు కూడా ప్రోత్సహించ కూడదని హితవు పలికింది.

      వివాహబంధం ఎంతో పవిత్రమైoది

    మన సమాజంలో వివాహ వ్యవస్థ ను అత్యంత పవిత్రమై నదిగా, రెం డు ఆత్మల ఉత్కృష్టమైన బంధం గా భావిస్తారని కోర్టు గుర్తుచేసింది. సమాజానికి మూలస్తంభం లాంటి కు టుంబ వ్యవస్థను ఇటువంటి ద్వేషపూరితమైన కల్పిత వ్యా జ్యాలు దెబ్బతీయకుండా నిరోధించా ల్సిన అవసరం ఉంద ని నొక్కి చెప్పింది.

    ఈ సంచలన తీర్పునకు కారణమైన మీర ట్‌కు చెందిన ఒక కు టుంబ ఉదంతం ఇలా ఉంది. ఇషర్ చంద్ శర్మ దంపతు లకు 2008 లో వివాహమై, ఒక కుమార్తె, కుమారుడు జన్మిం చారు. మనస్పర్థల వల్ల భార్య 2011 లో నే ఇల్లు వదిలి వెళ్ల గా, పిల్లలు తండ్రి వద్దే పెరి గారు. 2011 నుండి 2024 వర కు వీరి మధ్య FIRలు, విడాకుల కేసులు నడుస్తూనే ఉన్నా యి.

    ఈ క్రమంలో అయితే 2024 సెప్టెంబర్‌లో భార్య మీరట్ పో క్సో కోర్టును ఆశ్రయించింది. భర్త తన 14 ఏళ్ల కుమార్తెను అ శ్లీల వీడియోలు చూడమని బలవంతం చేసి లైంగిక దాడికి పా ల్పడ్డాడ ని, మరిది కూడా అత్యా చారం చేశాడని, అత్తా ఆడపడు చులు సుత్తితో కొట్టారని తీవ్ర ఆరోపణలు చేసింది అప్పట్లో ఆ భార్య. అలహాబాద్ హైకోర్టు కేసు రద్దుకు ని రాక రించడంతో బాధితులు సు ప్రీంకోర్టును ఆశ్రయించారు.

    కేసు ను పరిశీలించిన సుప్రీంకోర్టుకు ఈ క్రిం ది అంశాలు తీవ్ర సం దేహాలను రేకె త్తించాయి. కాగా కుమార్తె మే నె ల లోనే తల్లి వద్దకు వస్తే ఫిర్యాదు మాత్రం సెప్టెంబర్ వరకు ఎందుకు ఆపారు, బాధితుల వాంగ్మూలాలు ‘యథాతథంగా ఒకేలా’ ఉండటం చూస్తే ఎవరో తర్ఫీదు (ట్రైనింగ్) ఇ చ్చి చెప్పించి నట్లు స్పష్టమవుతోంది.

    ఇక అత్యాచార ఆరోపణలకు గానీ, గాయపరిచారనే వాద న లకు గానీ ఎలాంటి వైద్య పరీక్షల నివేది కలు లేకపోవడం ప్రాసిక్యూషన్ కథ నాన్నే తుడిచిపె ట్టేసింది. దీంతో ఈ కల్పి త కేసును అత్యున్నత న్యా యస్థా నం పూర్తిగా కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ నే పధ్యంలో దేశ అత్యున్న త న్యాయ స్థానం వెలువరించిన తాజా తీర్పు భర్తల పాలిట అదృష్టంగా పరిశీలకులు భావిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.