Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: పత్తి రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యజమానులు స మ్మెకు వెళ్లకుండా పత్తి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి కోరారు. పత్తి కొనుగోలులో సిసి ఐ తీసుకువచ్చిన ఎల్ 1,2 నిబం ధనలు, తేమశాతం, తదితర సమ స్యలతో తాము పత్తిని కొనుగోలు చేయలేమని పేర్కొంటూ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల యజమానులు ఈ నెల 6 నుండి సమ్మె దిశగా వె ళ్లేందుకు జిల్లా కలెక్టర్ కు ఇదివరకే నోటీసు అందజేసిన విషయం తెలి సిందే. ఈ విషయంపై మంగళవారం జిల్లా కలెక్టర్ మార్కెటింగ్, సిసిఐ అ ధికారులతో పాటు, జిన్నింగ్ మిల్లు ల యాజమానులతో తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు.
పత్తి కొనుగోలులో జిన్నింగ్ మిల్లు ల కు ఉన్న సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎల్ 1,2,ఎల్ 3 నిబంధన లేకుండా చూడాలని, తే మశాతంలో సడలింపు ఇవ్వాలని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యం జి ల్లా కలెక్టర్ కు వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లా డు తూ పత్తి కొనుగోలు పూర్తిగా సిసిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున ని బంధనల సడలింపులు తన పరిధి లో లేదని తెలిపారు.అయితే మూ డు, నాలుగు రోజుల్లో ఎల్ 1,ఎల్ 2 తో పాటు, జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లులు ప్రారంభమవుతాయని, అప్పటివరకు సమ్మెకు వెళ్లకుండా పత్తి రైతుల పరిస్థితిని దృష్టిలో ఉం చుకొని పత్తిని కొనుగోలు చేయాల ని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆమె సి సి ఐ సీఎం డి తో ఫోన్ ద్వారా మాట్లాడారు.
జిన్నింగ్ మిల్లుల యజమానుల స మస్యలన్నింటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని, సమ్మెకు వెళ్లకుండా పత్తిని కొనుగోలు చేయా లని జిల్లా కలెక్టర్ చేసిన విజ్ఞప్తికి జి న్నింగ్ మిల్లుల యజమానులు అం గీకరించారు. పత్తి రైతులు సరైన తే మ శాతంతో జిన్నింగ్ మిల్లులకు ప త్తిని తీసుకువచ్చేలా వ్యవసాయ వి స్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో ప రిశీలించి మిల్లులకు పంపించే విధం గా చూడాలని ఆమె జిల్లా వ్యవసా య అధికారి శ్రవణ్ ను ఆదేశించా రు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్, అడిషనల్ ఎస్పీ రమేష్, జి ల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, మార్కెటింగ్ ఏడి చాయాదేవి, సిసి ఐ అధికారి నింజే, జిన్నింగ్ మిల్లుల అధ్యక్ష కార్యదర్శులు కృష్ణారెడ్డి, శ్రీ ధర్ రెడ్డి , జిన్నింగ్ మిల్లుల యజ మానులు తదితరులు ఈ సమావే శానికి హాజరయ్యారు.

