Wednesday, October 28, 2026
More
    HomeOpinionSpark ACB Raids in Telangana : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో ఏసీబీ వరుస దాడులు,...

    Spark ACB Raids in Telangana : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో ఏసీబీ వరుస దాడులు, మూడుకేసుల్లో పలువురు అధికారులు పట్టివేత

    📰 Generate e-Paper Clip

    –బంజారాహిల్స్ ఎస్‌ఐ నుంచి మీర్‌చౌక్ ఇన్‌స్పెక్టర్ వరకు లంచం ఆరోపణలతో కలకలం

    Spark ACB Raids in Telangana : ప్రజా దీవెన, హై దరా బాద్: తెలం గాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస చర్యలు కలక లం రేపుతున్నాయి.హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ స బ్‌ఇన్‌స్పెక్టర్, మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌తో పాటు హోంగార్డు, యాదాద్రి భువనగిరి జిల్లా లీ గల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్, ఓ ప్రై వేట్ వ్యక్తి లంచం ఆరోపణల తో ఏసీబీ వల లో చిక్కారు. మూడు వేర్వేరు కేసుల్లో లంచం డిమాండ్, స్వీక రణకు సంబంధించిన ఆరోపణలపై అధికారు లు చర్యలు చేపట్టారు.

    బంజారాహిల్స్ ఎస్‌ఐపై రూ.10 లక్షల లంచం ఆరోపణ

    హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సబ్‌ఇన్‌స్పె క్ట ర్‌ గా పనిచేస్తున్న కొట్టూరు విజయ్‌ పై అవినీతి కేసు నమో దైంది. క్రై మ్ నంబర్లు 524/2024, 525/ 2024కు సంబంధిం చిన వ్యవహా రంలో ఫిర్యాదుదారుడిని అరెస్టు చేయకుండా ఉండటం, సీఆర్‌పీ సీ సెక్షన్ 41-A కింద నోటీసులు జారీ చేసి సమాధానాలను స్వీక రించడం, భవిష్యత్తులో ఈ వ్య వహారా నికి సంబంధించి కొత్త కే సులు నమోదు కాకుండా చూ సేందు కు తొలుత రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్ల డిం చింది.చర్చల అనంతరం రూ. లక్ష తీ సుకునేందుకు అంగీకరిం చినట్లు ఆరోపణలు నమోద య్యాయి. ఈ వ్యవహారంలో అ ధికార దుర్వి నియోగానికి పా ల్పడినట్లు కేసు నమోదు చేసి, నిందితుడిని నాం పల్లిలోని ఎస్‌ పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యా యస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రి మాండ్‌ కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

    మీర్‌చౌక్‌లో రూ.3 లక్షలు స్వీక రిస్తుండగా పట్టివేత

    హైదరాబాద్‌లోని మీర్‌చౌక్ పో లీ స్ స్టేషన్‌లో మరో అవినీతి వ్యవ హారం వెలుగులోకి వచ్చింది. ఇన్‌ స్పెక్టర్ ఎం. కొండల్ రావు, హోం గార్డు అబిద్ అలీ ఏసీబీకి చిక్కా రు.ఫిర్యాదుదా రుడి తండ్రిపై నమోదైన కేసును మూసివేయ డం, కఠిన చర్య లు తీసుకోకుం డా ఉండటం, భవిష్యత్తులో సహకరించడం కో సం ఇన్‌స్పెక్టర్ రూ.6 లక్షలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలి పింది. ఇందులో భా గంగా హోంగార్డు ద్వారా రూ.3 లక్షలు స్వీ కరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.3 లక్ష ల నగదును స్వాధీనం చేసుకు న్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ న్యా య స్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించే ప్రక్రియ చేపట్టారు. ఈ కేసులోనూ దర్యాప్తు కొనసా గుతోంది.

    పెట్రోల్ బంక్ సర్టిఫికెట్ కోసం రూ.20 వేల లంచం

    యాదాద్రి భువనగిరి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ కె. వెం కటేశ్వర్లు, పెట్రోల్ పంప్ టెక్నీషియన్ కాసారం రవీందర్ నల్ల గొండ రేం జ్ ఏసీబీ అధికారులకు చిక్కారు.పెట్రోల్ బంక్‌కు సం బంధించిన వె రిఫికేషన్ సర్టిఫికెట్ జారీ చేయడం, డైలీ సేల్స్ రిజిస్టర్ అంద జేయడం కోసం ఫిర్యాదుదారుడి నుంచి రూ.2 0,000 లంచం డి మాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఇన్‌ స్పెక్టర్ సూచన మేర కు హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ వద్ద ప్రై వేట్ వ్యక్తి రవీందర్ లం చం సొమ్మును స్వీకరించినట్లు తెలి పింది.ఈ మొత్తంలో రూ. 15,000 ఇన్‌స్పెక్టర్‌కు, రూ.5,0 00 ప్రైవేట్ వ్యక్తికి చెందాల్సి ఉ న్నట్లు ఏసీబీ పేర్కొంది. నిందితు డి నుంచి రూ.20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి నీ నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుప రిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు త రలించే ప్రక్రియ చేపట్టారు.

    లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి

    ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరై నా ఉద్యోగి లంచం డిమాండ్ చే స్తే ప్రజలు భయపడకుండా ఏ సీబీకి సమాచారం అందించా లని అధికారులు సూచిస్తున్నారు.టోల్‌ఫ్రీ నంబర్ 1064, వా ట్సాప్ 9440446106, ఫేస్‌బుక్ Telan gana ACB, ఎక్స్ (ట్విట్టర్) @ Telangana ACB లతో పాటు ప్రభుత్వ కార్యా లయాలు, ప్రము ఖ బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఏసీ బీ క్యూఆర్ కోడ్ ద్వా రా కూడా ఫిర్యాదు చేయవచ్చని అధికా రులు తెలిపారు. ఫిర్యా దుదారుల వివరాలను గోప్యంగా ఉం చుతామని పేర్కొన్నారు.

    Spark ACB Raids in Telangana

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.