Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కరు డుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ ఆట క ట్టించారు నల్లగొండ పోలీసులు. న ల్లగొండ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజు ల క్రితం జరిగిన మూడు వేర్వేరు కే సులలో నిధితుడైన అంతరాష్ట్ర దొంగను సిసిఎస్ టీమ్, వన్ టౌన్ సిబ్బంది కలిసి అంతరాష్ట్ర దొంగ పట్టుకొని అరెస్టు చేయడంతో పా టు రిమాండ్ కు తరలించినట్లు మంగళవారం నల్లగొండలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి శివరాంరెడ్డి వివరాలు వెల్ల డించారు.
నిందితుని వద్ద నుంచి సుమారు రూ. 12లక్షల విలువ గల 6 తు లాల బంగారం, 35 తులాల వెండి, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.
నేర రహిత సమాజ ఏర్పాటు లో సీసీటీవీ కెమెరా కీలకం అని మరో సారి నిరూపణ అయ్యింది.
నల్గొండ జిల్లాను నేర రహిత జిల్లా గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేను సై తం, కమ్యూనిటీ సీసీటీవీ కార్య క్ర మాల ద్వారా ప్రతి గ్రామంలో, వార్డ్ లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చే సుకోవాలని ప్రజలకు అవగాహన క ల్పించడం జరిగిందన్నారు. ము ఖ్యంగా దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిం చాలని కోరారు.
గత నెల 25వ తేదీన శాంతి నగర్ లో నివాసం ఉండే జెర్రిపోతుల రవి, వయసు 35, వృత్తి. పంచాయతీ సె క్రటరీ, రాత్రి. 7 గంటలకు ఇంటికి తాళం వేసి, ఊరికి వెళ్లి తిరిగి ఉద యం వచ్చేసరికి తాళం పగలగొట్టి, బీరువా ఓపెన్ చేసి దానిలో ఉన్న బంగారు,వెండి ఆభరణాలు కొంత నగదు దోచుకెళ్లారని పిర్యాదు ఇవ్వ డంతో వన్ టౌన్ పీఎస్ ఇన్స్పెక్టర్ రాజ శేఖర్ రెడ్డి కేసు నమోదు చేసు కొని విచారణ ప్రారంభించారు.
ఈ క్రమంలో పిర్యాదిదారుడి ఇంటి పక్కన స్థానికుడు ఏర్పాటు చేసుకు న్న సీసీటీవీ కెమెరాను పరిశీలించ గా, గతంలో పలు దొంగతనాలు చే సిన కరుడు గట్టిన అంతరాష్ట్ర దొం గ,పాత నేరస్తుడు అయిన రుద్రాక్షి శ్రీను అని తెలిసింది. వెంటనే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలు ఇస్తూ సిసిఎస్ బృందాన్ని, వన్ టౌ న్ సిబ్బందిని సమాయత్తం చేశార న్నారు. కాగా ఉదయం మునుగోడు రోడ్ లో వెహికల్ చెకింగ్ చేస్తుండ గా, అనుమానాస్పదంగా బైక్ పై పా రిపోతున్న ఒక వ్యక్తిని సిసిఎస్ బృం దం, వన్ టౌన్ పోలీసులు పట్టుకొ ని విచారించగా తాను గతంలో తె లంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 40 వరకు దొంగతనాలు చేసి ఇటీ వల తిరుపతి జైలుకు వెళ్లి, తన ప్ర వృత్తి మార్చుకోకుండా తిరిగి ప ది హేను రోజుల క్రితం బయటకు వ చ్చాడని చెప్పారు. నల్గొండ పట్ట ణంలోని శాంతి నగర్ లోని ఒక ఇం టి లో దొంగతనం, పక్కనే ఇంటి ముందు పార్క్ చేసిన ఒక బైక్ దొం గతనం మరియు దేవరకొండ రోడ్ లోనీ కనక దుర్గా కాలనీలో మరొక ఇంట్లో దొంగతనం చేసిన నేరాలు (3) ఒప్పుకొని, దొంగిలించిన సొత్తు, బైక్ ను చూపించగా వాటిని స్వాధీ నం చేసుకుని నేరస్తుడు అయిన రు ద్రాక్షి శ్రీనును జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం రిమాండ్ కి తరలించామ న్నారు.
సదరు కేసులో సీసీ కెమెరాల ఆధా రంగా ఫింగర్ ప్రింట్స్ సేకరణ ఆధా రంగా కేవలం వారం రోజుల్లోనే కరు డుగట్టిన అంతరాష్ట్ర దొంగను పట్టు బడి చేసి చాకచక్యంగా కేసులలో ప్రతిభ కనబరిచిన నల్గొండ డిఎస్పి కె శివరాం రెడ్డిని సిసిఎస్ ఇన్స్పెక్ట ర్లు జితేందర్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, ఎస్సై విజయ్ హెడ్ కానిస్టేబుల్ వి ష్ణు, వన్టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎ స్ఐలు సైదులు, గోపాలరావు, వెం కట నారాయణ, షకీల్, రబ్బాని, ఫింగర్ ప్రింట్స్ ఎస్ఐ శివ, సిసిఎస్ సిబ్బంది సాయి, మహేష్, వహీద్, దస్తగిరి జునైద్ తదితరులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినం దించారు.

