Sunday, September 27, 2026
More
    HomePoliticsCollector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక ప్రకటన, సెట్విన్ శిక్షణ...

    Collector Ila Tripathi : నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కీలక ప్రకటన, సెట్విన్ శిక్షణ కోర్సుల్లో వి ద్యార్ధులకు ఫీజు సాయం చేస్తాం

    📰 Generate e-Paper Clip

    Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: విద్యార్థు లకు అకాడమిక్ విద్యతో పాటు, ఒ కేషనల్ కోర్సులు, సృజనాత్మకత అ వసరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి అన్నారు. జిల్లాలోని అన్ని జూని యర్ కళాశాలలు ,9 ,10 తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒకే ష నల్ కోర్సులలో శిక్షణ ఇవ్వ డంలో భాగంగా ముందుగా వాటిపై అవగా హన కల్పించి అనంతరం సె ట్విన్ ఆధ్వర్యంలో స్వల్పకాలిక వృ త్తుల పై శిక్షణ కార్యక్రమాలను నిర్వ హిం చనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మంగళవారం ఆమె నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని రాంనగర్ లో ఉ న్న అల్పసంఖ్యాక వర్గాల సం క్షే మ రెసిడెన్షియల్ పాఠశాల,కళా శా లలో ఒకేషనల్ ట్రైనింగ్ పై వి ద్యా ర్థినిలకు ఏర్పాటు చేసిన అవ గా హన కార్యక్రమాన్ని ప్రారంభించా రు.

    మారుతున్న సాంకేతికతను దృష్టి లో ఉంచుకొని విద్యార్థులను చ దు వుతోపాటు, ఒకేషనల్ కోర్సులలో అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని, అంతేకాక వారికి క్రియేటివి టీ కలిగించాల్సిన అవసరం ఉంద ని అన్నారు .ఇంజనీరింగ్, మెడిసిన్ లలో సైతం కొత్త టెక్నాలజీ అభివృ ద్ధి కావడం వల్ల అనేక మార్పులు చే సుకుంటున్నాయని ,భవిష్యత్తులో పోటీ పరీక్షలు ఎదుర్కొనేందుకు ఇ వి విద్యార్థులకు బాగా ఉపయోగ ప డతాయని, అందువల్ల వీటిని దృష్టి లో ఉంచుకొని జిల్లాలోని అన్ని రెసి డెన్షియల్ , కేజీబీవీ కళాశాలలు, పా ఠశాలల్లో చదివే ఇంటర్, 9, 10 త రగతుల విద్యార్థులకు బ్యాచులవా రిగా సెట్విన్ ద్వారా ఓకేషనల్ శిక్ష ణ పై వారి విద్యాసంస్థల్లోనే శిక్షణ ఇస్తామని తెలిపారు.

    సెట్విన్ ద్వారా ఇచ్చే కోర్సులలో వె బ్ ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిఫి కే షన్, ఎడ్యుకేషనల్, టెక్నికల్ కో ర్సు లు ఎన్నో ఉన్నాయని తమ అభ్య ర్థన మేరకు సెట్విన్ మొత్తం ఫీజు లో సగం ఫీజు రాయితీగా ఇవ్వ నుందని, తక్కిన 50 శాతం ఫీజును కూడా కట్టలేని నిరుపేద విద్యార్థుల కు జిల్లా యంత్రంగా తరఫున ఫీజు చెల్లిస్తామని తెలిపారు.

    సెట్విన్ ద్వారా వారంలో నాలుగు రోజులు ఓకేషనల్ కోర్సులపై శిక్షణ నిర్వహిస్తామని, కేవలం రెండు నెల ల నుండి ఆరు నెలల వరకు మాత్ర మే శిక్షణ కార్యక్రమాలు ఉంటాయ ని, పాఠశాల పూర్తయిన తర్వాత ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించ డం జరుగుతుందని, అందువల్ల ప్ర తి విద్యార్థి ఏదో ఒక వృత్తి విద్యలో శిక్షణ పొందాలని కోరారు. విద్యా ర్థులు వారికి ఇష్టం ఉన్న కోర్సులను ఎంపిక చేసుకుని శిక్షణ పొందవచ్చ ని అన్నారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ సెట్విన్ ద్వా రా నిర్వహించే కోర్సులు, క్యారియ ర్ గైడెన్స్ పై అవగాహన కల్పించా రు. విద్యార్థులు జీవితంలో మంచి స్థా నాన్ని పొందేందుకు పెద్ద లక్ష్యా న్ని నిర్దేశించుకుని ఆలక్ష్య సాధన కు కృషి చేయాలని, బాగా చదువు కోవాలని చెప్పారు. ఇటీవల కాలం లో మహిళలు అన్ని రంగాలలో రా ణిస్తున్నారని, ఇటీవల దేశ మహి ళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ సాధిం చడాన్ని ఆమె గుర్తు చేయడమే కా కుండా, నిఖత్ జరీనా లాగ విద్యా ర్థినిలు అనుకున్న లక్ష్యాన్ని సాధిం చేందుకు కృషి చేయాలన్నారు. ఏది సాధించాలన్న మానసికంగా దృఢం గా ఉండాల్సిన అవసరం ఉందన్నా రు.

    చిన్నచిన్న వృత్తులు, ఉద్యోగం ద్వా రానే భవిష్యత్తులో సమాజంలో ఉ న్నత పదవులు, ఉన్నత స్థానాలు సాధించవచ్చని తెలిపారు. ఈ సం వత్సరం వార్షిక పరీక్షలలో మొదటి రెండు స్థానాలలో నిలిచే ఇంటర్మీడి యట్ తొమ్మిది పది తరగతుల వి ద్యార్థులకు దేశంలో వారు కోరుకు న్న చోటుకు విమాన ప్రయాణంతో పాటు రెండు రోజులు ఉచిత భో జనం వసతి సౌకర్యం కల్పిస్తామని అలాగే బాగా చదువు చెప్పిన టీ చర్లకు కూడా ఈ సౌకర్యం కల్పిస్తా మని అందువల్ల బాగా చదవాలని కలెక్టర్ కోరారు.

    ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, గృ హ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమా ర్ ,జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, జిల్లా పశు సంవ ర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్, డీ ఈఓ బిక్షపతి, తదితరులు మాట్లా డారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి దశ్రు నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రు నా యక్, సెట్విన్ ప్రతినిధి రేణుక, ప్రి న్సిపల్ కుబ్రా , జిల్లా సంక్షేమ అధికా రి కృష్ణవేణి తదితరులు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.