–రౌడీషీటర్లు, బ్లాక్ మెయిలర్లకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చ రిక
Nalgonda police Spark attacks on druggists : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్:నల్లగొండలో అసాంఘిక శక్తులు, మత్తు పదార్థాల వినియోగదారులపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే ల క్ష్యంగా వన్‌టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్స్టేషన్ల పరిధిలో పో లీ సులు ప్రత్యేకంగా మెరుపు తనిఖీలు నిర్వహించారు. ఈ త నిఖీల్లో మొత్తం 59 మందిని అదుపులోకి తీసుకోగా, డ్రగ్ పరీ క్షల్లో 15 మంది గంజాయి లేదా మత్తు టాబ్లెట్లు వినియోగిం చి నట్లు ప్రాథమి కంగా నిర్ధారణ అయినట్లు పోలీసులు వెల్లడిం చారు.
మత్తు పదార్థాల సరఫరాపై ప్రత్యేక నిఘా
నగరంలో గంజాయి, మత్తు టా బ్లెట్లు ఎక్కడి నుంచి వస్తున్నా యి? వాటిని సరఫరా చేస్తున్నది ఎవరు? అనే కోణాల్లో పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. మత్తు పదార్థాల విక్రయాలు, విని యోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చే సి, సరఫరాదారుల మూ లాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని గుర్తించి, అవసరమైన వారికి కౌన్సె లింగ్ ఇవ్వడంతో పాటు పునరావాస కేంద్రాలకు పంపించే చ ర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్ చేస్తే కఠినచర్యలు
రౌడీషీటర్లు, ట్రబుల్ మంగర్స్, అ సాంఘిక శక్తులు, బ్లాక్‌మెయి లర్ల కదలికలపై నిరంతరం నిఘా కొన సాగుతుందని జిల్లా ఎ స్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేశారు. బెదిరింపులు, అక్రమ సెటిల్మెం ట్లు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ ప్రజలను ఇ బ్బందులకు గురిచేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉ పేక్షించబోమని హెచ్చరించారు. ప్రవర్తన మార్చుకోకుంటే చట్ట ప్రకారం కఠిన చ ర్యలు తప్పవని స్పష్టం చేశారు.
సమాచారం ఇవ్వండి..పోలీసులకు సహకరించండి
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పంది స్తారని ఎస్పీ తెలిపారు. మత్తు పదార్థాల విక్రయాలు, వినియో గం, బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్ వంటి అసాంఘిక కార్యక లాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియ జేయాలని కోరారు. పోలీసుల అత్యవసర సహాయం 112, గంజాయి, మత్తు పదార్థా ల నిరోధక టోల్‌ఫ్రీ నంబర్ 871 2670266 తో ప్రజలు నిర్భ యంగా జీవించే వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా నల్లగొండ జిల్లా పోలీసులు ప్రత్యేక తనిఖీ లు, నిఘా చర్యలను కొనసాగిం చనున్నట్లు తెలిపా రు.ఈ తనిఖీల్లో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు ముత్తయ్య, సైదులు, టూటౌన్ ఎస్ఐ సైదాబాబు, రూ రల్ ఎస్ఐ శివప్రసాద్‌తో పాటు పోలీసు సి బ్బంది పాల్గొన్నారు.
Nalgonda police Spark attacks on druggists


