Tuesday, September 29, 2026
More
    HomePoliticsCM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అప్పీల్, తెలంగా ణ విద్యార్థులకు జర్మనీ...

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి అప్పీల్, తెలంగా ణ విద్యార్థులకు జర్మనీ భాషను నే ర్చుకునేoదుకు జర్మనీ టీచర్లను ని యమించాలి 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్‌ను ఇన్నొవేషన్ హబ్‌గా తీర్చి దిద్దడంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి జర్మనీకి చెందిన ప్రతిని ధి బృందాన్ని కోరారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుం టోందని, ప్రధానంగా ఐ టీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మనీ కంపె నీల పెట్టుబడులు పెట్టాలని కోరా రు. జర్మనీ కాన్సులేట్ జనరల్ (చె న్నై) కాన్సుల్ జనరల్ మైఖేల్ హా స్పర్ నేతృత్వంలోని ప్రతినిధి బృం దం ముఖ్యమంత్రితో భేటీ అ య్యిం ది. జర్మనీకి చెందిన ప్రముఖ బహు ళజాతి సంస్థ డుయిష్ బోర్సా (De utsche Börse) విస్తరణలో భాగం గా మంగళవారం హైదరాబా ద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ము ఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి వివరాలను అందించారు.

    తాజాగా డుయిష్ బోర్సా కంపెనీ ఏ ర్పాటు చేస్తున్న GCC ద్వారా వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశా లు కలగనున్నట్లు జర్మనీ బృందం వివరించింది. జీసీసీ ఏర్పాటుకు హై దరాబాద్‌ను ఎంచుకున్నందుకు ఈ సందర్భంగా జర్మనీ ప్రతినిధి బృం దానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

    హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడు లు పెట్టాలని, ఇందుకు ప్రజా ప్రభు త్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్ని రకాల సహాయ సహకారాలు అంది స్తుందని చెప్పారు. తెలంగాణ వి ద్యార్థులకు జర్మనీ భాషను నేర్చు కునే విషయంలో హైదరాబాద్‌లో జర్మనీ టీచర్లను నియమించి సహ కరించాలని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM) ద్వారా విదే శాల్లో ఉపాధి అవకాశాలు కల్పిం చడం, ఒకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ వర్క్ విషయంలో శిక్షణ అందిం చ డం వంటి అంశాల్లో సహకరిం చా లని అన్నారు.

    ఈ భేటీలో డుయిష్ బోర్సా చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ క్రిస్టోఫ్ బోమ్, జర్మనీ గౌరవ కాన్సూల్ (ఏపీ, తెలం గాణ), హైదరాబాద్ లిటరెరీ ఫెస్టివ ల్ డైరెక్టర్ అమిత ఆర్ దేశాయ్, సీ ఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.