Stirover illegal rationrice racket in hyderabad : ప్రజా దీవెన,హైదరాబాద్: హైద రాబాద్‌లో రేషన్ బియ్యం అక్రమ వి క్రయాల వ్యవహారం కలకలం రే పుతోంది. పేదలకు పంపిణీ చే యాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమ వ్యాపారులు సేక రించి, పాలిష్ చేసి, కార్పొరేట్ బ్రాండ్ల పేర్లతో బయట మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చా యి. ఈ వ్య వహారంపై పౌరసరఫరాల శాఖ అధికారులు అప్ర మత్తమ య్యారు.
కర్మన్‌ఘాట్‌లో అధికారుల మెరుపు దాడులు
రేషన్ బియ్యం అక్రమ దందాపై చర్యలకు దిగిన సివిల్ సప్ల య్స్, విజిలెన్స్ అధికారులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా కర్మన్‌ఘాట్ పరి ధిలోని రైస్ డిపోలపై దాడులు నిర్వహి స్తూ బియ్యం నిల్వలు, విక్రయాల తీరును పరిశీలిస్తున్నారు.

పాలిష్ చేసి.. బ్రాండెడ్ బియ్యంగా మార్కెట్లోకి
రేషన్ బియ్యాన్ని సేకరించి, మిల్లుల్లో పాలిష్ చేయించి, సన్న బి య్యంగా మార్చి, ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లతో మార్కెట్లో విక్ర యిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్ర యిస్తున్నట్లు సమాచారం.

అక్రమ దందా వెనుక ఎవరున్నారు
పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్క దారిపడుతున్న తీరుపై అధికారుల తనిఖీలు ప్రాధాన్యం సం తరించుకున్నాయి. ఈ అక్రమ వ్యాపారంలో ఎవరెవరి పాత్ర ఉంది? ఎంత మొత్తంలో బియ్యం పక్కదారి పట్టింది? బ్రాండెడ్ ప్యాకింగ్ వెనుక ఉన్న సంస్థలు ఎవరు? అనే అంశాలపై ద ర్యాప్తుతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అధికారుల తని ఖీల్లో వెలుగుచూసే వివరాలు, స్వాధీనం చేసుకున్న బియ్యం ని ల్వ లు, బాధ్యులపై తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
