Saturday, October 31, 2026
More
    HomeతెలంగాణMlc Teenmaar Mallanna Allegations on BC Funds : తీన్మార్ మల్లన్న సంచలన ఆరో...

    Mlc Teenmaar Mallanna Allegations on BC Funds : తీన్మార్ మల్లన్న సంచలన ఆరో పణలు, కోటి ఎకరాల భూములు 995 మంది దొరలచేతుల్లోనే,58 వేల కోట్ల బీసీనిధులేవి

    📰 Generate e-Paper Clip

    –2028లో తెలంగాణలో బీసీ రాజ్యం స్థాపనే లక్ష్యం

    — భూముల పంపిణీ, రిజర్వేషన్లు, బీసీ నిధులపై తీవ్ర వ్యాఖ్య లు

    Mlc Teenmaar Mallanna Allegations on BC Funds: ప్రజా దీవెన, నాగార్జున సాగర్:తెలంగాణలో బీసీల రాజ్యాధికా రమే లక్ష్యంగా గోల్కొండ కోట నుంచి ప్రారంభమైన బీసీ రాజ్యా ధికార యాత్ర రాజకీయంగా చ ర్చనీయాంశంగా మారుతోంది. తె లంగాణ రాజ్యాధికార పార్టీ (టీ ఆర్పీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీ న్మార్ మల్లన్న ఈ యాత్రలో భాగంగా రాష్ట్రంలోని భూ వివా దాలు, బీసీలకు దక్కాల్సిన రాజకీయ ప్రాధాన్యత, రిజర్వేష న్లు, సంక్షేమ నిధుల ఖర్చుపై సంచ ల న ఆరోపణలు చేశారు. రెడ్లు, వెలమల ఆధీనంలో కోటి ఎకరాల భూములు ఉన్నాయ ని, 58 వేల కోట్ల బీసీ నిధుల లెక్కలు తేల్చాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

    995 మంది దొరల వద్ద కోటి ఎకరాల భూములా

    తెలంగాణలో జాగీర్దారీ వ్యవస్థ ర ద్దయినప్పటికీ భూముల విష యంలో సామాజిక న్యాయం జ రగలేదని మల్లన్న ఆరో పించారు. 1949 ఆగస్టు 15న నిజాం జారీ చేసిన 1358 ఫర్మా నా ద్వారా జా గీర్దారీ వ్యవస్థ రద్దయిందని గుర్తుచేశారు. ఎన్‌సీ ఈఆర్‌టీ 8వ త రగతి సామాజిక శాస్త్ర పుస్తకంలో ని వివరా ల ను ప్రస్తావిస్తూ, జాగీ ర్దారీ వ్యవస్థ రద్దు చారిత్రక ఆధారాలను ఆయన వివరించారు. అయినప్పటికీ 995 మంది రెడ్లు, వెల మలు దొంగ పత్రాలతో భూ ములను తమ ఆధీనంలో ఉం చుకున్నారని, వారి వద్ద కోటి ఎక రాల భూములు ఉన్నాయని ఆ రోపించారు. గత 74 ఏళ్లుగా రెవె న్యూ రికార్డుల వ్యవహా రంలో బీ సీలకు న్యాయం జరగలేదని వి మర్శించారు. 1963 లో కరీంనగర్‌కు చెందిన భూస్వాములు దాఖలు చేసిన కేసు లో సుప్రీంకోర్టు భూములపై స్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొ న్నారు.

    మియాపూర్‌లో 550 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు తీర్పు

    మియాపూర్ పరిధిలో 550 ఎక రాల ప్రభుత్వ భూమికి సంబం ధించి కేసీఆర్ కుటుంబం హక్కు లు పొందేందుకు ప్రయత్నిం చిం దని మల్లన్న ఆరోపించారు. తా జాగా సుప్రీంకోర్టు తీర్పు జాగీర్దారీ వ్యవస్థ రద్దు, భూముల ప్రభుత్వ యాజమాన్యానికి సంబంధించిన అంశాలను స్పష్టం చేసిందని పే ర్కొన్నారు. త మ పార్టీ అధికారం లోకి వస్తే అక్రమంగా ఉన్నట్లు తాము ఆరో పిస్తున్న భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పం పిణీ చేస్తామని ప్రకటించారు.

    నాగార్జునసాగర్‌లో బీసీలకు రాజకీయ ప్రాధాన్యతేది

    నాగార్జునసాగర్ నియోజకవర్గ ఓ టర్ల గణాంకాలను ప్రస్తావిం చిన మల్లన్న, మొత్తం 2,33,514 ఓట్ల లో బీసీల ఓట్లు 1,48 ,000 ఉండ గా, రెడ్ల ఓట్లు 15,000 మాత్రమేనని పేర్కొన్నా రు. అధిక సంఖ్య లో ఉన్న బీసీలకు తగిన రాజకీయ ప్రాతి ని ధ్యం దక్కడం లేదని విమర్శించారు.సీనియర్ రాజకీయ నా యకుడు జానారెడ్డి రాజ కీయ ప్రస్థానంతో పాటు వివిధ పార్టీ ల్లో నాయకుల పార్టీ మార్పు లపైనా విమర్శలు గుప్పించారు.

    బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలకు ప్రశ్నలు

    బీసీ రిజర్వేషన్ల అమలులో గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభు త్వం ఇచ్చిన హామీలను మల్లన్న ప్ర శ్నించారు. 1986లో ఎన్టీ ఆర్ ప్ర భుత్వం తీసుకొచ్చిన జీవో నం బర్ 166ను ప్రస్తావిస్తూ, ఆ జీవో రద్దు కావడానికి జానారెడ్డి కార ణమయ్యారని ఆరో పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ చ్చిన ఆరు నెలల్లో బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా 42 శాతం రి జర్వేషన్లు కల్పి స్తామని మేని ఫె స్టోలో హామీ ఇచ్చి అమలు చే యలేదని వి మర్శించారు. కేసీఆ ర్ హయాంలో బీసీ రిజర్వేషన్లు 33 శాతం నుంచి 23 శాతానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 19 శాతానికి తగ్గాయని ఆరోపించారు.

     లెక్కల్లో 20 లక్షల మంది బీసీలు ఏమయ్యారు?

    రాష్ట్రంలో నిర్వహించిన కులగ ణన గణాంకాలపైనా మల్లన్న అ నుమానాలు వ్యక్తం చేశారు. కేసీ ఆర్ హయాంలో బీసీల జనాభా రెండు కోట్లుగా పేర్కొంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వ గణాం కాల్లో 1.80 కోట్లకు తగ్గిందని ఆరోపించారు. దాదాపు 20 లక్ష ల మంది బీసీల జనాభా లెక్కల్లో ఎలా తగ్గిందో ప్ర భుత్వం వి వరించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో రెడ్ల జనాభా గణాంకాల్లో పెరుగుదల ఎలా నమోదైందని ప్రశ్నించారు.

    మద్యం అమ్మకాలపై ప్రభుత్వానికి చురకలు

    రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయా లు సమయానికి తెరుచుకోక పోయినా వైన్‌షాపులు మాత్రం ఉద యం 10 గంటలకే తెరు చుకుం టున్నాయని మల్లన్న ఎద్దేవా చే శారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మ ద్యం దుకాణాలకు దేవతలు, బీ సీ మహిళల పేర్లు పెట్టడాన్ని త ప్పుబట్టారు. మద్యపాన నియంత్రణ చేపట్టా ల్సి న ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాల లక్ష్యాలను నిర్దేశించడం ఏమిటని ప్రశ్నించా రు. పేదల కష్టార్జితాన్ని మద్యం రూపంలో ఖర్చు చేయిస్తూ పాల కులు లబ్ధి పొందుతున్నారని ఆ రోపిం చారు.

    రూ.58 వేల కోట్ల బీసీ నిధులపై లెక్కలు చెప్పాలి

    బీసీల సంక్షేమం కోసం ఏటా రూ .20 వేల కోట్ల చొప్పున మూ డేళ్ల లో రూ.60 వేల కోట్లు ఖర్చు చే స్తామని ప్రభుత్వం ప్రక టించిం ద ని మల్లన్న గుర్తుచేశారు. అసెంబ్లీ లో ప్రశ్న నంబర్ 4429 ద్వారాఈ అంశాన్ని లేవనెత్తినట్లు తెలిపా రు. అయితే రూ.60 వేల కోట్లకు గాను కేవలం రూ.2,400 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తనకు అందిన వివరాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. మిగిలిన రూ .58 వేల కోట్ల నిధులు ఎక్కడికి వె ళ్లాయో ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

       2028లో బీసీ రాజ్యం ఏర్పాటు చేస్తాం

    బీసీ రాజ్యాధికార యాత్రలో భా గంగా 1,000 కిలోమీటర్ల పాద యాత్ర చేపడుతున్నామని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా యాత్రను ఆపే ప్రసక్తే లేదని తీన్మార్ మల్ల న్న స్పష్టం చేశారు. 2028 ఎన్నిక ల్లో తెలంగాణలో బీసీల ప్రభు త్వం ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు.రాష్ట్ర జ నాభాలో 60 శాతం ఉన్న బీసీలు రాజకీయంగా, సామాజికంగా త మ హక్కులను సాధించుకోవాల ని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుపై ఓటు వేసి తమ పార్టీకి మద్ద తు ఇవ్వాలని కోరారు.మొత్తంగా భూముల హక్కులు, బీసీ రిజర్వే షన్లు, సంక్షేమ నిధుల వినియో గం, రాజకీయ ప్రాతి నిధ్యం వంటి అంశాలను కేంద్రంగా చేసుకుని తీన్మార్ మల్లన్న సాగిస్తున్న యా త్ర తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతోంది. ఆయన చేసిన ఆరోపణలపై సంబంధిత ప్రభుత్వాలు, రాజకీయ నాయ కుల వివరణలు వెలువడాల్సి ఉంది.

    Mlc Teenmaar Mallanna Allegations on BC Funds

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.